Apple Vision Pro : వైద్య రంగంలో విజన్ ప్రో వినియోగం.. వెన్నెముక ఆపరేషన్‌లో వైద్యులకు సహకరించిన ఆపిల్ వీఆర్ హెడ్‌సెట్!
Apple Vision Pro : ఆపిల్ విజన్ ప్రో వర్చువల్ ప్రపంచాన్ని మాత్రమే కాదు.. వైద్యరంగంలో కూడా సేవలు కూడా అందిస్తోంది. ఇటీవల లండన్‌లో వెన్నెముక శస్త్రచికిత్స సమయంలో సర్జన్‌లకు సహకరించింది. మానవ తప్పిదాలు లేకుండా ఆపరేషన్ సక్సెస్‌కు సాయపడింది.

Apple Vision Pro helps surgeons in a spine operation in UK
Apple Vision Pro : ఆపిల్ విజన్ ప్రో అనేది.. అత్యంత అత్యాధునిక టెక్నాలజీతో రూపొందిన ఏఆర్ హెడ్‌సెట్.. ఈ హెడ్‌సెట్ ధరించిన వినియోగదారులను వర్చువల్ ప్రపంచానికి దగ్గర చేస్తుంది. ఇప్పటికే ఈ విజన్ ప్రో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వినియోగదారులను ఆకర్షిస్తోంది. విజన్ ప్రో పనితీరుపై కూడా ప్రశంసలను అందుకుంటోంది. ఈ ప్రత్యేకమైన విజన్ ప్రో డివైజ్ ధర 3,499 డాలర్లు కాగా.. ఈ మిక్స్డ్ రియాలిటీ హెడ్‌సెట్ కేవలం సాంప్రదాయ వీఆర్ అనుభవాన్ని మాత్రమే అందిస్తుంది. వాల్-ఇన్ సరౌండ్-సౌండ్ స్ట్రీమింగ్ వీడియోలు, లైఫ్-సైజడ్ వీడియో కాల్స్, ఇమ్మర్సీవ్ గేమింగ్ వంటివి యాక్సస్ అందిస్తుంది. తద్వారా ఆపిల్ విజన్ ప్రో సామర్థ్యాలను అత్యున్నత స్థాయికి చేర్చింది.
ఏది ఏమైనప్పటికీ, లండన్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో సంక్లిష్టమైన వెన్నెముక శస్త్రచికిత్స సమయంలో యూకేలోని సర్జన్లకు ఈ డివైజ్ సహాయం చేసింది. తద్వారా విజన్ ప్రో సామర్థ్యాలపై మరింత చర్చకు దారితీసింది. నివేదిక ప్రకారం.. లండన్‌లోని క్రోమ్‌వెల్ హాస్పిటల్‌లోని వైద్య నిపుణుల బృందం.. లైవ్ సర్జరీ సమయంలో ఆపిల్ విజన్ ప్రోని ఉపయోగించి ఏఐ, ఏఆర్ ఆపరేటింగ్ రూమ్‌లలోకి చేర్చడం ద్వారా గణనీయమైన పురోగతిని సాధించింది.
Read Also : Nurse Weight Loss Tricks : బరువు తగ్గడం ఇంత ఈజీనా.. ఈ సింపుల్ డైట్ ట్రిక్స్‌తో 45కిలోలు తగ్గిన నర్సు..!
డైలీ మెయిల్ ప్రకారం.. సర్జన్లు నేరుగా విజన్ ప్రోని ఉపయోగించనప్పటికీ.. ఆపరేటింగ్ టీమ్‌లోని ఒక స్క్రబ్ నర్సు ఆపరేషన్ అంతటా హెడ్‌సెట్ ధరించింది. విజన్ ప్రోని ఉపయోగించి.. నర్సు రియల్-టైమ్ డేటా స్ట్రీమింగ్‌ను యాక్సెస్ చేయడం, సర్జికల్ ప్రిపరేషన్‌ను సులభతరం చేయడం, పురోగతిని ట్రాక్ చేయడం, ఆపరేషన్ కోసం అవసరమైన టూల్స్ ఎంచుకోవడం ద్వారా సర్జన్‌లకు సహాయం చేసింది. అంతేకాదు.. అన్నీ వర్చువల్ స్క్రీన్‌లపై ముఖ్యమైన సమాచారంతో పాటు రియల్ వరల్డ్ గురించి స్పష్టమైన వ్యూను అందిస్తుంది.
