Apple iPhone 17 : ఇది కదా ఆఫర్.. లేటెస్ట్ ఆపిల్ ఐఫోన్ 17 ఇలా కొన్నారంటే మీ బడ్జెట్ ధరలోనే.. డోంట్ మిస్!
Apple iPhone 17 : ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ ఆన్‌లైన్‌లో అతి తక్కువ ధరకే లభిస్తోంది. కొత్త ఐఫోన్ డిస్కౌంట్ ధరకే ఎలా కొనేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

Apple iPhone 17
Apple iPhone 17 : కొత్త ఐఫోన్ కొంటున్నారా? భారీ తగ్గింపు ధరకే లేటెస్ట్ ఐఫోన్ 17 కొనేసుకోవచ్చు. కుపెర్టినో ఆధారిత టెక్ దిగ్గజం ఆపిల్ ఇటీవలే ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ చేసింది. ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్, సరికొత్త ఐఫోన్ ఎయిర్ అనే 4 మోడళ్లను ఆవిష్కరించింది. ఈ లైనప్ అప్‌గ్రేడ్ హార్డ్‌వేర్, రిఫ్రెష్ డిజైన్ అత్యంత ఆకర్షణగా నిలిచింది.
ఐఫోన్ 17 ప్రారంభంలోనే రూ. 82,900 ధర నుంచి 120Hz ప్రోమోషన్ డిస్‌ప్లే, 18MP ఫ్రంట్ కెమెరా, ఆపిల్ కొత్త A19 చిప్‌ను హుడ్ (Apple iPhone 17) కింద అందిస్తుంది. ఇప్పుడు, ఐఫోన్ 17 కొనుగోలుపై ధర రూ. 5వేల కన్నా భారీగా తగ్గింది. ఇంకా తగ్గింపు ధరకే పొందాలంటే ఇలా కొనేసుకోండి.
ఆన్‌లైన్‌లో ఐఫోన్ 17 ఫస్ట్ టైం భారీ డిస్కౌంట్ :
ఆపిల్ లేటెస్ట్ ఐఫోన్‌లపై అడ్వాన్స్ డిస్కౌంట్లను అందిస్తోంది. భారత మార్కెట్లో రూ.82,900కు లాంచ్ అయిన ఐఫోన్ 17 ప్రస్తుతం జెప్టోలో రూ.78,079కు లిస్ట్ అయింది. దాంతో ఐఫోన్ 17 నేరుగా రూ.4,821 ధర తగ్గింపు లభించింది. దాంతో పాటు, జెప్టో ఆర్బీఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో అదనంగా రూ.250 తగ్గింపును అందిస్తోంది. తద్వారా ధర రూ.77,829కి తగ్గుతుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఇప్పుడు మొత్తం రూ.5,071 సేవ్ చేసుకోవచ్చు.
ఐఫోన్ 17 స్పెసిఫికేషన్లు :
ఆపిల్ ఐఫోన్ 17 మోడల్ 6.3-అంగుళాల ఎల్టీపీఓ సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, 3000 నిట్స్ వరకు గరిష్ట బ్రైట్‌నెస్ కలిగి ఉంది. 3nm ప్రాసెస్‌పై ఆపిల్ A19 చిప్ ద్వారా పవర్ అందిస్తుంది. 8GB ర్యామ్, 512GB వరకు NVMe స్టోరేజీతో వస్తుంది. కెమెరా సిస్టమ్ అప్‌గ్రేడ్‌ను పొందుతుంది.
బ్యాక్ సైడ్ డ్యూయల్ 48MP సెన్సార్లు, ఒకటి వైడ్, ఒక అల్ట్రా-వైడ్, ఫ్రంట్ సైడ్ డాల్బీ విజన్ హెచ్‌డీఆర్ వీడియోకు సపోర్టు ఇస్తుంది. కొత్త 18MP మల్టీ-స్పెక్ట్ సెన్సార్ కలిగి ఉంది. ఇతర ఫీచర్లలో iOS 26, IP68 రేటింగ్ కలిగి ఉంది. ఫేస్ ఐడీ, యూడబ్ల్యూబీ జెన్2 సపోర్టు, శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్లు, వైర్డు, మ్యాగ్‌సేఫ్ వైర్‌లెస్ ఛార్జింగ్ రెండింటికీ సపోర్టు ఇచ్చే 3692mAh బ్యాటరీ ఉన్నాయి.