Flipkart Big Saving Days Sale : ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. ఆపిల్ ఐఫోన్ 14పై భారీ తగ్గింపు.. మరెన్నో ఫోన్లపై ఆఫర్లు.. డోంట్ మిస్!

Flipkart Big Saving Days Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సందర్భంగా ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి. ఇతర స్మార్ట్‌ఫోన్లపై అనేక ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తోంది.

Flipkart Big Saving Days Sale : ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. ఆపిల్ ఐఫోన్ 14పై భారీ తగ్గింపు.. మరెన్నో ఫోన్లపై ఆఫర్లు.. డోంట్ మిస్!

iPhone 14 gets 14 percent price cut during Flipkart Big Saving Days

Flipkart Big Saving Days Sale on Apple iPhone 14  : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Flipkart Big Saving Days) సందర్భంగా అనేక ఐఫోన్‌లతో సహా వివిధ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ ధరలను తగ్గించింది. ఆపిల్ ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ 14 సిరీస్ (iPhone 14 Series) కూడా ధర తగ్గింపులను అందిస్తోంది. ఫలితంగా, (iPhone 14)ని ఇతర ఆఫర్‌లతో పాటు భారీ తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. మీరు ఐఫోన్ 14 ఎందుకు కొనాలి? అంటే.. ఈ ఐఫోన్‌లో పెద్ద కెమెరా అప్‌గ్రేడ్, చిన్న నాచ్, కొత్త ఫీచర్లు, మరిన్ని ఏళ్ల వరకు iOS సపోర్టు అందిస్తుంది. మీరు ఈ ఐఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో అనేక స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన డీల్స్ అందిస్తోంది. కేవలం డిస్కౌంట్‌లు మాత్రమే కాకుండా, ఐఫోన్ 14లో అదనపు ఎక్స్ఛేంజ్, బ్యాంక్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు. ఇంతకీ, అవేంటో ఓసారి లుక్కేయండి.

Read Also : Apple iPhone 14 Series : ఆపిల్ ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్.. ఇందులో ఏ ఐఫోన్ కొంటే బెస్ట్ అంటే? ఇప్పుడే తెలుసుకోండి..!

ఐఫోన్ 14పై డిస్కౌంట్ :
ఫ్లిప్‌కార్ట్ జాబితా ప్రకారం.. ఈ ఐఫోన్ 14 ప్రీమియం ధర రూ. 79900గా ఉండగా.. 128GB వేరియంట్ చాలా తక్కువ ధరకు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14 ధరను రూ. 67999గా నిర్ణయించింది. ఐఫోన్ యూజర్ల కోసం 14 శాతం ప్రారంభ తగ్గింపును అందిస్తోంది. ఐఫోన్ ధరను మరింత తగ్గించడానికి బ్యాంక్, ట్రేడ్-ఇన్ ఆఫర్ల నుంచి మరిన్ని బెనిఫిట్స్ పొందవచ్చు.

iPhone 14 gets 14 percent price cut during Flipkart Big Saving Days

Flipkart Big Saving Days Sale iPhone 14 gets 14 percent price cut  

స్మార్ట్‌ఫోన్లపై మరెన్నో ఆఫర్లు :
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14పై అద్భుతమైన డిస్కౌంట్‌తో పాటు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఇప్పుడే ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. ఐఫోన్ 14పై ఆకర్షణీయమైన డిస్కౌంట్ పొందవచ్చు. మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పొందితే..  ఐఫోన్ 14పై రూ. 35వేలు తగ్గింపు పొందవచ్చు. మీ పిన్ కోడ్‌ని ఎంటర్ చేసి, మీ లొకేషన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉందో లేదో చెక్ చేయాలి.

అలాగే, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ మీరు ఎక్స్ఛేంజ్ చేస్తున్న స్మార్ట్‌ఫోన్ మోడల్, ఫోన్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. ఐఫోన్ యూజర్లు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI, డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ. 1000 వరకు (10 శాతం) తగ్గింపును కూడా పొందవచ్చు. యాక్సిస్ బ్యాంక్ లావాదేవీలపై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

Read Also : Flipkart Big Saving Days Sale : ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి.. డోంట్ మిస్..!