Apple Watch Price Drop : భారత్‌లో భారీగా తగ్గిన ఆపిల్ వాచ్ ధరలు.. ఈ బెస్ట్ డీల్స్ మీకోసం..!
Apple Watch Price Drop : ఆపిల్ వాచ్ సిరీస్ 10, ఆపిల్ వాచ్ సిరీస్ 9, ఆపిల్ వాచ్ సిరీస్ 8, ఆపిల్ వాచ్ ఎస్ఈ 2 భారీ ధర తగ్గింపును పొందాయి.

Apple Watch Prices Drop
Apple Watch Price Drop : ఆపిల్ ఐఫోన్ 15, ఐఫోన్ 16 సిరీస్‌లు ఆన్‌లైన్‌లో భారీ తగ్గింపులతో అమ్ముడవుతున్నాయి. మీరు అమ్మకానికి ఉన్న ఏదైనా ఐఫోన్‌లను కొనుగోలు చేసి ఇప్పుడు మంచి ఆపిల్ వాచ్ డీల్ కోసం చూస్తుంటే ఇదే సరైన సమయం. ప్రస్తుతం వివిధ జనరేషన్లకు చెందిన స్మార్ట్‌వాచ్‌లు అతి తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి.
Read Also : OnePlus Nord 4 : వన్‌ప్లస్ నార్డ్ 4 ఫోన్ ధర తగ్గిందోచ్.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!
క్రోమా, అమెజాన్ మరిన్ని ప్లాట్‌ఫారమ్‌లలో జరుగుతున్న రిపబ్లిక్ డే సేల్స్ దీనికి కారణం కావచ్చు. ఆపిల్ వాచ్ సిరీస్ 10, ఆపిల్ వాచ్ సిరీస్ 9, ఆపిల్ వాచ్ సిరీస్ 8, ఆపిల్ వాచ్ ఎస్ఈ 2 ఈ వెబ్‌సైట్లలో భారీ ధర తగ్గింపును పొందాయి. బెస్ట్ డీల్స్ ఎలా పనిచేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
భారత మార్కెట్లో ఆపిల్ వాచ్ ధరలు తగ్గాయి. బెస్ట్ డీల్‌లు అందుబాటులో ఉన్నాయి. లేటెస్ట్ మోడళ్లపై తగ్గింపు ఆఫర్లు, పాత వాటిపై ఎక్కువ పొందవచ్చు. 42ఎమ్ఎమ్ డయల్‌తో కూడిన ఆపిల్ వాచ్ సిరీస్ 10 (GPS) క్రోమాలో రూ. 44,990 తగ్గింపు ధరకు విక్రయిస్తోంది. ఈ ప్రొడక్టు అసలు ధర రూ. 46,900 అంటే.. వినియోగదారులు రూ. 1,910 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు.
అదనంగా, ఐజీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై అదనంగా రూ. 2,500 తగ్గింపు కూడా పొందవచ్చు. దీంతో ఈ ఆపిల్ వాచ్ ధర రూ.42,490కి తగ్గనుంది. మొత్తం తగ్గింపు ఆఫర్ రూ. 4,410కు పొందవచ్చు. అదే డీల్ అనేక కలర్ మోడల్స్‌లో కూడా కనిపిస్తుంది.
ఆపిల్ వాచ్ సిరీస్ 9 (GPS)కి కొనుగోలుపై 45ఎమ్ఎమ్ మోడల్ క్రోమాలో ధర రూ. 33,990 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఆపిల్ వాచ్ వేరియంట్ భారత మార్కెట్లో రూ. 44,900కు లాంచ్ అయింది. వినియోగదారులు ఈ వెర్షన్‌పై రూ. 10,910 భారీ తగ్గింపును పొందవచ్చు. ఈ ఆపిల్ వాచ్ క్రోమాలో బ్యాంక్ ఆఫర్ ఏదీ అందుబాటులో లేదు.
ఆపిల్ వాచ్ సిరీస్ 8 (GPS)ని కొనుగోలు చేయాలనుకునే కొనుగోలుదారులు రూ. 30,490 తక్కువ ధరకే పొందవచ్చు. 45mm మిడ్‌నైట్ అల్యూమినియం మోడల్ ఆపిల్ వాచ్ సిరీస్ 9 మోడల్‌ని కొనుగోలు చేయడం ఉత్తమం. ఎందుకంటే.. ఆపిల్ వాచ్ 8తో పోల్చితే కేవలం రూ. 3,500 ఎక్కువ ఖర్చు చేయడం ద్వారా పొందవచ్చు. ఆపిల్ వాచ్ 8 మోడల్ విజయ్ విక్రయాలపై ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై రూ. 2,500 వరకు తగ్గింపు ఆఫర్ కూడా పొందవచ్చు.
తక్కువ బడ్జెట్ కలిగిన కొనుగోలుదారులు ఆపిల్ వాచ్ SE 2 (GPS, 40mm) కొనుగోలు చేయొచ్చు. ఎందుకంటే.. అమెజాన్‌లో రూ. 19,999 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. ఈ ఆపిల్ వాచ్ ప్రారంభ ధర రూ. 29,900 నుంచి తగ్గింది. అంటే.. వినియోగదారులు ఈ సెకండ్ జనరేషన్ ఆపిల్ వాచ్ ఎస్ఈ మోడల్‌పై రూ. 9,901 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు.
Read Also : TikTok Ban : టిక్‌టాక్ ఈజ్ బ్యాక్.. కేవలం 24 గంటల్లోనే నిషేధం ఎత్తివేత.. ఎందుకంటే?