Apple iPhone 17 Series : కొత్త ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ వచ్చేస్తోందోచ్.. కీలక స్పెషిఫికేషన్లు లీక్.. భారత్, అమెరికా, దుబాయ్ ధర వివరాలివే..!
Apple iPhone 17 Series : ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ రాబోతుంది. మొత్తం 4 మోడల్ ఐఫోన్లను అందించనుంది. కీలక స్పెషిఫికేషన్ల వివరాలు లీక్ అయ్యాయి.

Apple iPhone 17 Series
Apple iPhone 17 Series : ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. అతి త్వరలోనే ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ రాబోతుంది. లాంచ్‌కు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఐఫోన్ 17 సిరీస్ ఫీచర్లు, ధర ఇతర వివరాలపై అనేక ఊహాగానాలు వస్తున్నాయి.
నివేదికల ప్రకారం.. ఐఫోన్ 17 సిరీస్ మొత్తం 4 కొత్త ఐఫోన్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. అందులో ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ ఉన్నాయి. అయితే, ఐఫోన్ 17 ఎయిర్ వేరియంట్ ఫస్ట్ మోడల్ కానుంది. రాబోయే ఐఫోన్ 17 సిరీస్‌కు సంబంధించి లీక్ అయిన పూర్తి వివరాలను ఓసారి పరిశీలిద్దాం..
ఐఫోన్ 17 సిరీస్ కెమెరా, స్పెషిఫికేషన్లు :
బేస్ వేరియంట్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, బేసిక్ ఛాసిస్ కలిగి ఉంటుంది. అయితే, ఈసారి ఆపిల్ బేస్ వేరియంట్ లేటెస్ట్ ప్రాసెసర్ అందించకపోవచ్చు. ఈ ఐఫోన్ మోడల్ పాత A18 ప్రాసెసర్‌తో వస్తుందని పుకార్లు వస్తున్నాయి.
Read Also : OnePlus 13 Price : ఖతర్నాక్ డిస్కౌంట్.. అమెజాన్‌లో వన్‌ప్లస్ 13 ధర భారీగా తగ్గిందోచ్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?
ఐఫోన్ 17 ఎయిర్, శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ అత్యంత సన్నని ఫోన్‌గా రాబోతుంది. ఈ ఐఫోన్ లేటెస్ట్ A19 ప్రాసెసర్‌తో పాటు ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. సింగిల్ 48MP బ్యాక్ కెమెరాను కలిగి ఉండనుంది.
ఆపిల్ ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ లేటెస్ట్ ప్రాసెసర్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, బిగ్ బ్యాటరీతో స్పెషిఫికేషన్ల పరంగా అద్భుతంగా ఉంటాయి. ఈ 4 ఐఫోన్లలో సాధారణ ఫీచర్లు ఏమిటంటే.. 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన ప్రోమోషన్ డిస్‌ప్లే, అప్‌గ్రేడ్ కలిగి ఉంది. అంతేకాకుండా, అన్ని ఫోన్‌లు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం మెరుగైన 24MP ఫ్రంట్ స్నాపర్ కలిగి ఉండొచ్చు. గత సిరీస్‌లో ఆపిల్ 12MP మాదిరిగా ఉండకపోవచ్చు.
భారత్, అమెరికా, దుబాయ్‌లో ఐఫోన్ 17 సిరీస్ ధరలు (అంచనా) :
భారత మార్కెట్లో ఐఫోన్ 17 ప్రో మాక్స్ ధర దాదాపు రూ.1,64,990, అమెరికా మార్కెట్లో 2300 డాలర్లు, దుబాయ్‌లో 7074 దిర్హామ్‌లు ఉండొచ్చు. అదేవిధంగా, ఈ సిరీస్‌లోని ప్రో వేరియంట్ భారత మార్కెట్‌లో దాదాపు రూ.1,45,000కు లభించనుంది. అమెరికాలో దాదాపు 1,199 డాలర్లు, దుబాయ్‌లో 4403 దిర్హామ్‌లు ఉండొచ్చు.
భారత మార్కెట్లో ఐఫోన్ 17 రూ.89,9900, అమెరికాలో 899 డాలర్లు, దుబాయ్‌లో 3301 దిర్హామ్‌లకు అందుబాటులో ఉండొచ్చు. ఐఫోన్ 17 ఎయిర్ విషయానికొస్తే.. భారత మార్కెట్లో రూ.99,900, అమెరికాలో 999 డాలర్లు, దుబాయ్‌లో 3668 దిర్హామ్‌లకు అందుబాటులో ఉండొచ్చు.