iPhone 16E Launch : కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? చౌకైన ధరకే ఐఫోన్ 16E వచ్చేస్తోంది.. ఫీచర్లు, డిజైన్ వివరాలివే!

iPhone 16E Launch : లీక్ డేటా ప్రకారం.. ఆపిల్ చౌకైన ఐఫోన్ 16Eని తీసుకువస్తోంది. ఈ కొత్త ఐఫోన్ ధర, ఫీచర్లు లీక్ అయ్యాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.

iPhone 16E Launch : కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? చౌకైన ధరకే ఐఫోన్ 16E వచ్చేస్తోంది.. ఫీచర్లు, డిజైన్ వివరాలివే!

Apple rumoured to launch iPhone SE 4 in 2025

Updated On : January 2, 2025 / 5:23 PM IST

iPhone 16E Launch : మీరు కొత్త ఐఫోన్‌ని కొనుగోలు చేయాలని చూస్తున్నారా? మీకో శుభవార్త. టెక్ దిగ్గజం ఆపిల్ కంపెనీ త్వరలో ఐఫోన్ SE4 ప్రవేశపెట్టబోతుంది. 2025 మొదటి త్రైమాసికంలో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.

గత కొన్ని నెలల్లో, 4వ జనరేషన్ ఐఫోన్ ఎస్ఈ డిజైన్, స్పెసిఫికేషన్‌ల గురించి అనేక లీక్‌లు వచ్చాయి. ఇప్పుడు లాంచ్ సమయంలో ఈసారి హ్యాండ్‌సెట్ పేరు భిన్నంగా ఉంటుందని కొత్త లీక్ వెల్లడించింది. లీక్ డేటా ప్రకారం.. ఆపిల్ చౌకైన ఐఫోన్ 16Eని తీసుకువస్తోంది. ఈ కొత్త ఐఫోన్ ధర, ఫీచర్లు లీక్ అయ్యాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.

Read Also : iPhone 16 Pro Discount : ఆపిల్ ఐఫోన్ 16 ప్రోపై భారీ డిస్కౌంట్.. ఇదే బెస్ట్ ఛాన్స్.. డోంట్ మిస్!

ఆపిల్ ఈసారి ఐఫోన్ 16 లైనప్‌కి కొత్త ఐఫోన్ ఎస్ఈని చేర్చనుంది. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో కూడిన A18 చిప్‌సెట్‌ను అందించాలని కంపెనీ భావిస్తోంది. అదే సమయంలో, ఆపిల్ రాబోయే ఐఫోన్ ఎస్ఈ ఐఫోన్ 16ఇ పేరుతో రానుందని టిప్‌స్టర్ మాజిన్ బూ పేర్కొన్నారు. రాబోయే ఐఫోన్ 16e మోడల్ పేరు సెప్టెంబరులో లాంచ్ అయిన ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మోడల్‌ల పేర్లతో సరిపోలనుంది.

ఐఫోన్ 16ఇ డిజైన్ ఎలా ఉండొచ్చు? :
ఆన్‌లైన్‌లో ఐఫోన్ 16ఇ ఫోన్ పేరు కనిపించడం ఇదే మొదటిసారి కాదు. గత డిసెంబర్‌లో టిప్‌స్టర్ ఫిక్స్‌డ్ ఫోకస్ డిజిటల్ నెక్స్ట్ ఎస్ఈ ఫోన్ పేరును వెయిబో పోస్ట్‌లో వెల్లడించింది. ఈ ఫోన్ iPhone16e పేరుతో రానుంది. ఐఫోన్ ఎస్ఈ 4 లేదా ఐఫోన్ 16E కేస్ రెండర్‌లను కూడా లీక్ అయ్యాయి. బ్యాక్ ప్యానెల్ టాప్ లెఫ్ట్ కార్నర్‌లో కెమెరా యూనిట్ కేసు కటౌట్‌ను కలిగి ఉంది. దీని డిజైన్ ఐఫోన్ 14 ఆధారంగా ఉంటుందని భావిస్తున్నారు.

కీలక ఫీచర్లు (అంచనా) :
• డిస్‌ప్లే : ఫేస్ ఐడీ సపోర్టుతో ఓఎల్ఈడీ స్క్రీన్.
• ప్రాసెసర్ : A18 చిప్‌సెట్, టాప్-టైర్ పర్ఫార్మెన్స్
• కెమెరా : 48ఎంపీ ప్రైమరీ కెమెరా, ఐఫోన్ 16 మాదిరి కెమెరా
• మెమరీ : 8జీబీ ర్యామ్ మెరుగైన మల్టీ టాస్కింగ్
• డిజైన్ : స్లీక్ మోడ్రాన్ ఐఫోన్ 14ని పోలి ఉండొచ్చు.

ఐఫోన్ 16E ఫీచర్లు, ధర వివరాలు :
ఐఫోన్ ఎస్ఈ 4 లేదా ఐఫోన్ 16ఇ ఫోన్ 2025 ఏడాదిలో అధికారికంగా లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. కంపెనీ వచ్చే మార్చిలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఆపిల్ రాబోయే మోడల్‌లో ఎంట్రీ లెవల్ ఐఫోన్ 16లో ఇచ్చిన ప్రాసెసర్‌ని ఉపయోగించవచ్చు. ఈ కొత్త ఫోన్‌లో ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. 8జీబీ ర్యామ్, 6.06-అంగుళాల ఎల్‌టీపీఎస్ ఓఎల్ఈడీ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ ఫేస్ ఐడీకి సపోర్ట్ చేయవచ్చు. 3,279mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

లేటెస్ట్ ఐఫోన్ 16 మాదిరిగా సింగిల్ 48ఎంపీ బ్యాక్ కెమెరాను కలిగి ఉంటుందని అంచనా. నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్ ఎస్ఈ అంటే.. ఐఫోన్ 16ఈ ధర 500 డాలర్ల కన్నా తక్కువగా ఉంటుంది. అంటే దాదాపు రూ. 42వేలు ఉంటుంది. దక్షిణ కొరియాలో ఈ ఐఫోన్ ధర కేఆర్‌డబ్ల్యూ KRW 8,00,000 కన్నా ఎక్కువగా ఉంటుంది.. అంటే.. దాదాపు రూ. 46వేలు ఉంటుందని అంచనా.

Read Also : Apple iPhone 17 Launch : భారీ అప్‌గ్రేడ్‌లతో ఆపిల్ ఐఫోన్ 17 వచ్చేస్తోంది.. మునుపెన్నడూ చూడని ఫీచర్లు..!