iPhone SE 4 Launch : గుడ్ న్యూస్.. ఆపిల్ చౌకైన ఐఫోన్ SE4 వచ్చేస్తోంది.. ఫిబ్రవరి 19నే లాంచ్.. ఏఐ ఫీచర్లపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్..!
iPhone SE 4 Launch : ఫిబ్రవరి 19న ఆపిల్ ఐఫోన్ SE 4 లాంచ్ కానుంది. రాబోయే ఈ ఐఫోన్‌లో కొత్త డిజైన్, ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 48MP కెమెరా, A18 చిప్ ఉండవచ్చు. ధర, ఇతర ఫీచర్ల వివరాలను ఓసారి లుక్కేయండి.

Apple iPhone SE 4 launch event
iPhone SE 4 Launch : ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సరికొత్త ఐఫోన్ SE 4 మోడల్ లాంచ్ సమయం ఆసన్నమైంది. అందిన టెక్ సమాచారం ప్రకారం.. ఆపిల్ ఫిబ్రవరి 19న బిగ్ ఈవెంట్ నిర్వహించనుంది. కంపెనీ ఐఫోన్ SE 4 మోడల్ లాంచ్ చేసే అవకాశం ఉంది.
నివేదికల ప్రకారం.. ఈ కొత్త మోడల్‌లో చాలా కీలకమైన అప్‌గ్రేడ్‌లను చూడవచ్చు. అయితే ఈ మార్పులు మూడేళ్ల ఐఫోన్ SE 3తో పోలిస్తే పెద్దగా అనిపించకపోవచ్చు. కానీ, ఈ కొత్త మోడల్ పవర్‌ఫుల్ అప్‌గ్రేడ్‌గా ఉండవచ్చు. కొత్త డిజైన్, మెరుగైన పనితీరు, గొప్ప కెమెరా వంటి ఫీచర్లు ఇందులో చూడవచ్చు.
ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ స్వయంగా ఈ ఈవెంట్‌ను టీజ్ చేశారు. ఈసారి ఐఫోన్ SE 4 కచ్చితంగా లాంచ్ అవుతుందనే అంచనాలు మరింత పెరిగాయి. టీజర్‌లో ఈ ఐఫోన్‌కు సంబంధించిన సమాచారం ఇవ్వనప్పటికీ, ఈ స్మార్ట్‌ఫోన్ ఆపిల్ ఈవెంట్‌లో ప్రధాన ఆకర్షణగా ఉంటుందని టెక్ పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు.
ఐఫోన్ SE 4లో భారీ మార్పులు :
లీక్‌ల ప్రకారం.. ఐఫోన్ SE 4 డిజైన్ పూర్తిగా మారనుంది. మునుపటి ఐఫోన్ ఎస్ఈ 3 మోడల్ సాంప్రదాయ మందపాటి బెజెల్ కాంపాక్ట్ డిజైన్ ఉండకపోవచ్చు. స్టైలింగ్ ఐఫోన్ 14 మాదిరిగా అందించవచ్చు. అల్యూమినియం, గ్లాస్ బాడీ, ఫ్లాట్ ఎడ్జ్, ఎక్కువ మన్నిక కోసం ఆపిల్ సిరామిక్ షీల్డ్ ఉండవచ్చు. ఇది కాకుండా, ఇప్పటివరకు SE మోడల్‌లో ఉన్న టచ్ ఐడీ స్థానంలో ఫేస్ ఐడీని పొందే అవకాశం ఉంది. డిస్‌ప్లే సన్నని బెజెల్స్, ఐఫోన్ 14 లాంటి నాచ్‌తో రావచ్చు.
ఓఎల్ఈడీ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ ప్రాసెసర్ :
ఐఫోన్ ఎస్ఈ 4 మోడల్ 6.1-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉండవచ్చు. పాత ఎస్ఈ 3 మోడల్ 4.7-అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్ కన్నా బిగ్ అప్‌గ్రేడ్ అవుతుంది. ఓఎల్ఈడీ స్క్రీన్లు మెరుగైన కాంట్రాస్ట్, డీప్ బ్లాక్ పవర్‌ఫుల్ కలర్ ఆప్షన్లను అందిస్తాయి. అయితే, డిస్‌ప్లే రిఫ్రెష్ రేటు 60Hz వద్ద మాత్రమే ఉంటుందని భావిస్తున్నారు.
ప్రాసెసర్ విషయానికి వస్తే.. ఐఫోన్ ఎస్ఈ 4 మోడల్ A18 చిప్‌సెట్ కలిగి ఉండొచ్చు. ఐఫోన్ 16లో కూడా ఇదే కనిపిస్తుంది. అయితే, కొన్ని రిపోర్టులను పరిశీలిస్తే.. ఇప్పటికే ఐఫోన్ 15 ప్రోలో ఉన్న A17 ప్రో చిప్‌సెట్‌ను కూడా కలిగి ఉండవచ్చు. రెండు చిప్‌సెట్‌లు ఆపిల్ ఇంటెలిజెన్స్‌కు సపోర్టు ఇస్తాయి. దీని కారణంగా ఆపిల్ ఏఐ ఫీచర్లను కూడా SE 4లో కూడా చూడవచ్చు. ఏఐ సపోర్టుతో ఐఫోన్‌లో కనీసం 8GB ర్యామ్ ఉండే అవకాశం ఉంది.
