Apple Watch Series 9 : ఆపిల్ వాచ్ సిరీస్ 9పై రూ. 6వేలు తగ్గింపు.. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Apple Watch Series 9 : కొత్త ఆపిల్ వాచ్ సిరీస్ 9పై భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ అద్భుతమైన డీల్ విజయ్ సేల్స్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. పూర్తివివరాల గురించి ఇప్పుడు తెలుసుకోండి.

Apple Watch Series 9 available at a discount of Rs 6,000
Apple Watch Series 9 : 2024 వచ్చేసింది. ఈ కొత్త ఏడాదిలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లపై అనేక ఆకర్షణీయమైన డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ నుంచి విజయ్ సేల్స్ వరకు ఈకామర్స్ స్టోర్‌లు వివిధ ఎలక్ట్రానిక్ వస్తువులపై కొన్ని గొప్ప డీల్‌లను అందిస్తున్నాయి. ఈ గాడ్జెట్‌లలో ఒకటి ఆపిల్ వాచ్ సిరీస్ 9. మీరు విజయ్ సేల్స్ ద్వారా ఆర్డర్ చేస్తే.. రూ. 6వేల తగ్గింపుతో వాచ్ సొంతం చేసుకోవచ్చు.
ఈ ఆఫర్‌ను పొందాలంటే మీరు తప్పనిసరిగా హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్ హోల్డర్ అయి ఉండాలి. ఆపిల్ వాచ్ సిరీస్ 9 గత ఏడాదిలో కొన్ని చట్టపరమైన విభేదాల కారణంగా అమెరికాలో వాచ్‌ను విక్రయం నిలిపివేయమని టెక్ దిగ్గజం కోరింది. కొన్ని రోజుల క్రితంమే ఈ నిషేధాన్ని ఎత్తివేయగా.. ఆపిల్ వాచీలను మళ్లీ విక్రయించాలని నిర్ణయించింది.
ఆపిల్ వాచ్ 9పై విజయ్ సేల్స్ ఆఫర్ :
ప్రస్తుతం విజయ్ సేల్స్‌లో ఆపిల్ వాచ్ సిరీస్ 9 ధర రూ. 50,850కు అందుబాటులో ఉంది. వినియోగదారులు విజయ్ సేల్స్ వెబ్‌సైట్ ద్వారా వాచ్‌ని కొనుగోలు చేయాలనుకుంటే.. రూ. 4050 వరకు నేరుగా తగ్గింపును పొందవచ్చు. దాంతో పాటు, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డ్ హోల్డర్‌లు వాచ్‌పై అదనంగా రూ.2,500 తగ్గింపును పొందవచ్చు.
Read Also : Apple iPhone 15 Discount : అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 15పై కళ్లుచెదిరే డిస్కౌంట్.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!
మీరు ఈ రెండు ఆఫర్‌లను పొందినప్పుడు రూ. 6,500 తగ్గింపును పొందవచ్చు. అలాగే, (HSBC) క్రెడిట్ కార్డ్ హోల్డర్స్, ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్, యస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ కోసం మరెన్నో ఆఫర్‌లు ఉన్నాయి. అన్ని ఆఫర్‌లను విజయ్ సేల్స్ వెబ్‌సైట్ ద్వారా చెక్ చేయొచ్చు.
ఆపిల్ ఐఫోన్ 15, ఇతర డీల్స్ :
ఐఫోన్ 15, కొన్ని ఐప్యాడ్ మోడల్‌లు, మ్యాక్‌బుక్ ప్రో, ఎయిర్‌ప్యాడ్స్ ప్రో 2వ జనరేషన్‌పై కూడా డీల్‌లు ఉన్నాయి. ఐఫోన్ 15 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.70,990కి అందుబాటులో ఉంది. దీనితో పాటు, ఈ ఐఫోన్ మొత్తం ధరను మరింత తగ్గించే అనేక ఆఫర్లు ఉన్నాయి. ఉదాహరణకు.. మీరు హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్‌ని కలిగి ఉంటే.. మీరు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ రూ. 4వేలు పొందవచ్చు. మొత్తం తగ్గింపు దాదాపు రూ. 12వేలు ఉంటుంది. ఇతర బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Apple Watch Series 9
మరోవైపు, 1టీబీ స్టోరేజ్‌తో కూడిన ఐఫోన్ 15 ప్రో ధర రూ. 1,62,990 లేదా బ్యాంక్ ఆఫర్‌తో రూ. 1,59,990కి లభిస్తుంది. ఐఫోన్ 15 ప్రో ఇతర వెర్షన్లు కూడా డిస్కౌంట్లను కలిగి ఉన్నాయి. ఐప్యాడ్ 9వ జనరేషన్ ప్రారంభ ధర రూ. 27,900కు పొందవచ్చు. ఐప్యాడ్ 10వ జనరేషన్ ప్రారంభ ధర రూ. 33,430, ఐప్యాడ్ ఎయిర్ 5వ జనరేషన్ ప్రారంభ ధర రూ. 50,680, ఐప్యాడ్ ప్రో ప్రారంభ ధర రూ. 79,900, ఇందులో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్లు రూ. 4వేల వరకు తగ్గింపు పొందవచ్చు.
ల్యాప్‌టాప్‌ల విషయానికి వస్తే..
ఎం3 చిప్‌తో కూడిన మ్యాక్‌బుక్ ప్రో ప్రారంభ ధర రూ. 1,47,910, ఎం3 ప్రో చిప్‌తో ధర రూ. 1,74,910 నుంచి ఎం3 మ్యాక్స్ చిప్ మోడల్ రూ. 2,82,910, ఎం2 చిప్‌తో కూడిన మ్యాక్‌బుక్ ప్రో రూ. 1,10,270 వద్ద అందుబాటులో ఉంది, అన్నీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్‌లతో ఫ్లాట్ రూ. 5వేల తగ్గింపుతో సహా పొందవచ్చు. మీరు ఇయర్‌బడ్‌ల కోసం చూస్తుంటే.. ఎయిర్‌పాడ్స్ ప్రో (2వ జనరేషన్) హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్‌లపై రూ. 2వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్ సహా రూ. 18,990కు కొనుగోలు చేయొచ్చు.
Read Also : Apple iPhone 15 Discount : ఆపిల్ ఐఫోన్ 15పై న్యూ ఇయర్ డిస్కౌంట్ ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో తగ్గింపు ధర ఎంతంటే?