Call Merging Scam : బాబోయ్.. ఏంటి.. ‘కొత్త కాల్ మెర్జింగ్ స్కామ్..’ యూపీఐ యూజర్లు జర భద్రం.. క్షణాల్లో మీ బ్యాంకు అకౌంట్లు ఖాళీ..!

Call Merging Scam : ఈ కొత్త రకం కాల్ మెర్జింగ్ స్కామ్‌లో సైబర్ మోసగాళ్లు యూపీఐ యూజర్లను మోసగించి కాల్స్ మెర్జ్ చేస్తారు. వినియోగదారులకు తెలియకుండానే వారి ఓటీపీలను షేర్ చేస్తారు. బ్యాంకు అకౌంట్లలో డబ్బులను దోచేస్తారు.

Call Merging Scam : బాబోయ్.. ఏంటి.. ‘కొత్త కాల్ మెర్జింగ్ స్కామ్..’ యూపీఐ యూజర్లు జర భద్రం.. క్షణాల్లో మీ బ్యాంకు అకౌంట్లు ఖాళీ..!

Call Merging Scam

Updated On : February 18, 2025 / 8:59 PM IST

Call Merging Scam : యూపీఐ యూజర్లకు అలర్ట్.. కొత్త కాల్ మెర్జింగ్ స్కామ్‌తో జాగ్రత్త.. మీరు పొరపాటున కాల్ మెర్జ్ చేశారంటే అంతే సంగతులు.. స్కామర్లు ఏ క్షణమైనా మీ బ్యాంకు అకౌంట్లలో డబ్బులు కాజేయొచ్చు. ఈ కాల్ మెర్జింగ్ స్కామ్ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

యూపీఐ తమ యూజర్లను కొత్త స్కామ్ గురించి అప్రమత్తం చేస్తోంది. ఇందులో స్కామర్లు వినియోగదారులను మోసగించి కాల్స్ మెర్జ్ చేయడం ద్వారా మీకు తెలియకుండానే వన్-టైమ్ పాస్‌వర్డ్‌లను (OTP) షేర్ చేస్తారు. స్కామర్‌లు అనధికార లావాదేవీలతో మీ అకౌంట్లలో డబ్బును దొంగిలిస్తారు.

Read Also : EV Charging Stations : ఫ్యూచర్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే.. EV చార్జింగ్ స్టేషన్ పెట్టాలంటే ఎలా? ఎంత ఖర్చవుతుంది? ఫుల్ డిటెయిల్స్..!

ఈ కొత్త స్కామ్ గురించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అభివృద్ధి చేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ఎక్స్ వేదికగా యూజర్లను హెచ్చరించింది, “స్కామర్లు యూపీఐ ఓటీపీల కోసం మిమ్మల్ని మోసగించేందుకు కాల్ మెర్జింగ్‌ను ఉపయోగిస్తున్నారు. స్కామర్ల వలలో పడకండి. అప్రమత్తంగా ఉండండి. మీ డబ్బును కాపాడుకోండి.” అంటూ పోస్టులో హెచ్చరించింది.

కాల్ మెర్జింగ్ స్కామ్ ఏంటి? :
ఈ స్కామ్ అనేది ఒక గుర్తు తెలియని వ్యక్తి.. మీ ఫోన్ నంబర్‌ను స్నేహితుడి నుంచి తీసుకుని కాల్ చేస్తున్నట్టుగా చెబుతాడు. ఆ తర్వాత స్కామర్ ఆ “స్నేహితుడు” వేరే నంబర్ నుంచి కాల్ చేస్తున్నాడని పేర్కొంటూ, కాల్స్ మెర్జ్ చేయమని అడుగుతాడు.

కాల్ మెర్జ్ అయిన తర్వాత, యూపీఐ యూజర్లకు తెలియకుండానే వారి బ్యాంక్ లింక్ అయిన అకౌంట్ ఓటీపీ వెరిఫికేషన్ కాల్‌తో కనెక్ట్ అవుతారు. స్కామర్లు అదే సమయంలో మీ ఓటీపీని స్కాన్ చేస్తారు. కాల్ ద్వారా ఓటీపీ వినేస్తారు అనమాట. ఓటీపీ పొందిన వెంటనే మోసగాళ్ళు మీ బ్యాంకు అకౌంట్లలో నుంచి డబ్బులను కాజేస్తారు.

కాల్ మెర్జ్ స్కామ్ నుంచి సేఫ్‌గా ఎలా ఉండాలంటే? :

ఈ స్కామ్ బారిన పడకుండా ఉండటానికి యూపీఐ సెక్యూరిటీ టిప్స జారీ చేసింది. అవేంటో ఓసారి జాగ్రత్తగా చదవండి.

  • గుర్తు తెలియని నంబర్లతో కాల్స్ ఎప్పుడూ మెర్జ్ చేయవద్దు
  •  ముఖ్యంగా గుర్తుతెలియని కాల్స్ మెర్జ్ చేయమంటే ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండండి.
  •  కాలర్ అథెంటికేషన్ ధృవీకరించండి
  •  ఎవరైనా మీ బ్యాంక్ నుంచి లేదా తెలిసిన కాంటాక్ట్ నుంచి వచ్చినట్లు చెబితే ముందుగా వారి ఐడెంటిటీని వెరిఫై చేసుకోండి.
  •  అనుమానాస్పద ఓటీపీలను రిపోర్టు చేయండి.
  •  మీరు చేయని లావాదేవీకి OTP అందితే.. మీ బ్యాంకుకు ఫిర్యాదు చేయండి.
  •  అత్యవసర చర్య తీసుకునేందుకు వెంటనే 1930కు కాల్ చేసి రిపోర్టు చేయండి.

గత నెలలో జరిగిన ఒక సర్వేలో భారత్‌లో మూడింట ఒక వంతు మంది రియల్-టైమ్ పేమెంట్లకు సంబంధించిన మోసాలకు గురయ్యారని తేలింది. గ్లోబల్ అనలిటిక్స్ కంపెనీ (FICO) నివేదిక దేశంలో పెరుగుతున్న మోసాల ముప్పును హైలైట్ చేసింది.

Read Also : SIP Investment Tricks : SIPలో పెట్టుబడి పెడుతున్నారా? ఈ 3 ట్రిక్స్ తెలిస్తే చాలు.. 30ఏళ్లలో రూ. 10 కోట్లపైనే సంపాదించవచ్చు..!

60 శాతం మందికి స్కామ్ మెసేజ్‌లు వచ్చాయని, 54 శాతం మందికి స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా మోసపోయినట్లు తెలుసని తేలింది. 2023తో పోలిస్తే.. 2024లో తక్కువ మంది వినియోగదారులు డబ్బును నష్టపోగా రూ.8 లక్షలకు పైగా నష్టాల విలువ 2 శాతం నుంచి 4 శాతానికి రెట్టింపు అయింది.