కెమెరాలో భారీ అప్‌గ్రేడ్ ఉండొచ్చు :
ఫోటోగ్రఫీ పరంగా కూడా ఈ ఐఫోన్ SE 3 మోడల్ కన్నా మెరుగ్గా ఉండవచ్చు. నివేదికల ప్రకారం.. 48MP బ్యాక్ కెమెరాను కలిగి ఉండవచ్చు. ఐఫోన్ SE 3 మోడల్ మాదిరిగానే 12MP కెమెరా కన్నా భారీ అప్‌గ్రేడ్ ఉండే అవకాశం ఉంది. సెల్ఫీ కెమెరా కూడా మెరుగ్గా ఉంటుందని, 24MP సెన్సార్‌ను కలిగి ఉంటుందని అంచనా.
బ్యాటరీ, ఛార్జింగ్, ఇతర ఫీచర్లు :
రాబోయే ఐఫోన్ SE 4 మోడల్ మరిన్ని అప్‌గ్రేడ్‌లతో వచ్చే అవకాశం ఉంది. అందులో భారీ 3,279mAh బ్యాటరీ, లైట్నింగ్ పోర్ట్‌కు బదులుగా యూఎస్‌బీ టైప్-సి, (MagSafe) వైర్‌లెస్ ఛార్జింగ్ ఉండవచ్చు. అంతేకాదు.. ఐఫోన్ 15 సిరీస్‌లో యాక్షన్ బటన్‌ను కూడా కలిగి ఉంటుంది. తద్వారా వినియోగదారులు తమకు నచ్చిన షార్ట్‌కట్‌లు, ఫంక్షన్‌లను నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు.
ఐఫోన్ SE 4 ధర ఎంత ఉండొచ్చుంటే? :
కొత్త ఫీచర్లు ఉన్నప్పటికీ కూడా ఈ ఫోన్ ధర మాత్రమే కీలకం. ఐఫోన్ SE 4 ఫోన్ ధర SE 3 మోడల్ కన్నా కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. కానీ, భారత మార్కెట్లో ఐఫోన్ SE 4 మోడల్ ధర రూ. 50వేల కన్నా తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ ఐఫోన్ బేస్ వేరియంట్‌ను రూ.49,900కు లాంచ్ చేయవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఐఫోన్ SE 4 లాంచ్ ఈవెంట్ డేట్, టైమ్ :
ఫిబ్రవరి 19, 2025న జరిగే ఆపిల్ లాంచ్ ఈవెంట్‌లో ఐఫోన్ SE 4 (ఐఫోన్ 16E) ఆవిష్కరించనున్నట్టు ఆపిల్ అధికారికంగా ధృవీకరించింది.
ఈవెంట్ తేదీ : ఫిబ్రవరి 19, 2025
ఈవెంట్ సమయం : PT సమయం ప్రకారం.. ఉదయం 10:00, ET సమయం ప్రకారం.. మధ్యాహ్నం 1:00, GMT సమయం ప్రకారం.. సాయంత్రం 6:00, IST సమయం ప్రకారం రాత్రి 11:30 ఈవెంట్ లొకేషన్ : ఆపిల్ పార్క్, కుపెర్టినో, కాలిఫోర్నియా
హోస్ట్ : ఆపిల్ సీఈఓ టిమ్ కుక్, సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు
ఐఫోన్ SE 4 లాంచ్ : లైవ్ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ చూడాలి? :
ఆపిల్ లాంచ్ ఈవెంట్లు ప్రపంచవ్యాప్తంగా లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. అభిమానులు, టెక్ ఔత్సాహికులు ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఐఫోన్ SE 4 లాంచ్‌ను చూడవచ్చు. ఆపిల్ అధికారిక వెబ్‌సైట్ (apple.com) ఆపిల్ యూట్యూబ్ ఛానల్, ఆపిల్ టీవీ యాప్ ఆపిల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ (ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్) ద్వారా వీక్షించవచ్చు.
భారత్, అమెరికా, దుబాయ్‌లలో ఐఫోన్ SE 4 ధర (అంచనా) :
ధర వివరాలు వెల్లడించలేదు. కానీ, రిపోర్టుల ప్రకారం.. ఐఫోన్ SE 4 ధరను అన్ని ప్రాంతాలలో వేర్వేరుగా ఉండవచ్చు.
భారత్ : ధర సుమారు రూ. 50వేలు (అంచనా)
అమెరికా : ధర 500 డాలర్ల లోపు (అంచనా)
దుబాయ్ : ధర సుమారు AED 2,000 (అంచనా)
ఆపిల్ కొన్ని ప్రీ-ఆర్డర్ ఆఫర్‌లను కూడా ప్రారంభించవచ్చు.
ఐఫోన్ SE 4 ప్రీ-ఆర్డర్, సేల్ తేదీ :
ప్రీ-ఆర్డర్ తేదీ : ఫిబ్రవరి 23, 2025 అంచనా.
సేల్ తేదీ : మార్చి 1, 2025 అంచనా.
ఐఫోన్ SE 4 ప్రాంతాల వారీగా అందుబాటులో ఉండనుంది. ఈ ఫోన్ లభ్యమయ్యే మొదటి మార్కెట్లలో అమెరికా, కెనడా, యూకే, భారత్ ఉంటాయి.