Google Pixel 8 Price : మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. గూగుల్ పిక్సెల్ 8పై ఏకంగా రూ. 40వేలు తగ్గింపు.. ఈ ఫోన్ ఎందుకు కొనాలంటే?

Google Pixel 8 Price : కొత్త గూగుల్ పిక్సెల్ 8 ఫోన్ ధర తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఏకంగా రూ. 40వేలు తగ్గింపు పొందింది. ఇలాంటి డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.

1/5Google Pixel 8 Price
Google Pixel 8 Price : పిక్సెల్ ఫ్యాన్స్ కోసం అద్భుతమైన ఆఫర్.. గూగుల్ పిక్సెల్ 8 ధర భారీగా తగ్గింది. ఈ గూగుల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ అసలు లాంచ్ ధర కన్నా రూ.40వేల వరకు తగ్గింపు ధరకు లభిస్తుంది. ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం ఈ ఫోన్‌పై భారీ ఆఫర్‌ను అందిస్తోంది. 8GB ర్యామ్ + 128GB, 8GB ర్యామ్ + 256GB వేరియంట్లలో లభిస్తుంది.
2/5Google Pixel 8 Price
గూగుల్ పిక్సెల్ 8 ధర తగ్గింపు : ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 8 బేస్ వేరియంట్ ధర రూ.38,499కు లిస్ట్ అయింది. ఇంకా, కస్టమర్లు నిర్దిష్ట బ్యాంక్ ఆఫర్ల ద్వారా రూ.3వేల వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఫోన్ ప్రారంభ ధర కేవలం రూ.35,499కి తగ్గుతుంది. అసలు లాంచ్ ధర రూ.74,999 కన్నా తక్కువ ధరకే పొందవచ్చు.
3/5Google Pixel 8 Price
గూగుల్ పిక్సెల్ 8 కీలక స్పెసిఫికేషన్లు : గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్‌ఫోన్ 120Hz హై-రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.2-అంగుళాల FHD+ డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ పిక్సెల్ ఫోన్‌కు పవర్ అందించే టెన్సర్ G3 ప్రాసెసర్, 8GB ర్యామ్ 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది.
4/5Google Pixel 8 Price
కెమెరా, బ్యాటరీ : ఆప్టిక్స్ విషయానికి వస్తే.. పిక్సెల్ 8 ఫోన్ బ్యాక్ సైడ్ మల్టీఫేస్ డ్యూయల్ కెమెరా సెటప్‌ అందిస్తుంది. 50MP ప్రైమరీ కెమెరాతో పాటు 8MP అల్ట్రావైడ్ కెమెరా కలిగి ఉంది. 10.5MP ఫ్రంట్ కెమెరాతో సెల్ఫీలు తీసుకోవచ్చు. వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ఈ పిక్సెల్ 8 ఫోన్ 30W USB టైప్-C ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 4,575mAh బ్యాటరీతో వస్తుంది. ఈ పిక్సెల్ ఫోన్ ఏఐ యాక్టివిటీతో ఫీచర్-రిచ్‌గా ఉంది.
5/5Google Pixel 8 Price
లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. గూగుల్ పిక్సెల్ 10 ప్రో, పిక్సెల్ 10 ప్రో ఎక్స్ఎల్ భారత మార్కెట్లోకి వచ్చాయి. ఈ రెండూ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 కలిగి ఉన్నాయి. గూగుల్ పిక్సెల్ 8లో పవర్‌ఫుల్ జెమిని ఏఐ ఫీచర్లతో అప్‌గ్రేడ్ అయింది. 8K వీడియో, 100x డిజిటల్ జూమ్ వంటి అడ్వాన్స్ కెమెరా ఫీచర్లతో అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి.