Apple iOS 17.1 Update : ఆపిల్ ప్రొడక్టుల కోసం iOS 17.1 కొత్త అప్‌డేట్ వస్తోంది.. సరికొత్త ఫీచర్లు, బగ్ ఫిక్స్ చేసుకోవచ్చు!

Apple iOS 17.1 Update : ఆపిల్ ప్రొడక్టుల కోసం సరికొత్త iOS 17.1 మేజర్ అప్‌డేట్ అతి త్వరలో రిలీజ్ చేయనుంది. ఈ iOS అప్‌డేట్ ద్వారా కొత్త ఫీచర్లతో పాటు బగ్ ఇష్యూలను కూడా ఫిక్స్ చేయనుంది.

Apple iOS 17.1 Update : ఆపిల్ ప్రొడక్టుల కోసం iOS 17.1 కొత్త అప్‌డేట్ వస్తోంది.. సరికొత్త ఫీచర్లు, బగ్ ఫిక్స్ చేసుకోవచ్చు!

Apple to release iOS 17.1 update soon_ New features, fixes and everything

Apple iOS 17.1 Update : ఆపిల్ iOS 17 నుంచి ఫస్ట్ మేజర్ అప్‌డేట్ డెవలప్ చేస్తోంది. గత సెప్టెంబర్‌లో (Appe iPhone 15)తో లాంచ్ కాగా.. ప్రస్తుతం టెస్టింగ్ చేస్తోంది. iOS 17.1అప్‌డేట్‌లో యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరచడానికి కొత్త ఫీచర్‌లు, బగ్ పరిష్కారాలు ఉన్నాయి. ఫ్రెంచ్ నేషనల్ ఫ్రీక్వెన్సీ ఏజెన్సీ (ANFR) ప్రకారం.. ఐఫోన్ 12 నుంచి అధిక విద్యుదయస్కాంత వికిరణ ఉద్గారాల గురించి ఆందోళనలను కూడా పరిష్కరిస్తుంది.

అక్టోబరు 24 నుంచి iOS అప్‌డేట్ లైవ్ అవుతుందని అధికారులు పేర్కొన్నారు. కొత్త OS అప్‌డేట్ గురించి ఆపిల్ నుంచి ఇంకా ఎలాంటి వివరాలు రివీల్ చేయలేదు. అయితే, స్టాండ్‌బై మోడ్, ఫొటో షఫుల్ అప్‌గ్రేడ్, మరిన్నింటికి కస్టమైజడ్ తీసుకువస్తుందని తెలిపింది. iOS 17.1తో రాబోయే సరికొత్త ఫీచర్ల సంబంధించి పూర్తివివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

iOS 17.1 కొత్త ఫీచర్లు, యాక్షన్ బటన్ మార్పులు :
కొత్త iPhone 15 సిరీస్ వినియోగదారులు రాబోయే అప్‌డేట్‌లో యాక్షన్ బటన్‌కు మార్పులను ఆశించవచ్చు. ఈ కొత్త ఐఫోన్ యాక్షన్ బటన్‌ను ట్యాప్ చేయడం వల్ల ఇకపై కెమెరా, ఫ్లాష్‌లైట్, ఫోకస్, మాగ్నిఫైయర్, వాయిస్ మెమో ట్రిగ్గర్ చేయవు. అయితే, మ్యూట్ ఫంక్షన్, షార్ట్‌కట్‌లు వంటి కొన్ని ఫీచర్‌లు ఐఫోన్ జేబులో ఉన్నప్పటికీ ట్రిగ్గర్ చేసే అవకాశం ఉంది.

Read Also : Apple iOS 17.1 Update : ఈ ఐఫోన్లలో ఆపిల్ iOS 17.1 అప్‌డేట్ వచ్చేస్తోంది.. ఇంట్రెస్టింగ్ ఫీచర్లు, మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి!

డైనమిక్ ఐలాండ్ ఫ్లాష్‌లైట్ నోటిఫికేషన్ :
రాబోయే iOS అప్‌డేట్ నాన్-ప్రో iPhone 15 మోడల్‌లకు ఫ్లాష్‌లైట్ నోటిఫికేషన్‌ను అందిస్తుంది. అంటే.. iPhone 14 Pro, iPhone 14 Pro Max, iPhone 15, iPhone 15 Plus వినియోగదారులు తమ ఫ్లాష్‌లైట్‌లను ఆన్ చేసినప్పుడు, ఫ్లాష్ ఆన్‌లో ఉందని సూచించే నోటిఫికేషన్ డైనమిక్ ఐలాండ్‌లో కనిపిస్తుంది.

