Apple Far Out Event : ఆపిల్ ఐఫోన్ 14 మ్యాక్స్ లేదా ఐఫోన్ 14 ప్లస్.. ఏది ముందంటే? కొద్దిగంటల్లో తేలిపోనుంది?

Apple Far Out Event : ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ (Apple) సెప్టెంబర్ 7న (బుధవారం) Apple Far out ఈవెంట్ నిర్వహించనుంది. దీనికి కేవలం ఒక రోజు మాత్రమే సమయం ఉంది. ఆపిల్ నిర్వహించే ఈవెంట్లో అనేక కొత్త ఆపిల్ ప్రొడక్టులు లాంచ్ కానున్నాయి.

Apple Far Out Event : ఆపిల్ ఐఫోన్ 14 మ్యాక్స్ లేదా ఐఫోన్ 14 ప్లస్.. ఏది ముందంటే? కొద్దిగంటల్లో తేలిపోనుంది?

iPhone 14 Max or iPhone 14 Plus_ Apple will likely launch it tomorrow

Apple Far Out Event : ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ (Apple) సెప్టెంబర్ 7న (బుధవారం) Apple Far out ఈవెంట్ నిర్వహించనుంది. దీనికి కేవలం ఒక రోజు మాత్రమే సమయం ఉంది. ఆపిల్ నిర్వహించే ఈవెంట్లో అనేక కొత్త ఆపిల్ ప్రొడక్టులు లాంచ్ కానున్నాయి. అందులో Apple Watch Series 8, AirPods Pro 2 సహా కొత్త ప్రొడక్టులను చూసే అవకాశం ఉంది. ఆపిల్ స్టార్ ఐఫోన్ 14 సిరీస్ కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

ఈ ఏడాదిలో ఆపిల్ మినీ వెర్షన్‌ను నిలిపివేయనుంది. దానికి బదులుగా కొత్త మోడల్‌ను ఆపిల్ ప్రవేశపెట్టనుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంతకీ రాబోయే ఐఫోన్ 14 సిరీస్‌ను iPhone 14 Max లేదా iPhone 14 Plus‌గా పిలవవచ్చు. అయితే ఐఫోన్ అందించే వేరియంట్ పేరు ఇప్పటికీ వెల్లడించలేదు. సెప్టెంబర్ 7న ఆపిల్ ఈవెంట్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాబోయే కొత్త iPhone వెర్షన్ గురించి పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

iPhone 14 Max లేదా iPhone 14 Plus :
ఈ ఏడాది ప్రారంభంలో ఆపిల్ కొత్త ఐఫోన్ 14 మాక్స్ మోడల్‌ను లాంచ్ చేయనున్నట్లు వెల్లడించారు. జూలై తరువాత, ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్ (Apple iPhone 14 Plus) అని పేరు పెట్టనుందని నివేదిక పేర్కొంది. చాలా కాలం క్రితమే ఆపిల్ ప్లస్ వేరియంట్ అమ్మకాన్ని నిలిపివేసింది. అయితే ఇప్పుడు.. ఐఫోన్ 14 ప్లస్ (iPhone 14 Plus) పేరుతో కొన్ని ఫోటోలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. ఆపిల్ కొత్త మోడల్‌కు ప్లస్ లేదా మ్యాక్స్ (Plus or Max) అని పేరు పెట్టనుందా? అనేది ఎలాంటి క్లారిటీ లేదు. రేపు అంటే.. సెప్టెంబర్ 7న దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

iPhone 14 Max or iPhone 14 Plus_ Apple will likely launch it tomorrow

iPhone 14 Max or iPhone 14 Plus_ Apple will likely launch it tomorrow

iPhone 14 Max లేదా iPhone 14 Plus : ఏమేమి ఉండొచ్చుంటే?
Max లేదా Plus వేరియంట్ భారీ డిస్‌ప్లేతో రానుంది. లీక్‌ల ప్రకారం.. 6.7-అంగుళాల డిస్‌ప్లేతో రావచ్చు. ఈ డివైజ్ Apple A15 చిప్‌సెట్ ద్వారా పనిచేయనుంది. గత ఏడాదిలో మోడల్‌లు iPhone 13 సిరీస్‌ మాదిరిగానే ఉండనుంది. ఈ డివైజ్ కోసం చెల్లించే ప్రీమియం ధరను పరిగణనలోకి తీసుకుంటే నిరాశపరచవచ్చు. ఎందుకంటే.. కొత్త A16 చిప్‌తో డివైజ్ అందించాలని Apple నిర్ణయించే అవకాశాలు ఉన్నాయి. బ్యాటరీ యూనిట్ లేదా ర్యామ్ వివరాలు రివీల్ కాలేదు.

కానీ, ‘Max’ మోడల్.. పెద్ద బ్యాటరీతో పాటు భారీ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని కొన్ని నివేదికలు సూచించాయి. ఈ రెండు డివైజ్‌లో కీలకమైన ఫీచర్లు వినియోగదారులను ఆకర్షించేలా ఉంటాయని సమాచారం. ఐఫోన్ 14 Max లేదా ఐఫోన్ 14 Plus అధిక రిఫ్రెష్ రేట్ స్క్రీన్‌ను కలిగి ఉండవచ్చని భావించవచ్చు. ఇక డిస్‌ప్లే 90Hz వద్ద రిఫ్రెష్ అయ్యే అవకాశం ఉంది. ఆపిల్ రిటైల్ బాక్స్‌లో ఛార్జర్‌ను అందించడం లేదు. ఎందుకంటే ఆపిల్ ఐఫోన్‌లతో అందించడం ఆపివేసింది.

iPhone 14 Max or iPhone 14 Plus_ Apple will likely launch it tomorrow

iPhone 14 Max or iPhone 14 Plus_ Apple will likely launch it tomorrow

iPhone 14 Max లేదా iPhone 14 Plus : ధర అంచనా :
ఆపిల్ కొత్త ఐఫోన్ మోడల్‌ను ఎలా ప్రవేశపెట్టనుందో ఇప్పటికీ క్లారిటీ లేదు. మినీ వెర్షన్‌కు బదులుగా ఆపిల్ తీసుకురానుంది. ప్రామాణిక iPhone 14 మోడల్ కన్నా తక్కువ ధరను కలిగి ఉంటుందని నివేదికలు సూచించాయి. కానీ, అది జరిగేలా కనిపించడం లేదు. ఆపిల్ రాబోయే ఐఫోన్ 14 సిరీస్ ఫోన్‌కు Plus అని పేరు పెట్టే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం.. iPhone 14, iPhone 14 Pro మధ్య ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి, iPhone 14 Max లేదా iPhone 14 Plus ధర ఎంత ఉంటుందో క్లారిటీ లేదు.

లీక్‌ల ప్రకారం.. ఐఫోన్ 14 ప్రారంభ ధర భారత మార్కెట్లో రూ. 80,000 నుంచి రూ. 85,000 మధ్య ఉండవచ్చు. అదేవిధంగా iPhone 14 Plus మోడల్ ధర కొత్త ఐఫోన్ మోడల్‌పై రూ. 75,000 కన్నా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఆపిల్ ఈవెంట్లో లాంచ్ చేయబోయే ఐఫోన్ 14 సిరీస్ ఏ పేరుతో లాంచ్ అయ్యేది తెలియాలంటే అప్పటివరకూ ఆగాల్సిందే.

Read Also : Apple iPhone 14 Max : ఆపిల్ కొత్త ఐఫోన్ 14 Max మోడల్ వస్తోంది.. సెప్టెంబర్ 7న లాంచ్ అయ్యే ఛాన్స్..!