మానవ తప్పిదాలను నివారించగలదు :
లండన్ ఇండిపెండెంట్ హాస్పిటల్‌లోని లీడ్ స్క్రబ్ నర్సు సువీ వెర్హో ఈ టెక్నాలజీని గేమ్-ఛేంజర్‌గా ప్రశంసించారు. యాపిల్ విజన్ ప్రో మానవ తప్పిదాలను తొలగించడంలో సాయపడుతుందని అన్నారు. శస్త్రచికిత్సా విధానాలపై విశ్వాసాన్ని నింపడంలో సాయపడుతుందని ఆమె డైలీ మెయిల్‌తో అన్నారు. వెర్హో ప్రకారం.. ఆమె (eXeX) అభివృద్ధి చేసిన యాప్‌తో విజన్ ప్రోని ఉపయోగించింది. ఈ యాప్ అతి ముఖ్యమైన వర్చువల్ స్క్రీన్‌లను ప్రొజెక్ట్ చేస్తుంది. తద్వారా కీలక సమాచారాన్ని డిస్‌ప్లే చేస్తుంది. మిక్స్డ్ రియాలిటీ హెడ్‌సెట్ ఆమెకు ప్రిపరేషన్, సర్జరీ ట్రాకింగ్, సర్జన్ కోసం టూల్ ఎంపికలో సాయపడింది. ఈ ప్రక్రియ ఫొటోలో కూడా క్యాప్చర్ చేసినట్టు వెర్హో పేర్కొన్నారు.

Apple Vision Pro surgeons spine operation
ఆపరేషన్‌లో విజన్ ప్రో వినియోగం మొదటిసారి కాదు :
ఈ ప్రక్రియకు నాయకత్వం వహించిన సర్జన్ సయ్యద్ అఫ్తాబ్ కూడా హెడ్‌సెట్ పనితీరును ప్రశంసించారు. ఇంతకుముందు స్క్రబ్ నర్సుతో పనిచేయలేదని వెల్లడించారు. అయితే, ఆపరేషన్ సమయంలో, వీఆర్ హెడ్‌సెట్ ఒక తెలియని స్క్రబ్ నర్సును తనతో పాటు పదేళ్ల అనుభవం ఉన్న వ్యక్తిగా మార్చిందని చెప్పుకొచ్చాడు. అయితే, వైద్యులు విజన్ ప్రో హెడ్‌సెట్ ఆపరేషన్‌లో ఉపయోగించడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు, డాక్టర్ రాబర్ట్ మాసన్, అమెరికన్ సర్జన్, వెన్నెముక ప్రక్రియలో (eXeX) యాప్‌తో విజన్ ప్రోని ఉపయోగించారు. డాక్టర్ మాసన్ స్వయంగా హెడ్‌సెట్ ధరించనప్పటికీ.. అతని సహాయకులు ధరించారు.
డాక్టర్ మాసన్ విజన్‌ప్రో, (eXeX) యాప్‌ల పనితీరును ప్రశంసించారు. సర్జరీ బృందం కోసం ‘అన్‌స్ట్రాక్ట్డ్ వర్క్‌ఫ్లో’ని ఎనేబుల్ చేసింది. నిర్దిష్ట సాఫ్ట్‌వేర్ తెలియనప్పటికీ.. డాక్టర్ మాసన్ బృందం, నర్స్ వెర్హో ఇద్దరూ ఎక్స్‌పీరియన్స్‌ఎక్స్‌ను ఉపయోగించారు. సాంకేతిక నిపుణులకు టచ్-ఫ్రీ హెడ్స్-అప్ డిస్‌ప్లేను అందిస్తుంది. వైద్య రంగంలో విజన్ ప్రో వినియోగం పెరుగుతోందని ఆపిల్ కూడా హైలైట్ చేస్తోంది.
విజన్ ప్రో వినియోగిస్తున్న వైద్య సంస్థలు :
ఇటీవల ఆపిల్ బ్లాగ్ పోస్ట్‌లో అనేక వైద్య సంస్థలు తమ పని కోసం విజన్ ప్రోని ఉపయోగిస్తున్నాయని వెల్లడించింది. ఉదాహరణకు.. స్ట్రైకర్, ఒక మెడికల్ కార్పొరేషన్ తమ (myMako) యాప్‌తో (VisionOS)ని ప్రభావితం చేస్తారని పేర్కొన్నారు. ఇది కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలను ప్లాన్ చేయడంలో వైద్యులకు సాయపడుతుంది. అదనంగా, సిమెన్స్ హెల్త్‌నీర్స్ ద్వారా సినిమాటిక్ రియాలిటీ, మానవ శరీరం ఇంటరాక్టివ్ హోలోగ్రామ్‌లతో వైద్య విద్యార్థులకు అందించడానికి విజన్ ఓఎస్‌ను ఉపయోగిస్తుంది.