OnePlus Nord 4 : వన్‌ప్లస్ నార్డ్ 4 ఫోన్ ధర తగ్గిందోచ్.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!
OnePlus Nord 4 Discount : అమెజాన్‌లో వన్‌ప్లస్ నార్డ్ 4 ఫోన్ 8జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 28,999కి జాబితా అయింది.

OnePlus Nord 4 discount offer
OnePlus Nord 4 Discount : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? అమెజాన్‌లో వన్‌ప్లస్ నార్డ్ 4పై భారీ తగ్గింపు అందిస్తోంది. ఈ ఫోన్ 8జీబీ ర్యామ్ + 256జీబీ ర్యామ్ వేరియంట్ ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 28,999కి జాబితా అయింది. అయితే, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌తో మరింత తగ్గింపును పొందవచ్చు. ఈ ఫోన్ ధర రూ. 25వేల కన్నా తక్కువగా ఉంటుంది.
వన్‌ప్లస్ నార్డ్ 4 మొదటగా గత ఏడాది జూలైలో లాంచ్ కాగా, ధరలు బేస్ మోడల్ 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ ఆప్షన్ ధర రూ.29,999 నుంచి ప్రారంభమవుతాయి. మెటల్-యూనిబాడీ డిజైన్, స్నాప్‌డ్రాగన్ 7+ జనరేషన్ 3 చిప్‌సెట్, ఫ్లాట్ 120Hz అమోల్డ్ డిస్‌ప్లే, 5,500mAh బ్యాటరీ, 6 ఏళ్ల వరకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లకు సపోర్ట్ చేయడం వంటి ముఖ్య ఫీచర్లు ఉన్నాయి.
వన్‌ప్లస్ నార్డ్ 4 ఫోన్ అమెజాన్‌లో కేవలం రూ. 24,999కే అందుబాటులో ఉంది. వన్‌ప్లస్ నార్డ్ 4 ఫోన్ మధ్య 8జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 28,999కి జాబితా అయింది. ఈ ఫోన్ అసలు ధర రూ. 32,999 నుంచి తగ్గింది. 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీ ఉన్న టాప్-ఎండ్ వేరియంట్ అసలు ధర రూ. 35,999 నుంచి రూ. 31,999 వద్ద జాబితా అయింది. అంటే.. ఈ ఫోన్ రెండు వేరియంట్లకు రూ. 4వేల ఫ్లాట్ తగ్గింపు ఆఫర్‌తో అందుబాటులో ఉంది. నిబంధనలు లేదా షరతులు వర్తించవు.
అయితే, మీరు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ (అమెజాన్ పే క్రెడిట్ కార్డ్ మినహా) కలిగి ఉంటే.. మీరు చెక్అవుట్‌లో ఫ్లాట్ రూ. 4వేల ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. వన్‌ప్లస్ నార్డ్ 4 ఫోన్ 8జీబీ ర్యామ్ వేరియంట్ ధరను రూ.24,999కి తగ్గించింది. 12జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.27,999కి తగ్గింది. మీకు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేకపోయినా, ఇంకా డీల్‌ను పొందాలనుకుంటే మీరు ఆర్బీఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని కలిగి ఉండాలి. ఆర్బీఎల్ బ్యాంక్ కార్డ్ యూజర్‌లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుంచి ఫోన్‌ను కొనుగోలు చేస్తే.. అదే విధంగా రూ.4వేల ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంటుంది.

OnePlus Nord 4 discount offer
వన్‌ప్లస్ నార్డ్ 4 కొనడం విలువైనదేనా? :
వన్‌ప్లస్ నార్డ్ 4 ఫోన్ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో అద్భుతమైన పర్ఫార్మెన్స్, ప్రత్యేకమైన డిజైన్‌తో ప్రత్యేకంగా నిలుస్తుంది. స్నాప్‌డ్రాగన్ 7+ జనరేషన్ 3 ప్రాసెసర్‌తో ఆధారితంగా పనిచేస్తుంది. పవర్‌ఫుల్ 6.74-అంగుళాల ఫ్లాట్ అమోల్డ్ డిస్‌ప్లే అద్భుతమైన వ్యూ ఆప్షన్లను అందిస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ స్క్రోలింగ్, యానిమేషన్‌లను సున్నితంగా చేస్తుంది. ఇంకా, వన్‌ప్లస్ నార్డ్ 4 ఫోన్ ఆకట్టుకునే బ్యాటరీ లైఫ్ కలిగి ఉంది. హుడ్ కింద 5,500mAh బ్యాటరీ కలిగి ఉంది. అదనంగా, 100W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఫోన్ జీరో నుంచి 100శాతం పూర్తి అయ్యేందుకు కేవలం 30 నిమిషాలు మాత్రమే పడుతుంది.
కోర్ స్పెషిఫికేషన్ల విషయానికి వస్తే.. వన్‌ప్లస్ నార్డ్ 4 ప్రీమియం ఆప్షన్లతో వస్తుంది. మెటల్-యూనిబాడీ డిజైన్ మార్కెట్‌లోని ఇతర ఫోన్‌ల మాదిరిగా కాకుండా ధరలో ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. మెటల్ యూనిబాడీ డిజైన్‌ను కలిగిన ఏకైక ఫోన్ నార్డ్ 4 ఫోన్ అని చెప్పవచ్చు. వన్‌ప్లస్ ఆక్సిజన్‌ఓఎస్ సాఫ్ట్‌వేర్‌ను కూడా అప్‌గ్రేడ్ అయింది. కనీస బ్లోట్‌వేర్‌తో శుభ్రమైన యూజర్ ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. 6 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లతో పాటు 4 ఏళ్ల ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్‌లకు కూడా సపోర్టు అందిస్తుంది.
డివైజ్ పర్ఫార్మెన్స్, డిజైన్, సాఫ్ట్‌వేర్ కలిగిన వన్‌ప్లస్ నార్డ్ 4 ఆకర్షణీయమైన ప్యాకేజీని అందిస్తుంది. మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో బలమైన పోటీదారుగా నిలుస్తోంది. టాప్-టైర్ పర్ఫార్మెన్స్ ఫోన్ కొనుగోలు చేసే ఎవరికైనా వన్‌ప్లస్ నార్డ్ 4 ఫోన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
Read Also : Best Phones 2025 : ఈ నెలలో రూ. 15వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!