Apple iPhone 15 : ఐఫోన్ ప్రియులకు పండగే.. అమెజాన్‌లో ఐఫోన్ 15 అతి చౌకైన ధరకే.. ఈ ఐఫోన్ ఎందుకు కొనాలి? వద్దంటే? 10 కారణాలివే..!

Apple iPhone 15 : అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 15 డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ ఐఫోన్ 15 మోడల్ అసలు కొనాలా? వద్దా? అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Apple iPhone 15 : ఐఫోన్ ప్రియులకు పండగే.. అమెజాన్‌లో ఐఫోన్ 15 అతి చౌకైన ధరకే.. ఈ ఐఫోన్ ఎందుకు కొనాలి? వద్దంటే? 10 కారణాలివే..!

Apple iPhone 15

Updated On : November 15, 2025 / 12:18 PM IST

Apple iPhone 15 : ఆపిల్ లవర్స్‌కు అదిరిపోయే న్యూస్.. అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 15 ధర భారీగా తగ్గింది. కూపన్లు, కండిషన్స్ లేకుండా ఏకంగా రూ. 50,990కి తగ్గింది. ఐఫోన్ 16e ధరతో పోటీగా తగ్గింపు ధరకే లభిస్తోంది. మీరు కూడా ఐఫోన్ 15 కొనాలని అనుకుంటే ఇది మీకోసమే..

ఐఫోన్ 15 కొనే ముందు మీరు కొన్నింటిని (Apple iPhone 15)  చెక్ చేసుకోవడం బెటర్.. ఈ ఐఫోన్ 15 ఎందుకు కొనాలి? ఎందుకు కొనకూడదు అనేది తెలుసుకోండి. వినియోగదారులు ఐఫోన్ 15 ఎందుకు కొనాలంటే? 6 కారణాలు చెప్పొచ్చు. అలాగే, ఐఫోన్ 15 ఎందుకు కొనొద్దంటే మరో 4 కారణాలను చెక్ చేయొచ్చు.

అమెజాన్‌లో గ్రీన్ కలర్ ఐఫోన్ 15 దేశంలోనే బెస్ట్ వాల్యూ ధర ప్రీమియం ఐఫోన్‌లలో ఒకటిగా నిలిచింది. అధికారికంగా ఈ ఐఫోన్ 15 రూ. 59,900 ధర ఉండగ ఇప్పుడు తగ్గింపు ధరతో రూ. 50,990కు లభిస్తోంది. అది కూడా గ్రీన్ కలర్ వేరియంట్ మాత్రమే ఈ ధరతో అందుబాటులో ఉంది. ఇతర కలర్ ఆప్షన్లలో ఐఫోన్ 15 కొంచెం ఖరీదైనవిగా చెప్పొచ్చు. ఆపిల్ ఐఫోన్ 16e కన్నా ఎందుకు ఈ ఐఫోన్ 15 బెటర్ అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఐఫోన్ 15 కొనేందుకు 6 కారణాలివే :
1. కంపర్టబుల్ డిజైన్ : ఐఫోన్ 15లో స్మూత్ ఎడ్జెస్, మ్యాట్ ఫినిషింగ్‌తో వస్తుంది. పట్టుకునేందుకు వీలుగా గ్రిప్ బాగుంటుంది. రీఫైన్డ్ కలర్స్ ఐఫోన్‌కు మరింత మోడ్రాన్, మినిమలిస్ట్ లుక్ అందిస్తాయి.

2. స్ట్రాంగ్ డ్యూరబిలిటీ : ఈ హ్యాండ్‌సెట్ ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉంటుంది. సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్‌తో పాటు IP68 వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుంది.

Read Also : Google Pixel 8 Price : మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. గూగుల్ పిక్సెల్ 8పై ఏకంగా రూ. 40వేలు తగ్గింపు.. ఈ ఫోన్ ఎందుకు కొనాలంటే?

3. డైనమిక్ ఐలాండ్‌తో వివిడ్ డిస్‌ప్లే : డిస్‌ప్లే క్లియర్ క్వాలిటీతో వస్తుంది. HDR కంటెంట్‌కు అద్భుతంగా ఉంటుంది. డైనమిక్ ఐలాండ్‌తో మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ఈజీగా నావిగేట్ చేయొచ్చు.

4. USB-C లైఫ్ టైమ్ : USB-C సపోర్టుతో వస్తుంది. మీ ల్యాప్‌టాప్, పవర్ బ్యాంక్, ఇయర్‌బడ్స్, SSD వంటివి మీ ఐఫోన్ 15 కోసం కేబుల్, లైట్నింగ్ ఛార్జింగ్ పోర్ట్ వంటి అతిపెద్ద అప్‌గ్రేడ్ అందిస్తుంది.

5. స్పీడ్ పర్ఫార్మెన్స్ : A16 బయోనిక్ ద్వారా ఆధారితమైన ఈ హ్యాండ్‌సెట్ యాప్‌లు, గేమ్‌లు, మల్టీ టాస్కింగ్‌ చేయొచ్చు. బ్యాటరీ లైఫ్ స్థిరంగా ఉంటుంది.

6. 48MP మెయిన్ కెమెరా : అప్‌గ్రేడ్ 48MP మెయిన్ కెమెరా అనేక కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. వీడియో క్వాలిటీ పరంగా అద్భుతంగా ఉంటుంది. ఆపిల్ లెజండరీ స్టేబిలైజేషన్ సపోర్టు ఉంది.

ఐఫోన్ 15 ఎందుకు కొనద్దంటే? 4 కారణాలివే :
1. ఐఫోన్ 16e ఏఐ సపోర్టు : ఐఫోన్ 16e A18 చిప్‌సెట్, భారీ ర్యామ్‌తో వస్తుంది. ఐఫోన్ 15లో లేని ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌కు సపోర్టు ఇస్తుంది.

2. పాత 60Hz డిస్‌ప్లే, స్లో ఛార్జింగ్ : ప్రస్తుతం మార్కెట్లో లభ్యమయ్యే ఫోన్లతో పోలిస్తే పాత డిస్‌ప్లే, ఛార్జింగ్ స్పీడ్ తక్కువగా ఉంటుంది. 60Hz రిఫ్రెష్ రేట్ కేవలం 20W ఛార్జింగ్ చాలా తక్కువ. చాలా ఆండ్రాయిడ్ ఫోన్ల కన్నా చాలా వెనుకబడి ఉంది.

3. ఇదే ధరలో ఆండ్రాయిడ్ ఫోన్లు : శాంసంగ్, వన్‌ప్లస్, వివో వంటి బ్రాండ్‌లు మెరుగైన డిస్‌ప్లేలు, స్పీడ్ ఛార్జింగ్, లాంగ్ బ్యాటరీ లైఫ్, అప్‌గ్రేడ్‌లతో లేటెస్ట్ స్పెషిఫికేషన్లను అందిస్తున్నాయి. ఐఫోన్ 15 ధర కన్నా తక్కువ ధరకు ఆండ్రాయిడ్ ఫోన్‌లు లభ్యమవుతున్నాయి.

4. టెలిఫొటో లెన్స్ లేదు : ఈ ఫోన్‌లో డెడికేటెడ్ జూమ్ కెమెరా లేదు. అల్ట్రావైడ్‌పై ఆటోఫోకస్ లిమిటెడ్ ఉంది. ఫొటోగ్రఫీ ఔత్సాహికులకు ఫ్లెక్సిబిలిటీ లేదని చెప్పొచ్చు.