Apple iPhone Users : ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. ఈ ఐఫోన్లలో ఇకపై యాప్ స్టోర్, సిరి పనిచేయవు.. ఎందుకో తెలుసా?

Apple iPhone Users : ఆపిల్ ఐఫోన్ (Apple iPhone) యూజర్లకు అలర్ట్.. మీరు వాడే ఐఫోన్ మోడల్ వెర్షన్ ఏంటి? ఓసారి చెక్ చేసుకోండి. పాత వెర్షన్ ఐఫోన్లలో యాప్ స్టోర్, సిరి వంటి ఫీచర్లు పనిచేయవు.

Apple iPhone Users : ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. ఈ ఐఫోన్లలో ఇకపై యాప్ స్టోర్, సిరి పనిచేయవు.. ఎందుకో తెలుసా?

iPhone users running older version of iOS may not be able to access App Store, Siri and others

Updated On : April 8, 2023 / 6:09 PM IST

Apple iPhone Users : మీరు ఆపిల్ ఐఫోన్ వాడుతున్నారా? (iPhone) లేదా (Macbook iOS) లేదా (macOS) లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేసుకున్నారా? లేదంటే.. ఇప్పుడే అప్‌డేట్ చేసుకోండి. ఎందుకంటే.. కొత్త iOS వెర్షన్ అప్‌డేట్ చేయని ఐఫోన్లలో యాప్ స్టోర్ (App Store), iCloud మరిన్నింటితో సహా కొన్ని ముఖ్యమైన అప్లికేషన్‌లు పనిచేయవు. నివేదికల ప్రకారం.. వచ్చే నెల నుంచి ఆపిల్ పాత సాఫ్ట్‌వేర్ వెర్షన్‌లలో ఆన్‌లైన్ సర్వీసులను నిలిపివేయనుంది. Apple ఇన్విరాన్‌మెంట్ సిస్టమ్ అంతటా iOS, macOS, watchOS, tvOS కొన్ని వెర్షన్‌లను అందిస్తోంది.

అయితే, iCloud యూజర్లపై ప్రభావితం ఉండదని గమనించాలి. నివేదిక ప్రకారం.. ఈ ప్రాసెస్ కొద్ది శాతం మంది యూజర్లపైనే ప్రభావితమయ్యే అవకాశం ఉంది. మే ప్రారంభం నాటికి, ఐక్లౌడ్ మినహా ఆపిల్ సర్వీసులకు యాక్సెస్ రన్ చేస్తున్న డివైజ్‌ల్లో నిలిచిపోనుంది. ఆపిల్ అందించే iOS 11-11.2.6, macOS 10.13-10.13.3, watchOS 4-4.2.3, tvOS 11 -11.2.6 అప్‌డేట్ చేయమని నోటిఫికేషన్ ప్రాంప్ట్ వచ్చే అవకాశం ఉంది.

Read Also : iPhones iOS 17 Update : ఈ మూడు ఐఫోన్లలో కొత్త iOS 17 అప్‌డేట్ రాదట.. ఏయే ఐఫోన్లలో అప్‌డేట్‌ రానుంది? ఫుల్ లిస్టు ఇదిగో..!

పాత ఐఫోన్ వాడే యూజర్లకు ఇంటర్నల్ ఆపిల్ డాక్యుమెంట్ పుష్ నోటిఫికేషన్‌ను పంపే అవకాశం ఉందని (MacRumors) నివేదిక తెలిపింది. కొత్త సాఫ్ట్‌వేర్ వెర్షన్‌కి వెంటనే అప్‌డేట్ చేయమని సూచిస్తుంది. కొన్ని పాత సాఫ్ట్‌వేర్ వెర్షన్‌లు ఇకపై యాప్ స్టోర్, సిరి, మ్యాప్స్ వంటి Apple సర్వీసులకు సపోర్టు అందించవు.

iPhone users running older version of iOS may not be able to access App Store, Siri and others

Apple iPhone Users : iPhone users running older version of iOS may not be able to access App Store, Siri and others

ఈ సర్వీసులను కొనసాగించాలంటే.. ఆపిల్ కొత్త సాఫ్ట్‌వేర్‌కు అందుబాటులో ఉన్న లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేసుకోవాలని కంపెనీ పేర్కొంది. MacRumors ప్రకారం.. 2017 చివరిలో 2018 ప్రారంభంలో లాంచ్ అయిన పాత సాఫ్ట్‌వేర్ వెర్షన్‌లతో చాలా వరకు సర్వీసులు ఎందుకు పనిచేయవో ఆపిల్ క్లారిటీ ఇవ్వలేదు.

ఈ మార్పుతో కొద్ది శాతం మంది యూజర్లపై మాత్రమే ప్రభావం ఉంటుందని ఆపిల్ తెలిపింది. టెక్ దిగ్గజం యూజర్లకు సరికొత్త, అత్యంత లేటెస్ట్ టెక్నాలజీని అందించే దిశగా ప్రయత్నాలు చేపట్టింది. ఆపిల్ ఇటీవల iOS 16.4 అప్‌డేట్‌ను రిలీజ్ చేసింది. ఇందులో.. కొత్త సెట్ ఎమోజీలు, వెబ్ పుష్ నోటిఫికేషన్‌లు, సెల్యులార్ కాల్‌లపై వాయిస్ ఐసోలేషన్ వంటి మరిన్ని కొత్త ఫీచర్లు ఉన్నాయి. సెట్టింగ్‌లు, జనరల్, ఆపై సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌కు నావిగేట్ చేయడం ద్వారా యూజర్లు లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవచ్చు.

Read Also : WhatsApp Feature : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. మీ స్టేటస్‌ను నేరుగా ఫేస్‌బుక్‌లో షేర్ చేసుకోవచ్చు తెలుసా?