Apple Noida Store
Apple Noida Store : ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. భారత మార్కెట్లో మరో కొత్త ఆపిల్ స్టోర్ ప్రారంభం కానుంది. ఐఫోన్‌తో సహా అనేక ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను అందించే ఆపిల్ ఈ నెల 11న నోయిడాలో కొత్త స్టోర్ ఓపెన్ చేయనుంది. నోయిడా స్టోర్ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. ఈ ఆపిల్ స్టోర్ ఢిల్లీకి దగ్గరగా ఉన్న నోయిడాలోని DLF మాల్ ఆఫ్ ఇండియాలో ప్రారంభం కానుంది. ఇది దేశంలో ఆపిల్ 5వ స్టోర్ అనమాట. గతంలో ఆపిల్ కంపెనీ ముంబై, ఢిల్లీ, బెంగళూరు, పూణేలలో స్టోర్‌లను ప్రారంభించింది.
80 మందికిపైగా ట్రైనింగ్ నిపుణులు :
ఈ నోయిడా ఆపిల్ స్టోర్ ఉత్తరప్రదేశ్‌లో మొదటిది. ఈ కొత్త ఆపిల్ స్టోర్ వినియోగదారులకు అన్ని ఆపిల్ ప్రొడక్టులను ప్రత్యేకమైన షాపింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఈ కొత్త ఆపిల్ స్టోర్ అద్దె విషయానికి వస్తే మిలియన్లలో ఉంటుందని అంచనా. ఈ స్టోర్ ప్రత్యేకతలు కొనుగోలుదారులను ఆకర్షించేలా చాలా అద్భుతంగా ఉన్నాయి. మొదటి రోజు నుంచి కస్టమర్లకు సర్వీసు అందించేందుకు 80 మందికి పైగా ట్రైనింగ్ పొందిన నిపుణులు అందుబాటులో ఉంటారు. లేటెస్ట్ ఐఫోన్‌లు, ఆపిల్ వాచీలు, కొత్త ఐప్యాడ్‌తో సహా అన్ని ఆపిల్ డివైజ్‌ల గురించి సమాచారాన్ని అందిస్తారు.
కస్టమర్లకు అందించే సౌకర్యాలివే :
ఈ ఆపిల్ స్టోర్ కస్టమర్లకు ప్రత్యేకమైన ఆపిల్ సర్వీసులను కూడా అందిస్తోంది. ఇందులో ప్రతి డివైజ్ కస్టమైజేషన్, మీరు కొత్త యూజర్ అయితే iOSకి ఈజీగా మారేందుకు అసిస్టెన్స్ అందిస్తుంది. ఆపిల్ ట్రేడ్-ఇన్ ద్వారా పాత డివైజ్‌లను ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఈఎంఐలో ఆపిల్ ఐఫోన్లు కొనుగోళ్లు చేయొచ్చు. ప్రతి డివైజ్ నుంచి ఎక్కువ బెనిఫిట్ పొందవచ్చు.
ఆపిల్ స్టోర్ ప్రత్యేకతలేంటి? :
ఈ స్టోర్‌లో ఆపిల్ మ్యూజిక్, ఆపిల్ టీవీ, ఇతర సర్వీసులను ప్రదర్శించే ప్రొడక్టు బాక్సులు కూడా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఆపిల్ సౌకర్యాల మాదిరిగానే ఆపిల్ నోయిడా 100 శాతం రీజనరేటివ్ పవర్‌తో నడుస్తుంది. కార్బన్ తటస్థంగా ఉంటుంది. సందర్శకులు ఆపిల్ క్రియేటివ్స్ నేతృత్వంలోని ఫ్రీ ఆపిల్ సెషన్లలో చేరవచ్చు.
ఫోటోగ్రఫీ, ఆర్ట్, మ్యూజిక్, కోడింగ్ ప్రొడక్టవిటీని కవర్ చేస్తాయి. కస్టమర్లు సెషన్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఆపిల్ డివైజ్‌ల నుంచి మరిన్ని పొందడానికి కొత్త స్కిల్స్ నేర్చుకోవచ్చు. ఆపిల్ వెబ్‌సైట్‌లో ప్రత్యేకమైన ఆపిల్ నోయిడా వాల్‌పేపర్‌లు, క్యూరేటెడ్ ఆపిల్ మ్యూజిక్ ప్లేలిస్ట్ ద్వారా స్టోర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.
మీడియా నివేదికల ప్రకారం.. DLF మాల్ ఆఫ్ ఇండియాలోని ఆపిల్ స్టోర్ 8,240.78 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఆపిల్ ఈ స్టోర్‌ను 11 సంవత్సరాలకు లీజుకు తీసుకుంది. కుపెర్టినో ఆధారిత టెక్ దిగ్గజం లీజుకు తీసుకున్న మొదటి సంవత్సరంలో ఎలాంటి అద్దె చెల్లించాల్సిన అవసరం లేదు. CRE మ్యాట్రిక్స్ ప్రకారం.. ఆపిల్ నోయిడా మాల్ గ్రౌండ్ ఫ్లోర్‌లో 6 యూనిట్లను లీజుకు తీసుకుంది. 11 ఏళ్లకు గానూ నెలవారీ అద్దె చదరపు అడుగుకు రూ. 263.15 ఉంటుంది.
ఈ కాలంలో ఒక ఏడాది అద్దె మినహాయింపు కూడా ఉంటుంది. నెలవారీ అద్దె దాదాపు రూ. 45.3 లక్షలు లేదా సంవత్సరానికి సుమారు రూ. 5.4 కోట్లు ఉంటుంది. మొత్తం పదకొండేళ్ల కాలానికి మొత్తం అద్దె సుమారు రూ. 65 కోట్లు ఉంటుంది. డాక్యుమెంట్ల ప్రకారం.. అద్దె ప్రతి 3 సంవత్సరాలకు 15శాతం పెరుగుతుంది. ఈ సబ్ లీజు డీల్ ఫిబ్రవరి 25, 2025న సంతకం చేసింది.
నోయిడానే ఎందుకంటే? :
రిటైల్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నోయిడాలోని DLF మాల్ ఆపిల్‌కు ముఖ్యమైన లొకేషన్. కంపెనీ పెరుగుతున్న మార్కెట్, ప్రాంతీయంగా ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. అందుకే నోయిడాలో స్టోర్ ఓపెన్ చేస్తుంది. ఘజియాబాద్, గ్రేటర్ నోయిడా, దక్షిణ ఢిల్లీ, ఆగ్రా, మీరట్ వంటి ప్రాంతాలను కవర్ చేస్తుంది. ఈ ఆపిల్ స్టోర్‌కు పెద్ద కస్టమర్ బేస్‌ను అందిస్తుందని రిటైల్ నిపుణులు విశ్వసిస్తున్నారు.