SIP Investment Tricks : SIPలో పెట్టుబడి పెడుతున్నారా? ఈ 3 ట్రిక్స్ తెలిస్తే చాలు.. 30ఏళ్లలో రూ. 10 కోట్లపైనే సంపాదించవచ్చు..!

SIP Investment Tricks : మీరు ఎస్ఐపీలో పెట్టుబడి పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, లాంగ్ టైమ్ ఇన్వెస్ట్ చేసేందుకు ట్రై చేయండి. మీరు కానీ 30ఏళ్ల వరకు పెట్టుబడి పెడితే రూ. 10 కోట్లపైనే సంపాదించుకోవచ్చు..

SIP Investment Tricks : SIPలో పెట్టుబడి పెడుతున్నారా? ఈ 3 ట్రిక్స్ తెలిస్తే చాలు.. 30ఏళ్లలో రూ. 10 కోట్లపైనే సంపాదించవచ్చు..!

SIP Investment Tricks

Updated On : February 18, 2025 / 8:12 PM IST

SIP Investment Tricks : మ్యూచవల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే, మొదటిసారి మ్యూచవల్ ఫండ్లలో పెట్టుబడివారు తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. చాలామందికి ఎందులో పెట్టుబడి పెడితే అధిక రిటర్న్స్ వస్తాయో పెద్దగా అవగాహన ఉండదు.

అయితే, అన్నింట్లో కన్నా మ్యూచవల్ ఫండ్లలో బెనిఫిట్స్ ఎక్కువనే చెప్పాలి. మంచి రాబడిని పొందడానికి ఇందులో అనేక మార్గాలు ఉంటాయి. అందులో ప్రధానంగా సిస్టమేటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ (SIP) అనేది బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ఒకటి.

Read Also : PM Kisan : పీఎం కిసాన్ డబ్బులు.. ఫిబ్రవరి 24న రైతుల ఖాతాల్లోకి.. ఈ జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోవచ్చు!

మీరు ఎస్ఐపీలో పెట్టుబడి పెట్టుకుంటే పోతే 30ఏళ్లలో కోటిశ్వీరులు అయిపోవచ్చు. అయితే, అది మీరు పెట్టుబడి పెట్టే మొత్తం, కాల పరిమితి, రాబటి రేటు వంటి అంశాలను బట్టి ఉంటుందని గమనించాలి. మ్యూచువల్ ఫండ్లలో అధిక రాబడి పొందాలంటే లాంగ్ టైమ్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ ఒక్కటే సరైన మార్గం.

ఎస్ఐపీ ద్వారా పెట్టుబడి పెట్టడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒకేసారి పెట్టుబడి పెట్టలేని వారు వారం వారం, నెలానెలా కొద్దికొద్దిగా పెట్టుబడి పెట్టవచ్చు. ఎస్ఐపీలో తక్కువ రిస్క్‌ ఉంటుంది. లాభాలు కూడా భారీగా ఉంటాయి. అందుకే ఎస్ఐపీకి అంత డిమాండ్ పెరిగింది.

ఎస్ఐపీలో ఈ 3 ట్రిక్స్ పాటిస్తే చాలు :
మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలంటే మీరు ముందుగా ఎంచుకోవాల్సింది ఎస్ఐపీ. మార్కెట్‌తో సంబంధం లేకుండా ఈ ఎస్ఐపీలో అద్భుతమైన రాబడిని పొందొచ్చు. ఎస్ఐపీలో అందరూ పెట్టుబడి పెడుతుంటారు. కానీ, ఇందులో కొన్ని ట్రిక్స్ పాటించాలి.

అప్పుడే అధిక లాభాలు పొందవచ్చు. మీరు ఒకవేళ లాంగ్ టైమ్ ఎస్ఐపీలో ఇన్వెస్ట్ చేస్తూ వస్తే 30 ఏళ్లలో రూ. 10 కోట్లకు పైగా కూడబెట్టవచ్చు. ఎస్ఐపీకి సంబంధించి మూడు ట్రిక్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

రూ. 15వేలతో 15ఏళ్ల పెట్టుబడి :
సాధారణంగా మ్యూచవల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేవారి కోసం ఫార్మూలాల గురించి తప్పక తెలుసుకోవాలి. అందులో ముఖ్యంగా 15-15-15 ఫార్మూలా.. ప్రతి నెలా రూ. 15 వేలు చొప్పున 15 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టాలి. ఇందులో వచ్చే రాబడి 15 శాతంగా లెక్కేస్తే రూ. 1.02 కోట్లు సంపాదించుకోవచ్చు అనమాట.

రూ. 15వేలతో 30ఏళ్ల పెట్టుబడి :
అదేవిధంగా మరో ఎస్ఐపీ ఫార్ములా 15-15-30 కూడా ఉంది. దీని ప్రకారం ప్రతి నెలా రూ. 15 వేలు 30 ఏళ్ల పాటు పెట్టుడి పెడితే 15 శాతంగా రాబడిని పరిశీలిస్తే.. రూ. 10.51 కోట్లకు పైగా డబ్బులను కూడబెట్టవచ్చు. 30 సంవత్సరాల్లో మీరు పెట్టుబడి పెట్టేది కేవలం రూ. 54 లక్షలు మాత్రమే.. మీకు వచ్చే రాబడి దాదాపు రూ. 9.97 కోట్లు ఉంటుంది. ఎప్పుడైనా సరే SIPలో లాంగ్ టైమ్ ఇన్వెస్ట్ చేస్తేనే అధిక రాబడిని పొందవచ్చు.

Read Also : EV Charging Stations : ఫ్యూచర్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే.. EV చార్జింగ్ స్టేషన్ పెట్టాలంటే ఎలా? ఎంత ఖర్చవుతుంది? ఫుల్ డిటెయిల్స్..!

25 ఏళ్ల వయస్సులో పెట్టుబడి :
చివరిగా మూడో ఫార్మూలా ప్రకారం.. 30 ఏళ్ల వయస్సులో పెట్టుబడి పెడితే రాబడి కూడా భారీగానే ఉంటుంది. ఉదాహరణకు.. మీరు నెలకు రూ. 5 వేలు చొప్పున 25 ఏళ్లు పెట్టుబడి పెడితే 12 శాతంగా కనీసం రాబడి లెక్కిస్తే.. రూ. 84,31,033 పెరుగుతుంది. 25 ఏళ్ల వయస్సు నుంచి మీరు ఎస్ఐపీలో పెట్టుబడిని 30 ఏళ్లు పెడితే 15 శాతంతో రిటర్న్స్ అంటే.. రూ. 1,52,60,066 వరకు సంపాదిస్తారు అనమాట.