Apple iPhone 14 Discount : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్లు.. ఎక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేయాలంటే?

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రెండింట్లో 2022 ఐఫోన్‌పై భారీ తగ్గింపులను అందిస్తున్నాయి. మీరు ఎక్కడ నుంచి ఐఫోన్ 14 కొనుగోలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Apple iPhone 14 Discount : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్లు.. ఎక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేయాలంటే?

Apple iPhone 14 available at a discount on both Flipkart and Amazon

Apple iPhone 14 Discount : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 14 భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఆపిల్ గత ఏడాది ఐఫోన్ 15ను లాంచ్ చేసింది. ఇప్పుడు, ఐఫోన్ 16 గురించి ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

Read Also : WhatsApp Online Status : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. మీ కాంటాక్టుల్లో ఆన్‌లైన్‌లో ఉన్నవారిని ఒకేచోట చూడొచ్చు!

మీ దగ్గర ఐఫోన్ 13 ఉంటే.. వెంటనే అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. కొత్త ఐఫోన్15 కోసం తగినంత బడ్జెట్ లేకపోతే.. ఇదే సరైన అవకాశం. మీరు ఐఫోన్ 14ని ఎంచుకోవచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రెండింట్లో 2022 ఐఫోన్‌పై భారీ తగ్గింపులను అందిస్తున్నాయి. మీరు ఎక్కడ నుంచి ఐఫోన్ 14 కొనుగోలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లో ఐఫోన్ 14 డీల్.. ఎక్కడ కొనాలంటే? :
ఆపిల్ ఐఫోన్ 14 బేస్ వేరియంట్, 128జీబీ స్టోరేజ్‌తో, ఫ్లిప్‌కార్ట్‌లో 15 శాతం ఫ్లాట్ తగ్గింపుతో లభిస్తుంది. ఈ ఐఫోన్ రూ. 58,999కి విక్రయిస్తోంది. ఈ ఐఫోన్ అసలు ధర రూ.69,900 ఉండగా, బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు, ఆరు లేదా 9 నెలల కాలపరిమితితో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ. 2,500 తగ్గింపు పొందవచ్చు.

ఈ ఐఫోన్ ధర రూ.56,499కి తగ్గుతుంది. మీ పాత ఫోన్‌ని ఎక్స్ఛేంజ్ చేసుకుంటే.. ఐఫోన్ 14ని ఇంకా తక్కువ ధరకు పొందవచ్చు. మీ ఫోన్ వర్కింగ్ కండిషన్‌లో ఉంటే.. భారీ డిస్కౌంట్ పొందవచ్చు. మీ ప్రాంతం ఎక్స్ఛేంజ్ ఆఫర్‌కు అర్హత కలిగి ఉందో లేదో చెక్ చేసేందుకు మీరు చేయాల్సిందల్లా.. ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లో మీ పిన్‌కోడ్‌ను ఎంటర్ చేయాలి.

మరోవైపు అమెజాన్‌లో ఐఫోన్ 14 10 శాతం తగ్గింపుతో అందిస్తోంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ. 3వేల తగ్గింపు, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై (అమెజోన్ పే, ఐసీఐసీఐక్రెడిట్ కార్డ్ మినహా) రూ. 3వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా అందిస్తుంది.

అమెజాన్ పే క్రెడిట్ కార్డ్ కలిగి ఉంటే.. రూ. 2వేల తగ్గింపు పొందవచ్చు. మీ వద్ద ఉన్న కార్డ్‌ని బట్టి ఐఫోన్ 14 రూ. 59,800 లేదా రూ. 60,800కి సొంతం చేసుకోవచ్చు. మీకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే.. ఫ్లిప్‌కార్ట్ నుంచి ఐఫోన్ 14ని పొందవచ్చు. ఈ ఐఫోన్ మోడల్ రూ. 56,499కి పొందవచ్చు. అమెజాన్‌తో పోలిస్తే.. ఫ్లిప్‌కార్ట్ భారీ తగ్గింపును అందిస్తోంది.

ఐఫోన్ 14 :
2022లో భారత మార్కెట్లో ఐఫోన్ 14 లాంచ్ అయింది. ఈ లైనప్‌లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14ప్రో, ఐఫోన్ 14ప్రో మ్యాక్స్ ఉన్నాయి. ఐఫోన్ 14, 2021 ఐఫోన్ 13 మధ్య చాలా తేడాలు ఉన్నప్పటికీ, ఐఫోన్ 14 ప్రో మోడల్‌లు అప్‌గ్రేడ్ ప్రాసెసర్, డైనమిక్ ఐలాండ్ నాచ్ డిజైన్ వంటి మార్పులను కలిగి ఉంది. అదే డైనమిక్ ఐలాండ్ నాచ్ ఇప్పుడు అన్ని ఐఫోన్ 15 మోడళ్లలోనూ అందుబాటులో ఉంది.

ఐఫోన్ 14 మోడల్‌ను ఐఫోన్ 13తో పోల్చినప్పుడు కెమెరా అప్‌గ్రేడ్ అవుతుంది. ఉదాహరణకు.. తక్కువ-కాంతి ఫోటోగ్రఫీ, బ్యాక్ కెమెరాలో ఫోటోనిక్ ఇంజిన్‌ అప్‌గ్రేడ్ అయింది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఐఫోన్ 13, ఐఫోన్ 14తో సమానంగా ఉంది. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే.. ఐఫోన్ 13, ఐఫోన్ 14 రెండూ 12ఎంపీ కెమెరాలతో వస్తాయి. రెండింటి మధ్య తేడా ఏంటంటే.. ఐఫోన్ 13 2.2 ఎపర్చరుతో పోలిస్తే.. ఐఫోన్ 14 మోడల్ 1.9 ఎపర్చరును కలిగి ఉంది. ఐఫోన్ 14 మొదటిసారిగా ఫ్రంట్ కెమెరాలో ఆటో-ఫోకస్ ఫీచర్‌తో వచ్చింది.

Read Also : Ola electric Scooter : హీరో స్ప్లెండర్, హోండా యాక్టివా కన్నా చౌకైన ధరకే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు.. 95కి.మీ టాప్ రేంజ్..!