iPhone SE 4 launch event today
iPhone SE 4 Launch : ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిబ్రవరి 19 ఆపిల్ ఈవెంట్‌కు సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లో ఆపిల్ ఐఫోన్ SE 4 లాంచ్ చేయనుంది. ఆపిల్ లవర్స్ అందరూ ఈ చౌకైన ఐఫోన్ లాంచ్ కోసమే చూస్తున్నారు. ఆపిల్ ఫోన్ వివరాలను వెల్లడించలేదు.
కానీ, పుకార్లు, లీక్‌ల ప్రకారం.. ఐఫోన్ SE మోడల్ అతిపెద్ద అప్‌డేట్‌లలో రానుంది. ఊహాగానాలు నిజమైతే.. ఐఫోన్ SE 4 ఫోన్ అనేక అప్‌గ్రేడ్‌లతో రావచ్చు. భారత మార్కెట్లో రూ. 50వేల కన్నా తక్కువ ధరకు అందుబాటులోకి రానుంది.
ఐఫోన్ SE 4 ఫోన్ డిజైన్ గురించి ఎక్కువగా వినిపిస్తోంది. ఈ ఐఫోన్ పాత ఐఫోన్ SE 3 మోడల్ 7 డిజైన్ తొలగిస్తుందని భావిస్తున్నారు. గత మోడల్ మందపాటి బెజెల్స్, టచ్ ఐడీతో హోమ్ బటన్ ఉన్నాయి. రాబోయే ఐఫోన్ SE 4 మాత్రం ఐఫోన్ 14 మాదిరి డిజైన్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
ఫ్లాట్ ఎడ్జ్‌లు, అల్యూమినియం, గ్లాస్ బిల్డ్, అదనపు మన్నికకు ఆపిల్ సిరామిక్ షీల్డ్‌తో కూడా రానుంది. ఈ ఐఫోన్ 6.1-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని అంచనా. ఐఫోన్ SE 3 ఫోన్ 4.7-అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్ మెయిన్ అప్‌గ్రేడ్ అని చెప్పవచ్చు.
మరో మెయిన్ అప్‌గ్రేడ్ ఏమిటంటే..
ట్రెడేషనల్ టచ్ ఐడీ బదులుగా ఫేస్ ఐడీని చేర్చనుంది. ఐఫోన్ SE మోడల్ అన్ని ఇతర ఐఫోన్‌లకు అనుగుణంగా తీసుకువస్తుంది. అదనంగా, డైనమిక్ ఐలాండ్ చేర్చుతుందనే ఊహాగానాలు ఉన్నాయి. ప్రస్తుతం ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 15, ఐఫోన్ 16 సిరీస్‌లలో ఈ ఫీచర్ ఉంది.
అయితే, దీనిపై ఆపిల్ ఇంకా ధృవీకరించలేదు. హుడ్ కింద, ఐఫోన్ SE 4 మోడల్ ఆపిల్ A18 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుందని భావిస్తున్నారు. 8జీబీ ర్యామ్, పర్ఫార్మెన్స్, ఏఐ ఫీచర్‌లైన ఆపిల్ ఇంటెలిజెన్స్‌కు సపోర్టు అందించనుంది. ఈ ఐఫోన్ A17 ప్రో చిప్‌సెట్‌ను కలిగి ఉండవచ్చని నివేదికలు సూచించాయి. ఇప్పటికీ ఐఫోన్ 15 ప్రోలో కనిపించే విధంగా ఫ్లాగ్‌షిప్-లెవల్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది.
ఆప్టిక్స్ విషయానికొస్తే..
ఐఫోన్ SE 4 ఫోన్ 48ఎంపీ బ్యాక్ కెమెరాను కలిగి ఉంటుందని అంచనా. ఐఫోన్ ఎస్ఈ 3లోని 12ఎంపీ సెన్సార్ కన్నా పెద్దదిగా ఉండనుంది. ఫ్రంట్ కెమెరా కూడా 24ఎంపీ సెన్సార్ రూపంలో అప్‌గ్రేడ్ అవుతుందని భావిస్తున్నారు.
ఆసక్తికరమైన పుకారు ఏమిటంటే.. ఆపిల్ సొంత ఇన్-హౌస్ 5G మోడెమ్‌ను ఐఫోన్ SE 4 లో ప్రవేశపెట్టనుంది. క్వాల్‌కామ్ ఇంటెల్ అందించడం లేదు. అయితే, ప్రారంభ నివేదికలను పరిశీలిస్తే.. ఈ మోడెమ్‌లో (mmWave 5G)కి సపోర్టు లేకపోవచ్చు.
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ X75 తో పోలిస్తే.. తక్కువ క్యారియర్ అగ్రిగేషన్ ఫీచర్‌లను అందిస్తుందని సూచిస్తున్నాయి. ఫలితంగా అప్‌లోడ్, డౌన్‌లోడ్ స్పీడ్ నెమ్మదిగా ఉండవచ్చు. కానీ, ఆపిల్ కొత్త టెక్నాలజీని టెస్టింగ్ సమయంలో ఇదొ ట్రేడ్-ఆఫ్ మాదిరిగా మారనుంది.
ఐఫోన్ SE 4 లాంచ్ తేదీ, సమయం :
ఆపిల్ లాంచ్ ఈవెంట్‌లో ఐఫోన్ SE 4 (ఐఫోన్ 16E) లాంచ్ చేయనున్నట్టుగా ఆపిల్ ధృవీకరించింది.
లాంచ్ ఈవెంట్ డేట్ : ఫిబ్రవరి 19, 2025
ఈవెంట్ టైమ్ : భారత కాలమానం ప్రకారం.. రాత్రి 11:30
ఈవెంట్ లొకేషన్ : ఆపిల్ పార్క్, కుపెర్టినో, కాలిఫోర్నియా
హోస్ట్ : ఆపిల్ సీఈఓ టిమ్ కుక్, సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు
ఐఫోన్ SE 4 లాంచ్ లైవ్ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎలా చూడాలి? :
ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ లాంచ్ ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్ కానుంది. అభిమానులు, టెక్ ఔత్సాహికులు ఐఫోన్ SE 4 లాంచ్‌ను వీక్షించవచ్చు. ఆపిల్ అధికారిక వెబ్‌సైట్ (apple.com) ఆపిల్ యూట్యూబ్ ఛానల్, ఆపిల్ టీవీ యాప్ ఆపిల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ (ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్) ద్వారా చూడవచ్చు.
భారత్, అమెరికా, దుబాయ్‌లలో ఐఫోన్ SE 4 ధర (అంచనా) :
భారత్ : ధర సుమారు రూ. 50వేలు (అంచనా)
అమెరికా : ధర 500 డాలర్ల లోపు (అంచనా)
దుబాయ్ : ధర సుమారు AED 2,000 (అంచనా)
ఐఫోన్ SE 4 ప్రీ-ఆర్డర్, సేల్ తేదీ :
ప్రీ-ఆర్డర్ తేదీ : ఫిబ్రవరి 23, 2025 అంచనా.
సేల్ తేదీ : మార్చి 1, 2025 అంచనా.