Apple iPhone 17 Series
iPhone 17 Series : ఆపిల్ కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? ఆపిల్ నిర్వహించిన “Awe-Dropping” ఈవెంట్‌లో సరికొత్త ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ అయింది. అద్భుతమైన కలర్ ఆప్షన్లలో అనేక కొత్త ఐఫోన్‌లు దర్శనమిచ్చాయి. సాధారణంగా కేవలం ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మాత్రమే కాకుండా బ్రాండ్-న్యూ మోడల్, ఐఫోన్ 17 ఎయిర్ ఆవిష్కరించింది.
ఈ కొత్త మోడల్ సాధారణ ప్లస్ వేరియంట్ (iPhone 17 Series) స్థానంలో చేర్చింది. కేవలం 5.6mm వద్ద చాలా సన్నగా ఉంది. ఆపిల్ అత్యంత సన్నని ఐఫోన్ ఇదే అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆపిల్ లాంచ్ చేసిన ఐఫోన్ మోడళ్లు భారత్ సహా ఇతర దేశాల్లో ధర ఎంత ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
దేశాల వారీగా ఐఫోన్ 17 ధరలివే :
ఐఫోన్ 17 ధరలు దేశాల వారీగా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా ప్రతి దేశం విధించే సుంకాలు, పన్నుల కారణంగా ఐఫోన్ల ధరలో భారీగా తేడాలు ఉంటాయి. భారత్ తో పాటు వివిధ దేశాలలో ఈ కొత్త ఐఫోన్ మోడల్‌ల ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి..
యునైటెడ్ స్టేట్స్ :
ఐఫోన్ 17 : 799 USD (సుమారు రూ. 66,500)
ఐఫోన్ 17 ఎయిర్ : 999 USD (సుమారు రూ. 83,000)
ఐఫోన్ 17 ప్రో : 1,099 USD (సుమారు రూ. 91,000)
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ : 1,199 USD (సుమారు రూ. 99,000)
భారత్ :
ఐఫోన్ 17 : రూ. 82,900
ఐఫోన్ 17 ఎయిర్ (256GB) : రూ. 1,19,900
ఐఫోన్ 17 ప్రో (256GB) : రూ. 1,34,900
ఐఫోన్ 17 ప్రో మాక్స్ (256GB) : రూ. 149,900
యునైటెడ్ కింగ్‌డమ్ :
ఐఫోన్ 17 : 799 GBP (సుమారు రూ. 84,000)
ఐఫోన్ 17 ఎయిర్ : 999 GBP (సుమారు రూ. 1,05,000)
ఐఫోన్ 17 ప్రో : 1,099 GBP (సుమారు రూ. 1,15,000)
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ : 1,199 GBP (సుమారు రూ. 1,25,000)
దుబాయ్ :
ఐఫోన్ 17 : AED 3,399 (సుమారు రూ. 77,000)
ఐఫోన్ 17 ఎయిర్ : AED 4,299 (సుమారు రూ. 97,000)
ఐఫోన్ 17 ప్రో : AED 4,699 (సుమారు రూ. 1,06,000)
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ : AED 5,099 (సుమారు రూ. 1,15,000)
కెనడా :
ఐఫోన్ 17 : 1,129 CAD (సుమారు రూ. 69,000)
ఐఫోన్ 17 ఎయిర్ : 1,449 CAD (సుమారు రూ. 88,000)
ఐఫోన్ 17 ప్రో : 1,599 CAD (సుమారు రూ. 97,000)
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ : 1,749 CAD (సుమారు రూ. 1,06,000)
ఆస్ట్రేలియా :
ఐఫోన్ 17 : 1,399 AUD (సుమారు రూ. 76,000)
ఐఫోన్ 17 ఎయిర్ : 1,799 AUD (సుమారు రూ. 98,000)
ఐఫోన్ 17 ప్రో : 1,999 AUD (సుమారు రూ. 1,09,000)
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ : 2,199 AUD (సుమారు రూ. 1,20,000)
చైనా :
ఐఫోన్ 17 : 5,999 CNY (సుమారు రూ. 68,500)
ఐఫోన్ 17 ఎయిర్ : 7,999 CNY (సుమారు రూ. 91,500)
ఐఫోన్ 17 ప్రో : 8,999 CNY (సుమారు రూ. 1,03,000)
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ : 9,999 CNY (సుమారు రూ. 1,14,000)
భారత మార్కెట్లో ధరలను పోల్చి చూస్తే.. ఎప్పటిలాగే ఇతర దేశాలతో పోలిస్తే ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి, విదేశాలలో నివసిస్తున్న మీ స్నేహితుడికి లేదా బంధువుకు ఫోన్ చేసి మీకు ఐఫోన్ కొని తీసుకురమ్మని అడగొచ్చు. దుబాయ్‌లో ఎవరైనా ఉంటే వారిని భారత్ కు వచ్చేటప్పుడు కొత్త ఐఫోన్ కొని ఇంటికి తీసుకురమ్మని చెప్పొచ్చు.