Apple IPhone 14 Series Event: నేడు యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ ఈవెంట్.. మరికొన్ని కొత్త ఉత్పత్తులు.. ప్రత్యక్ష ప్రసారాన్ని ఎలా చూడాలంటే..
టెక్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న అమెరికన్ కంపెనీ యాపిల్ ఐఫోన్ 14 లాంచ్ ఈవెట్ ఈరోజు రాత్రి జరగనుంది. భారతీయ కాలమానం ప్రకారం.. రాత్రి 10.30 గంటలకు ఈ ఈవెంట్ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఈ ఈవెంట్‌లో యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ తో పాటు పలురకాల నూతన ఉత్పత్తులను విడుదల చేసేందుకు సిద్ధమైంది.

Apple Iphone 14 series
Apple IPhone 14 Series event: టెక్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న అమెరికన్ కంపెనీ యాపిల్ ఐఫోన్ 14 లాంచ్ ఈవెట్ ఈరోజు రాత్రి జరగనుంది. భారతీయ కాలమానం ప్రకారం.. రాత్రి 10.30 గంటలకు ఈ ఈవెంట్ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఈ సంవత్సరంలో జరిగే అతిపెద్ద టెక్ ఈవెంట్‌లలో ఇది ఒకటి. కొన్ని నూతన ఉత్పత్తులతో పాటు యాపిల్ తన కొత్త ఐఫోన్‌లను ఈ ఈవెంట్ లో యాపిల్ ప్రకటించనుంది.
Apple iPhone 14 Series: ఆపిల్ ఐఫోన్ 14 ఫీచర్స్ లీక్.. లుక్ అదిరిపోయింది
కొవిడ్-19 మహమ్మారి కారణంగా గత రెండు ఈ వెంట్‌లు ఆన్‌లైన్‌లో జరిగినందున కంపెనీ ఈ ఐఫోన్ 14 ఈవెంట్‌ను దాదాపు రెండేళ్ల తర్వాత వ్యక్తిగతంగా నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్‍ను ప్రజలు ఇళ్ల వద్ద కూర్చొని ఆన్‌లైన్ ప్లాట్ ఫారమ్ ల ద్వారా వీక్షించొచ్చు. యాపిల్ ఐఫోన్ 14 బిగ్ లాంచ్ ఈవెంట్ రాత్రి 10.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ ఈవెంట్‌ను చూడాలనుకునే వారు అధికారిక యాపిల్ వెబ్‌సైట్, దానికి సంబంధించిన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో చూడొచ్చు. ఇదిలాఉంటే ఈరోజు రాత్రి కంపెనీ నాలుగు కొత్త ఐఫోన్‌లను ప్రకటించేందుకు సిద్ధమైంది. ఇవి ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ ప్రో మాక్స్‌లతోపాటు ఆపిల్ కొత్త ఐఫోన్ మోడల్‌ను కూడా పరిచయం చేస్తుందని అందరూ భావిస్తున్నారు.
ఇదిలాఉంటే ఐఫోన్ 14 సిరీస్ ధర ఈరోజు కంపెనీ ప్రకటించనుంది. ఐఫోన్ 14 ప్రారంభ ధర రూ. 79,990 నుండి ప్రారంభమవుతుందని, అంతకంటే ఎక్కువగానూ ఉండొచ్చని అంచనా. కొత్త ఐఫోన్‌లతో పాటు ఆపిల్ వాచ్ 8 సిరీస్‌ను, కొత్త ఆపిల్ వాచ్ ప్రో, ఎయిర్‌పాడ్స్ ప్రో 2ని కూడా ఆవిష్కరించాలని యాపిల్ భావిస్తోంది. అదేవిధంగా ఎం2 చిప్‌తో కొత్త మ్యాక్ ల్యాప్‌టాప్‌లు విడుదలవుతాయి. కొత్త ఐప్యాడ్ మోడల్స్‌ను యాపిల్ తీసుకురానుంది. iOS 16ను కూడా విడుదల చేయనుంది. ఈ యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ మోడల్స్ శాటిలైట్ కనెక్టివిటీ సపోర్ట్‌తో రానున్నాయి. సెల్యూలర్ కవరేజ్ లేని ప్రాంతాల్లో కూడా శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా కాల్స్, మెసేజ్‌లు చేసుకునేలా ఇది ఉపయోగపడనుంది. ముందుగా అమెరికాలో ఈ ఫీచర్ పని చేసే అవకాశం ఉంది.