Apple Iphone : త్వ‌ర‌లోనే 5జీ బ‌డ్జెట్ ఫోన్లు

తాజాగా...5G ఐఫోన్లను ఆపిల్ రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఫోన్లను వచ్చే సంవత్సరం మొదటి అర్థభాగంలోనే విడుదల చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

Apple Iphone : త్వ‌ర‌లోనే 5జీ బ‌డ్జెట్ ఫోన్లు

Apple

Updated On : July 21, 2021 / 2:07 PM IST

Apple 5G iPhone : సెల్ ఫోన్ కంపెనీలు రోజుకో కొత్త కొత్త ఆవిష్కరణలతో ముందుకొస్తున్నాయి. వచ్చే సంవత్సరం నుంచి రాబోయే అన్ని ఐఫోన్లు 5Gతోనే వస్తున్నాయనే సంగతి తెలిసిందే. దీంతో పలు ప్రధాన కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకొనేందుకు రకరకాల ఫీచర్లతో సెల్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. సెల్ ఫోన్ కంపెనీల్లో ఆపిల్ ప్రముఖ స్థానం ఉంది.

Read More : AP Grama Ward Sachivalayam : టైమ్‌కి రావాల్సిందే, ఆ పరిధిలోనే నివాసం ఉండాలి.. సచివాలయ వ్యవస్థలో పెనుమార్పులు

ఈ సెల్ ఫోన్ లను కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. తాజాగా…5G ఐఫోన్లను ఆపిల్ రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఫోన్లను వచ్చే సంవత్సరం మొదటి అర్థభాగంలోనే విడుదల చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. 5Gతో కూడిన కొత్త ఐఫోన్ SE పైనా ఆపిల్ పనిచేస్తోందని సమాచారం. సొంత A15 ప్రాసెసర్ తో రానుంది.

Read More : Netrikann : నయనతార ‘నెట్రికన్’ కూడా ఓటీటీలోనే..

ఈ సంవత్సరం ప్రీమియం ఐఫోన్లలోనూ ఇదే చిప్ వాడుతున్న సంగతి తెలిసిందే. కొత్త బడ్జెట్ 5G ఫోన్ కూడా ప్రస్తుతం ఉన్న SE మోడల్ లాగే ఐఫోన్ 8 రీఫ్రెష్ వెర్షన్ లో రానుంది. క్వాల్ కామ్ X 60 మోడమ్ చిప్ ద్వారా ఈ ఫోన్ లో 5G ఎనేబుల్ చేయనున్నారు. ఇక ఈ ఫోన్ విషయానికి వస్తే..4.7 అంగుళాల LCD డిస్ ప్లే ఉండనుందని నిక్కీ వెల్లడించింది. మరి ఆపిల్ విడుదల చేసే ఈ ఫోన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.