Apple Affordable iPads : అత్యంత సరసమైన కొత్త ఐప్యాడ్‌లు.. ఈ నెల 17నే లాంచ్.. పూర్తి వివరాలు మీకోసం..!

Apple Affordable iPads : కొత్త ఐప్యాడ్ కొనేందుకు చూస్తున్నారా? ఈ నెల (అక్టోబర్ 17)న ఆపిల్ అత్యంత సరసమైన కొత్త ఐప్యాడ్స్ లాంచ్ చేయనుంది. ఐప్యాడ్ లైనప్‌లో లేటెస్ట్ సెట్‌ను కంపెనీ ఆవిష్కరించనుందని నివేదిక పేర్కొంది.

Apple Affordable iPads : అత్యంత సరసమైన కొత్త ఐప్యాడ్‌లు.. ఈ నెల 17నే లాంచ్.. పూర్తి వివరాలు మీకోసం..!

Apple said to announce new affordable iPads on October 17, here are the details

Apple Affordable iPads : కొత్త ఐప్యాడ్ కొంటున్నారా? అయితే, సరసమైన వెర్షన్లలో ఐప్యాడ్స్ రానున్నాయి. ఆపిల్ (Apple) ఇటీవలే ప్రధాన ఐఫోన్ 15 ఈవెంట్‌ (Apple iPhone 15 Event)ను నిర్వహించగా.. ఇప్పుడు కంపెనీ వచ్చే వారం కొత్త ప్రొడక్టులను లాంచ్ చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. (9to5Mac) నివేదిక ప్రకారం.. లేటెస్ట్ ఐప్యాడ్ లైనప్‌ను ఆపిల్ ఆవిష్కరిస్తుంది. అంటే.. అక్టోబర్ 17న లాంచ్ ఈవెంట్ జరగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Read Also : Samsung Galaxy S24 Ultra : అద్భుతమైన కెమెరాతో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది.. ధర ఎంత ఉండొచ్చుంటే?

లీక్‌ను విశ్వసిస్తే.. ప్రధానంగా ఐప్యాడ్ ఎయిర్ (iPad Air), ఐప్యాడ్ మినీ(iPad mini), బేస్ మోడల్ ఐప్యాడ్‌పై దృష్టి పెట్టింది. ఆపిల్ కేవలం డిజైన్‌లో కాస్మెటిక్ మార్పులు చేయవచ్చు. కొత్త ఐప్యాడ్‌లు హార్డ్‌వేర్ పరంగా అప్‌గ్రేడ్‌లను పొందే అవకాశం ఉంది. దాదాపు 3 ఏళ్ల క్రితం లాంచ్ అయిన ప్రస్తుత (iPad Air) M1 చిప్‌తో ఆధారితమైనది. ఆపిల్ ఈ మోడల్‌ను M2 చిప్‌కి అప్‌గ్రేడ్ చేయడంతో పాటుపర్ఫార్మెన్స్ సామర్థ్యాన్ని అందిస్తుంది. మరోవైపు, ఐప్యాడ్ మినీ A16 బయోనిక్ చిప్‌కి అప్‌గ్రేడ్‌ అందుకోనుంది.

ఈ కొత్త అప్‌డేట్‌తో స్ర్కోలింగ్ ఇష్యూ ఫిక్స్ :
ప్రస్తుత A15 బయోనిక్ చిప్ కన్నా కొద్దిగా పెద్దదిగా ఉండనుంది. ఈ అప్‌గ్రేడ్ ద్వారా ప్రస్తుత ఐప్యాడ్ మినీ కొనుగోలు చేసిన కొంతమంది వినియోగదారులను ఇబ్బందిపెట్టే ‘జెల్లీ స్క్రోలింగ్’ సమస్యను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా సున్నితమైన స్క్రోలింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. కేవలం, ఒక ఏడాది క్రితం చివరి అప్‌డేట్‌ని అందుకున్న బేస్ మోడల్ ఐప్యాడ్ కూడా కొత్త అప్‌గ్రేడ్‌ లైన్‌లో ఉంది. 10వ జనరేషన్ ఐప్యాడ్ సన్నని బెజెల్స్, కొత్త కలర్ ఆప్షన్లు, సపోర్టెడ్ టచ్ ID సైడ్ బటన్‌తో సొగసైన డిజైన్‌ను అందిస్తుంది.

Apple said to announce new affordable iPads on October 17, here are the details

Apple new affordable iPads o

రాబోయే 11వ-జనరేషన్ మోడల్‌కు సంబంధించిన చిప్ ప్రత్యేకతలు ఇంకా బహిర్గతం కాలేదు. ఐప్యాడ్ మినీ అప్‌గ్రేడ్‌తో సింకరైజ్ చేసిన A16 చిప్‌తో కూడా అమర్చబడి ఉండవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఐప్యాడ్ ప్రో లైనప్ అక్టోబర్ 2022లో లేటెస్ట్ అప్‌డేట్‌ను పొందింది.

రాబోయే ఏడాది చివరి భాగం వరకు నెక్స్ట్ జనరేషన్ మోడల్‌లను అందించే అవకాశం ఉంది. అప్పటివరకూ ఆపిల్ అభిమానులు కొంత ఓపిక పట్టవలసి ఉంటుంది. భవిష్యత్తులో ఐప్యాడ్ ప్రో మోడల్‌ల్స్ OLED డిస్‌ప్లేలతో రావొచ్చు. బడ్జెట్-ఫ్రెండ్లీ మోడళ్లకు ప్రాధాన్యతనిస్తూ ఐప్యాడ్ లైనప్‌ను పునరుద్ధరించాలనే ఆపిల్ నిర్ణయంతో మరింత మంది ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.

Read Also : Apple Unsold iPhones : కొత్త సాఫ్ట్‌వేర్ సిస్టమ్.. ఆపిల్ స్టోర్లలో విక్రయించని ఐఫోన్లలో ఐఓఎస్ అప్‌డేట్ ఎలా చేస్తుందంటే?