Apple Smart Glasses : ఆపిల్ లవర్స్‌కు అదిరే న్యూస్.. స్మార్ట్ గ్లాసెస్, ఎయిర్‌ప్యాడ్ కెమెరాలతో వచ్చేస్తున్నాయి.. టచ్ చేయకుండానే కంట్రోలింగ్..!

Apple Smart Glasses : ఆపిల్ ఏఐ ఆధారిత స్మార్ట్ గ్లాసెస్, ఇన్ఫ్రారెడ్ కెమెరాలతో కూడిన స్మార్ట్ ఎయిర్‌పాడ్‌లను డెవలప్ చేస్తోందని సమాచారం. ఈ రెండు ప్రాజెక్టులు లాంచ్ అయ్యేందుకు మరింత ఆలస్యం అవుతుందని నివేదికలు సూచిస్తున్నాయి.

Apple Smart Glasses

Apple Smart Glasses : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ నుంచి సరికొత్త స్మార్ట్ గ్లాసెస్ తీసుకొస్తోంది. ఈ AR గ్లాసెస్ లాంచ్‌కు సంబంధించి గత కొంతకాలంగా నివేదికలు చెబుతున్నాయి. ఈ స్మార్ట్ గ్లాసెస్‌లో కెమెరా, మైక్రోఫోన్ ఉండొచ్చునని చెబుతున్నారు.

అంతేకాదు.. ఇన్ఫ్రారెడ్ కెమెరాలతో ఎయిర్‌పాడ్‌లను కూడా కంపెనీ త్వరలో ప్రవేశపెట్టనుంది. బ్లూమ్‌బెర్గ్ మార్క్ గుర్మాన్ ప్రకారం.. ఆపిల్ స్మార్ట్‌గ్లాసెస్ ప్రాజెక్ట్, N50 అనే కోడ్‌నేమ్‌‌తో డెవలప్ స్టేజీలో ఉంది. కంపెనీ ఈ స్మార్ట్ గ్లాసులను రియల్ ఆపిల్ ఇంటెలిజెన్స్ డివైజ్‌గా రూపొందిస్తోంది. అయితే, కంపెనీ 2027 నాటికి ఈ స్మార్ట్ గ్లాసెస్ లాంచ్ చేసే అవకాశం ఉంది.

Read Also : Powerful Bikes : సూపర్ బైక్స్ అదుర్స్.. 5 పవర్‌ఫుల్ 650cc బైక్స్ ఇవే.. రోడ్డుపై రయ్ రయ్‌మని దూసుకెళ్లొచ్చు.. ధర, మైలేజీ ఎంతంటే?

ఆపిల్ స్మార్ట్ గ్లాసెస్ లాంచ్ మరింత ఆలస్యం :
తేలికైన ఫంక్షనల్ స్మార్ట్ గ్లాసెస్ తయారీలో ఆపిల్ అనేక పెద్ద సవాళ్లను ఎదుర్కొంటుందని నివేదిక పేర్కొంది. ఇందులో ప్రత్యేక టెక్నాలజీ, డిజైన్‌కు సంబంధించిన అనేక సవాళ్లు ఉన్నాయి. అయితే ఈ గ్లాసెస్ అనేక స్పెషల్ ఏఐ ఫీచర్లతో అమర్చి ఉంటాయి.

ఈ AR గ్లాసెస్ లాంచ్ కనీసం 3 నుంచి 5 సంవత్సరాలు ఆలస్యం కావచ్చని గుర్మాన్ గతంలో పేర్కొన్నారు. హార్డ్‌వేర్ పవర్, డిస్‌ప్లే క్వాలిటీ, బ్యాటరీ లైఫ్, ఆకర్షణీయమైన డిజైన్ అమర్చడం వంటివి ఆలస్యానికి కారణాలుగా చెప్పవచ్చు.

కెమెరాతో కొత్త ఎయిర్‌పాడ్‌లు :
స్మార్ట్ గ్లాసెస్ మాత్రమే కాదు.. ఎయిర్‌పాడ్స్ సిరీస్‌ను మరింత స్మార్ట్‌గా మార్చేందుకు ఆపిల్ సన్నాహాలు చేస్తోంది. బయటకు కనిపించే ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలతో కొత్త ఎయిర్‌పాడ్‌లను కంపెనీ రెడీ చేస్తోందని నివేదికలు చెబుతున్నాయి. అయితే, సాధారణ కెమెరాలు కాదట.. ఐఫోన్ ఫేస్ ఐడీలో మాదిరి సమానమైన ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్లు ఉంటాయి.

వాస్తవానికి, ఈ ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలు ప్రాదేశిక డేటాను సేకరించి ఏఐ సిస్టమ్‌కు పంపుతుంది. ఈ టెక్నాలజీ సాయంతో ఎయిర్‌పాడ్స్ వినియోగదారులు మరింత పర్సనలైజడ్, ఇంటరాక్టివ్ ఎక్స్‌పీరియన్స్ పొందుతారు. ఈ ఇన్‌ఫ్రారెడ్ కెమెరాల సాయంతో ఎయిర్‌పాడ్‌లపై టచ్ చేయకుండా గెచర్ ఆధారిత కంట్రోలింగ్ కూడా సపోర్టు అందిస్తుందని భావిస్తున్నారు.

ఆపిల్ స్మార్ట్ గ్లాసెస్ లాంచ్ టైమ్‌లైన్ :
ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలతో ఎయిర్‌పాడ్‌లు 2026 లేదా 2027 నాటికి లాంచ్ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకుడు మింగ్-చి కువో అంచనా వేశారు. ఈ టెక్నాలజీ ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని, మరికొన్ని ఏళ్లు సమయం పట్టే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు మెటా 2023లో రే-బాన్‌తో కలిసి స్మార్ట్ గ్లాసెస్‌ను ప్రవేశపెట్టింది. కంపెనీ ఇప్పుడు త్వరలో రే-బాన్ మెటా స్మార్ట్ గ్లాసెస్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేయనున్నట్లు ధృవీకరించింది.

Read Also : Motorola Edge 50 Pro : అమెజాన్ బంపర్ డిస్కౌంట్.. మోటోరోలా ఎడ్జ్ 50ప్రో ధర తగ్గిందోచ్.. ఇలా కొన్నారంటే తక్కువకే వస్తుంది..!

ఎస్సిలర్‌లక్సోటికా (EssilorLuxottica)తో కలిసి అభివృద్ధి చేసిన ఈ గ్లాసెస్ క్లాసిక్ రే-బాన్ స్టైలింగ్‌ను మెటా ఏఐ సామర్థ్యాలతో కలిసి పనిచేస్తాయి. అమెరికాలో ఈ స్మార్ట్ గ్లాసెస్ కెమెరాలు, స్పీకర్లతో వస్తాయి. ధరకు 299 డాలర్లకు లభిస్తుంది. వినియోగదారులు ఫోటోలు, వీడియోలను రికార్డ్ చేయడం, కాల్స్ చేయడంతో పాటు “Hey Meta” వంటి కమాండ్స్ ఉపయోగించి రియల్ టైమ్ లాంగ్వేజీ ట్రాన్స్‌లేషన్స్ హ్యాండ్స్-ఫ్రీగా పొందొచ్చు.