Apple Unsold iPhones : కొత్త సాఫ్ట్‌వేర్ సిస్టమ్.. ఆపిల్ స్టోర్లలో విక్రయించని ఐఫోన్లలో ఐఓఎస్ అప్‌డేట్ ఎలా చేస్తుందంటే?

Apple Unsold iPhones : ఆపిల్ స్టోర్ల (Apple Stores)లో విక్రయించని ఐఫోన్‌లను బాక్స్‌లను ఓపెన్ చేయకుండానే కంపెనీ అప్‌డేట్ చేయనుంది.

Apple Unsold iPhones : కొత్త సాఫ్ట్‌వేర్ సిస్టమ్.. ఆపిల్ స్టోర్లలో విక్రయించని ఐఫోన్లలో ఐఓఎస్ అప్‌డేట్ ఎలా చేస్తుందంటే?

Apple will start updating unsold iPhones in stores without opening the boxes

Apple Unsold iPhones : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) సంబంధిత స్టోర్లలో విక్రయించని ఐఫోన్లలో కూడా కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్ చేయనుంది. కనీసం, ప్యాకేజింగ్‌ను కూడా ఓపెన్ చేయకుండానే ఐఫోన్ల కోసం స్టోర్‌లో iOS అప్‌డేట్‌లను (Unsold iphones for iOS Updates) ఎనేబుల్ చేసే కొత్త సిస్టమ్‌ను అందించనుంది. తద్వారా (Apple iPhones) కొనుగోలుకు సిద్ధంగా ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఆపిల్ కొత్తగా కొనుగోలు చేసిన ఐఫోన్‌లకు ఇన్‌స్టంట్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ అవసరమని కంపెనీ చెబుతోంది.

Read Also : Google Discover Feed : గూగుల్ సెర్చ్‌లో సరికొత్త ఫీచర్.. భారతీయ యూజర్ల కోసం డెస్క్‌టాప్‌లో డిస్కవర్ ఫీడ్..!

యూజర్ల అనుభవాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది. బ్లూమ్‌బెర్గ్ మార్క్ గుర్మాన్ ప్రకారం.. ఈ ప్రాసెస్ ఆపిల్ స్టోర్స్‌లో ప్రత్యేకంగా రూపొందించిన ‘ప్యాడ్ లాంటి డివైజ్’పై ఆధారపడి ఉంటుంది. ఈ డివైజ్‌పై ఆపిల్ స్టోర్ ఉద్యోగులు ఐఫోన్‌ల ఆపరేటింగ్ సిస్టమ్‌ను విక్రయించే ముందు వాటిని సులభంగా అప్‌డేట్ చేయవచ్చు.

ఐఫోన్ డివైజ్ వైర్‌లెస్ అప్‌డేట్ : 
ఓపెన్ చేయని ఐఫోన్ బాక్స్‌లను ప్యాడ్‌పై ఉంచడం ద్వారా డివైజ్ వైర్‌లెస్‌గా యాక్టివేట్ చేసి అప్‌డేట్ చేయనుంది. దాంతో అవసరమైన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను ఆపిల్ అందించనుంది. పూర్తయిన తర్వాత పవర్ డౌన్ చేస్తుంది. ఫలితంగా, యూజర్లు ఆపిల్ స్టోర్ నుంచి నిష్క్రమించినప్పుడు, ఏదైనా ఇన్‌స్టంట్ అప్‌డేట్ ఇబ్బందులను తొలగించనుంది. అప్పుడు, లేటెస్ట్ ఐఫోన్ పొందవచ్చు.

Apple will start updating unsold iPhones in stores without opening the boxes

Apple updating unsold iPhones in stores

సరసమైన ధరకే ఐప్యాడ్.. ఈ నెల 17నే లాంచ్ :
కొత్త ఐఫోన్‌లలో కూడా ఏదైనా సమస్య ఉంటే.. కస్టమర్ షెల్ఫ్‌లో ఉన్న ఐఫోన్‌ను కొనుగోలు చేసే ముందు కంపెనీ త్వరగా పరిష్కరించగలదు. ప్రస్తుతానికి, ఈ సిస్టమ్‌కు ఐఫోన్ అర్హత పొందుతుందనే సమాచారం లేదు. ఐఫోన్ 15 ఇటీవలే లాంచ్ అయింది. కొత్త మోడల్‌లకు సపోర్టు ఇచ్చే అవకాశం ఉంది. ఐఫోన్ కొనుగోలు ప్రక్రియను ఆపిల్ రిటైల్ స్టోర్లలో 2023 చివరిలోపు సిస్టమ్‌ను అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఇదిలా ఉండగా, ఆపిల్ అక్టోబర్ 17న కొత్త సరసమైన ఐప్యాడ్‌లను ప్రకటించాలని యోచిస్తున్నట్లు సమాచారం. లీక్‌ను విశ్వసిస్తే.. రాబోయే ప్రకటన ప్రధానంగా ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ మినీ, బేస్ మోడల్ ఐప్యాడ్‌పై దృష్టి పెట్టనుంది. ఆపిల్ కేవలం డిజైన్‌లో కాస్మెటిక్ మార్పులు చేయవచ్చు. కొత్త ఐప్యాడ్‌లు హార్డ్‌వేర్ పరంగా అప్‌గ్రేడ్‌లను పొందనున్నాయి.

Read Also : Samsung Galaxy S24 Ultra : అద్భుతమైన కెమెరాతో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది.. ధర ఎంత ఉండొచ్చుంటే?