Apple Holiday Offers : ఆపిల్ హాలిడే ఆఫర్లు.. ఐఫోన్ 17, మ్యాక్‌బుక్ ఎయిర్ M4, ఆపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్‌పై ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!
Apple Holiday Offers : ఆపిల్ లేటెస్ట్ డివైజ్‌లపై పండుగ ఆఫర్లను ప్రకటించింది. ఐఫోన్‌లు, మ్యాక్‌బుక్‌లు, ఐప్యాడ్, ఆపిల్ వాచ్‌లతో సహా వివిధ ప్రొడక్టులపై ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌తో అందిస్తోంది.
Apple Holiday Offers
Apple Holiday Offers : హాలిడే సీజన్ వచ్చేసింది.. ఆపిల్ లేటెస్ట్ డివైజ్‌లపై కొత్త పండుగ ఆఫర్లను అందిస్తోంది. ఈ డిస్కౌంట్లు సాంప్రదాయ ధరల తగ్గింపులు కానప్పటికీ, కుపెర్టినో ఆధారిత టెక్ దిగ్గజం ఐఫోన్లు, మాక్‌బుక్‌లు, ఐప్యాడ్‌లు, ఆపిల్ వాచ్‌లు మరిన్నింటిపై ఆకర్షణీయమైన ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ డీల్స్ అందిస్తోంది.
ఈ ఆఫర్‌లు ఇప్పుడు ఆపిల్ ఇండియా (Apple Holiday Offers) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. సేవింగ్స్ కోసం ఎక్కువగా బ్యాంక్ కార్డ్ ప్రమోషన్‌ల ద్వారానే అందిస్తోంది. ఆసక్తికరంగా, బ్రాండ్-న్యూ డివైజ్‌లు కూడా భారీ తగ్గింపుతో అందిస్తున్నాయి. పాత ఆపిల్ మోడల్స్ ఇప్పటికే తగ్గింపు ధరలకే లభిస్తున్నాయి. ఈ సీజన్‌లో ఆపిల్ కొత్త లైనప్‌లో ఏయే డివైజ్‌లపై ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తోందో ఇప్పుడు పూర్తి వివరాలతో పరిశీలిద్దాం..
మాక్‌బుక్ ఎయిర్, మాక్‌బుక్ ప్రోపై రూ. 10వేలు క్యాష్‌బ్యాక్ :
ఆపిల్ అందించే కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్ M4పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. 13-అంగుళాల మోడల్, ఫస్ట్ రూ.99,900 ధరతో ఉండగా, ఇప్పుడు రూ.89,900కు అందుబాటులో ఉంది. ఐసీఐసీఐ, యాక్సస్ అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డ్ హోల్డర్లకు ఫ్లాట్ రూ.10వేలు క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. M4 సిరీస్ చిప్‌లతో భారీ మ్యాక్‌బుక్ ప్రో మోడళ్లకు కూడా అదే రూ.10వేలు ఆఫర్ వర్తిస్తుంది. ఎలాంటి కూపన్ కోడ్‌లు లేవని గమనించాలి. మీరు అర్హత ఉన్న కార్డ్‌తో చెక్అవుట్ వద్ద డిస్కౌంట్ ఆటోమాటిక్‌గా కనిపిస్తుంది.
14-అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో M4 : ఇప్పుడు ధర రూ.1,59,900
16-అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో M4 ప్రో : ఇప్పుడు ధర రూ. 2,39,900
ఐఫోన్ 17 సిరీస్‌పై బిగ్ డిస్కౌంట్లు :
ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ రూ.5వేలు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌తో వస్తుంది. మెయిన్ రిటైలర్లలో బేస్ ఐఫోన్ 17 ఎక్కువగా స్టాక్‌లో లేనప్పటికీ, ఆపిల్ వెబ్‌సైట్ ఇప్పటికీ లిమిటెడ్ సేల్ అందిస్తుంది. అయినప్పటికీ అర్హత కలిగిన కార్డులు లేని కస్టమర్లకు రూ.1,000 తగ్గింపు మాత్రమే అందిస్తుంది.
రూ.1,34,900 ధర గల ఐఫోన్ 17 ప్రో, ICICI, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, యాక్సిస్ బ్యాంక్ యూజర్లకు పూర్తిగా రూ.5వేలు క్యాష్‌బ్యాక్ అందిస్తుంది. ఆపిల్ ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ వంటి పాత మోడళ్లు (Apple.in)లో రూ.4వేలు క్యాష్‌బ్యాక్‌తో వస్తాయి. కానీ, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్ వంటి ఆన్‌లైన్ రిటైలర్లు భారీ డిస్కౌంట్లను అందిస్తాయి. కొన్ని డిస్కౌంట్లు రూ.9వేల వరకు పొందవచ్చు.
ఆపిల్ వాచ్, ఎయిర్‌పాడ్‌లు ఐప్యాడ్‌లపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది. ఆపిల్ మిగిలిన లైనప్‌లో ఆపిల్ వాచ్ సిరీస్ 11 ధర రూ. 4వేలు బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తుండగా, ఆపిల్ వాచ్ SE 3 ధర రూ. 2వేలు తగ్గింపు, ఎయిర్‌పాడ్స్ ప్రో 3, ఎయిర్‌పాడ్స్ 4 ధర రూ. 1,000 క్యాష్‌బ్యాక్ అందిస్తోంది.
టాబ్లెట్ కొనుగోలుదారులకు కొత్త ఐప్యాడ్ ఎయిర్ (11-అంగుళాల నుంచి 13-అంగుళాలు) పై రూ. 4వేలు తగ్గింపు లభిస్తుంది. స్టాండర్డ్ ఐప్యాడ్, ఐప్యాడ్ మినీపై రూ. 3వేలు తగ్గింపు లభిస్తుంది. ఆపిల్ వాచ్ కొనుగోలుదారులకు 3 నెలల ఫ్రీ ఆపిల్ మ్యూజిక్, ఆన్‌లైన్ స్టోర్ ద్వారా ఆపిల్ డివైజ్ కొనుగోలు చేసే ఎవరికైనా 3 నెలల ఆపిల్ టీవీ+ సబ్‌స్క్రిప్షన్‌తో ఆపిల్ ఈ డీల్ అందిస్తోంది.
