Diwali Offer : ఆపిల్ ఐఫోన్ 12 కొంటే.. ఎయిర్‌పాడ్స్ ఫ్రీ..
ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ దీపావళి ఆఫర్ ప్రకటించింది. ఆపిల్ ఐఫోన్ కొనే కస్టమర్లకు విలువైన ఎయిర్ పాడ్స్ ఉచితంగా ఆఫర్ చేస్తోంది.

Free Airpods With Iphone 12
Apple Offering Free AirPods : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ దీపావళి ఆఫర్ ప్రకటించింది. ఆపిల్ ఐఫోన్ కొనే కస్టమర్లకు విలువైన ఎయిర్ పాడ్స్ ఉచితంగా ఆఫర్ చేస్తోంది. ఆపిల్ ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ కొనేవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందట. పండుగ సీజన్ కావడంతో భారతీయ మార్కెట్లో యూజర్ల కోసం ఆపిల్ కంపెనీ ఈ బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది.
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ తో డబుల్ గేమ్ ఆడుతున్న నిర్మాతలు : నట్టి కుమార్
ఈ రెండు ఐఫోన్ రెండు వేరియంట్లలో ఏది కొన్నా రూ.15వేల విలువైన ఎయిర్ ప్యాడ్స్ సొంతం చేసుకోవచ్చు. ఆపిల్ తమ ప్రొడక్టుల ప్రమోషన్లలో భాగంగా గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది 2021లోనూ భారీ ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. అక్టోబర్ 7 నుంచి నవంబర్ 4 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. పరిమిత ఆఫర్ అందిస్తోంది.
స్టాక్ ఉన్నంతవరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందని తెలిపింది. దివాళీ ఫెస్టివల్ సందర్భంగా అక్టోబర్ 7 నుంచి ఆపిల్ ఇండియా స్టోర్‌లో ప్రారంభం కానుంది. iPhone, iPhone 12mini ఫోన్ల ఆఫర్లను ప్రకటించింది. ఆపిల్ ఇండియా స్టోర్‌లో దివాళీ సేల్‌లో ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ కొనుగోలు చేసి యూజర్లకు ఎయిర్‌పాడ్స్‌ను ఉచితంగా అందించనున్నారు.
iPhone 13 తర్వాత iPhone 12 ధరలను ఆపిల్ ఒక్కసారిగా తగ్గించింది. ఐఫోన్ 12, 64GB మోడల్ ధర రూ.65,900 ఉండగా.. 128GB స్టోరేజ్ ధర రూ.70,900, 256GB స్టోరేజ్ ధర రూ.80,900గా ఉండనుంది. iPhone miniలో 64GB వేరియంట్ ధర రూ.59,900 ఉండనుంది. 128GB వేరియంట్ ధర రూ.64,900, 256GB వేరియంట్ ధర రూ.74,900గా ఉండనుంది.
BiggBoss : బిగ్ బాస్ లో కొత్త లవ్ స్టోరీ.. ముద్దులతో గుడ్ నైట్..