Apple iPhone Users : ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. యాప్ స్టోర్‌ నుంచి జెమిని ఏఐ ఇన్‌స్టాల్ చేయవచ్చు!

Apple iPhone Users : జెమిని ఏఐ ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. గూగుల్ ఆండ్రాయిడ్ యూజర్లకు పరిధిని విస్తరించుకోవడమే కాకుండా, క్రాస్ ప్లాట్‌ఫారమ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.

Apple iPhone Users : ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. యాప్ స్టోర్‌ నుంచి జెమిని ఏఐ ఇన్‌స్టాల్ చేయవచ్చు!

Apple iPhone Users Can Now Install Gemini AI From App Store

Updated On : November 17, 2024 / 11:45 PM IST

Apple iPhone Users : ఆపిల్ ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఎట్టకేలకు గూగుల్ జెమిని అనే ఏఐ చాట్‌బాట్‌ వచ్చేసింది. ఇప్పుడు అధికారిక యాప్ స్టోర్‌లో ఐఫోన్ యూజర్లకు జెమిని యాప్ అందుబాటులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలను షేర్ చేసిన కొద్ది రోజులకే ఈ అప్‌డేట్ రిలీజ్ చేసింది. జెమిని ఇప్పటికే మిలియన్ల కొద్దీ స్మార్ట్‌ఫోన్‌లలో అందుబాటులో ఉంది. మీరు దీన్ని ఈ డివైజ్‌లలో డిఫాల్ట్ అసిస్టెంట్‌గా కూడా చేయవచ్చు. కానీ, ఆపిల్ ప్రపంచంలో జెమిని ఇతర ఏఐ అసిస్టెంట్స్ మాదిరిగా పనిచేస్తుంది.

ఐఫోన్‌‌లో జెమిని ఏఐ :
జెమిని ఏఐ ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. గూగుల్ ఆండ్రాయిడ్ యూజర్లకు పరిధిని విస్తరించుకోవడమే కాకుండా, క్రాస్ ప్లాట్‌ఫారమ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఏఐ చాట్‌బాట్ వాయిస్ అవతార్ అయిన జెమిని లైవ్.. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి ఐఫోన్ యూజర్లకు అందుబాటులో ఉంది.

జెమిని లైవ్ అనేది ఆండ్రాయిడ్ యూజర్లకు సరైన ఆప్షన్‌గా నిలుస్తోంది. ఎందుకంటే.. చాలా యాప్‌లు (ప్రీ ఇన్‌స్టాల్) గూగుల్ నుంచి వచ్చినివే. ఈ విధంగా మీరు గూగుల్ వైడ్ రేంజ్ యాప్‌ల ద్వారా అందుబాటులో ఉన్న టాస్క్‌లను నిర్వహించేందుకు జెమిని అసిస్టెంట్‌ని పొందవచ్చు.

కానీ, ఐఓఎస్‌తో ఆప్షన్ ఐఫోన్ యూజర్లకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. గూగుల్ మ్యాప్స్, యూట్యూబ్ లేదా జీమెయిల్ కూడా ఉపయోగించకపోతే, జెమిని లైవ్‌ పరిమితంగా ఉంటుంది. ఆపిల్ అన్ని యాప్‌లను యాక్సెస్ చేసేందుకు జెమినిని అనుమతించదని గమనించాలి.

Read Also : NEET UG Counselling 2024 : నీట్ యూజీ కౌన్సెలింగ్ స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ షెడ్యూల్‌ విడుదల