కస్టమైజడ్ స్టాండ్‌బై మోడ్ (Customisable StandBy mode) :
ఐఫోన్ యూజర్లు త్వరలో iOS 17 లాంచ్‌లో ప్రకటించిన కొత్త స్టాండ్‌బై మోడ్ ఫీచర్‌లను పొందవచ్చు. 9to5Mac ప్రకారం.. ల్యాండ్‌స్కేప్ మోడ్‌లో ఫోన్‌ను ఛార్జ్ చేస్తున్నప్పుడు వినియోగదారులు తమ ఐఫోన్‌లను స్మార్ట్ డిస్‌ప్లేలుగా మార్చుకోవచ్చు. ఆండ్రాయిడ్‌లో స్క్రీన్ టైమ్‌అవుట్ సెట్టింగ్ మాదిరిగానే ఐఫోన్ యూజర్లు 3 ఆప్షన్ల మధ్య ఎంచుకోవచ్చు.

Apple to release iOS 17.1 update soon_ New features, fixes and everything

Apple to release iOS 17.1 update soon

ఆటోమాటిక్‌గా 20 సెకన్ల తర్వాత స్క్రీన్‌ను మసకబారిన, రాత్రిపూట రెడ్ కలర్ నైట్ మోడ్ ఫీచర్, మోషన్ టు వేక్ టోగుల్‌ను కూడా అందిస్తుంది. అయితే, ఈ ఫీచర్ iPhone 14 Pro, iPhone 14 Pro Max, iPhone 15 Pro, iPhone 15 Pro Max వంటి ఆన్ డిస్‌ప్లే ఐఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

పర్సనలైజడ్ ఫొటో షఫుల్ (Personalised Photo Shuffle) :
కొత్త iOS అప్‌డేట్ ఫొటో షఫుల్ లాక్ స్క్రీన్ ఫీచర్‌కు మరిన్ని పర్సనలైజడ్ ఆప్షన్లను అందిస్తుంది. ఆపిల్ ముందుగా ఎంచుకున్న కేటగిరీలకు పరిమితం కాకుండా వినియోగదారులు తమ లైబ్రరీలోని నిర్దిష్ట ఆల్బమ్ నుంచి ఫొటోలను ఎంచుకోవచ్చు.

80 శాతం ఛార్జింగ్ లిమిట్ ఫిక్స్ టోగుల్ :
ఆపిల్ లేటెస్ట్ ఐఫోన్‌లు 80శాతం లిమిట్ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. వినియోగదారులు తమ బ్యాటరీలను 80 శాతం దాటి ఛార్జ్ చేయకుండా ఉండేలా అనుమతిస్తుంది. అయినప్పటికీ, చాలా మంది వినియోగదారులు ఈ ఫీచర్ పని చేయడం లేదని, వారి ఐఫోన్‌లు ఇప్పటికీ పూర్తి ఛార్జింగ్‌లో ఉన్నాయని కనుగొన్నారు. ఆపిల్ ఇప్పుడు ఈ బగ్ సమస్యను పరిష్కరించింది. వినియోగదారులు తమ బ్యాటరీల లైఫ్ టైమ్ పొడిగించడానికి ఈ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు.

iOS 17.1 సపోర్టు ఉన్న డివైజ్‌ల లిస్టు :
iOS 17 అందుకున్న అన్ని ఐఫోన్ మోడల్‌లు iOS 17.1 అప్‌డేట్ అందుకుంటాయి. ఈ మోడల్‌లలో iPhone XR, iPhone XS, iPhone XS Max, iPhone 11, iPhone 11 Pro, iPhone 11 Pro Max, iPhone 12 mini, iPhone 12, iPhone 12 Pro, iPhone 12 Pro Max, iPhone 13 mini, iPhone 13, iPhone 13 ఉన్నాయి. iPhone 13 Pro, iPhone 13 Pro Max, iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro, iPhone 14 Pro Max, iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max, iPhone SE (2వ జనరేషన్), iPhone SE (3వ జనరేషన్).

iOS 17.1 అప్‌డేట్ ఎలా డౌన్‌లోడ్ చేయాలి :
iOS 17.1 అప్‌డేట్‌ని డౌన్‌లోడ్ చేసేందుకు మీ ఐఫోన్‌లో Settings యాప్‌ని ఓపెన్ చేసి General > Software Update వెళ్లండి. ఆటోమేటిక్ అప్‌డేట్‌ (Automatic Updates)లను Tap చేయండి. ఆపై iOS Updates అప్‌డేట్‌లను Download చేయండి. iOS అప్‌డేట్‌లను ఇన్‌స్టాల్ చేయండి. మీ ఐఫోన్ ఆటోమాటిక్‌గా అప్‌డేట్ డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేస్తుంది.

Read Also : Apple Scary Fast Event : ఈ నెల 30నే ఆపిల్ స్కేరీ ఫాస్ట్ ఈవెంట్.. మ్యాక్‌బుక్ ఎయిర్, మ్యాక్‌బుక్ ఎయిర్ ప్రో, ఐమ్యాక్ లాంచ్..!