Apple iPhone 15 Pro : ఈ ఐఫోన్ చాలా చీప్ గురూ.. రూ. లక్షా 35వేల ఐఫోన్ 15 ప్రో జస్ట్ రూ. 71వేలకే.. ఇలా కొనేసుకోండి..!
Apple iPhone 15 Pro : ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ అయ్యాక ఐఫోన్ 15 ప్రో 2025లో టాప్ డిస్కౌంట్‌తో లభిస్తోంది. జియోమార్ట్‌లో భారీ తగ్గింపు ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ డీల్ మీకోసమే..

Apple iPhone 15 Pro : ఆపిల్ ఫ్యాన్స్ కోసం అద్భుతమైన ఆఫర్.. ఐఫోన్ 15 ప్రో భారీ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. 2025లో ఆపిల్ ఐఫోన్ 17 మార్కెట్లోకి కొత్తగా వచ్చినప్పటకీ ఐఫోన్ 15 ప్రో క్రేజ్ ఇంకా తగ్గడం లేదు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఐఫోన్ 15 ప్రో అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ మోడల్ మార్కెట్లోకి వచ్చి రెండు ఏళ్లకు పైగా అయింది.

అయినప్పటికీ అత్యంత సరసమైన ఫ్లాగ్‌షిప్‌లలో ఒకటిగా నిలిచింది. ధర మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. అధికారికంగా ఈ ఐఫోన్ మోడల్ మార్కెట్లో సేల్స్ నిలిచిపోయినా జియోమార్ట్‌లో మాత్రం ఇంకా ఐఫోన్ 15 ప్రో భారీ ధర తగ్గింపుతో లభిస్తోంది. తక్కువ బడ్జెట్ ధరలో ప్రీమియం ఐఫోన్ కొనేందుకు చూసేవారికి బెస్ట్. ఈ క్రేజీ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా చూద్దాం..

జియోమార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 15 ప్రో ధర తగ్గింపు : జియోమార్ట్ పాత ఐఫోన్‌పై అతిపెద్ద డిస్కౌంట్ అందిస్తోంది. ప్రస్తుతం ఐఫోన్ 15 ప్రో (128GB) రూ.62,953 ధరకు అందుబాటులో ఉంది. అసలు లాంచ్ ధర రూ.1,34,900 కన్నా రూ.71,947 తగ్గింపుతో లభిస్తోంది. మీరు ఎస్బీఐ కో-బ్రాండ్ ప్లాటినం క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్ రూ. 1,000 వరకు పొందవచ్చు. ప్రీమియం విభాగంలో టాప్ ఐఫోన్ దాదాపు సగం ధరకే సొంతం చేసుకోవచ్చు.

ఆపిల్ ఐఫోన్ 15 ప్రో స్పెసిఫికేషన్లు : మీరు 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే పొందవచ్చు. హుడ్ కింద ఆపిల్ A17 ప్రో చిప్ కలిగి ఉంది. 8GB ర్యామ్, ఇప్పటికీ గేమింగ్, ఎడిటింగ్ ఫీచర్లతో అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. కెమెరా సిస్టమ్ అతిపెద్ద ఫీచర్లలో ఒకటి.

48MP మెయిన్ సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్‌తో 12MP టెలిఫోటో లెన్స్, 12MP అల్ట్రావైడ్ షూటర్‌తో ఆకట్టుకునే ఫొటోలను తీయొచ్చు. ఫ్రంట్ సైడ్ 12MP సెల్ఫీ కెమెరా ఎప్పటిలాగే ఫేస్ ఐడీకి సపోర్టు ఇస్తూ పోర్ట్రెయిట్‌లు, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. 3274mAhతో బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.

ఆండ్రాయిడ్ ఫోన్లలో రేంజ్ ఎక్కువగా ఉంటుంది. ఆపిల్ ఆప్టిమైజేషన్ మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ కాలం ఉంటుంది. అంతేకాకుండా, ఐఫోన్ ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు పూర్తిగా సపోర్టు ఇస్తుంది. మీరు లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ ట్రిక్స్‌ను అందుకోవచ్చు. కలర్ ఆప్షన్లలో బ్లాక్ టైటానియం, వైట్ టైటానియం, బ్లూ టైటానియం, నేచురల్ టైటానియం కూడా ఉన్నాయి.
