Asus ROG Phone 9 Leak : కొత్త ఫోన్ కొంటున్నారా? ఆసస్ ROG ఫోన్ 9 స్పెసిఫికేషన్‌లు లీక్.. ట్రిపుల్ కెమెరాలు, మరెన్నో ఫీచర్లు..!

Asus ROG Phone 9 Leak : ఈ ఆర్ఓజీ ఫోన్ 9 సిరీస్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్‌తో నవంబర్ 19న లాంచ్ కానుందని ఆసస్ ఇటీవల ప్రకటించింది.

Asus ROG Phone 9 Specifications Leaked

Asus ROG Phone 9 Leak : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? ఆసస్ బ్రాండ్ నుంచి సరికొత్త ఆర్ఓజీ ఫోన్ 9 వచ్చేస్తోంది. ఈ ఆర్ఓజీ ఫోన్ 9 సిరీస్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్‌తో నవంబర్ 19న లాంచ్ కానుందని ఆసస్ ఇటీవల ప్రకటించింది. ఈ వారంలో స్నాప్‌డ్రాగన్ సమ్మిట్ సందర్భంగా తైవానీస్ సంస్థ ఆర్ఓజీ ఫోన్ 9 ప్రదర్శించింది. కొత్త నివేదిక ప్రకారం.. ఇప్పుడు ఈ ROG ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది. గత మోడల్ మాదిరిగానే ఆర్ఓజీ ఫోన్ 9 మోడల్ 50ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్, 32ఎంపీ సెల్ఫీ షూటర్‌తో వస్తుంది.

అలాగే, 5,800mAh బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. ఆసస్ ఆర్ఓజీ ఫోన్ 9 వచ్చే నెల నవంబర్ 19న లాంచ్ చేయనుంది. రాబోయే ఈ ఆసస్ డివైజ్ బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్లు, స్పెసిఫికేషన్‌లు లీక్ అయ్యాయి. వీటిని ఫాంటమ్ బ్లాక్, స్ట్రోమ్ వైట్ అని పిలుస్తారు. ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లేపై సెంటల్డ్ హోల్-పంచ్ కటౌట్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. బ్యాక్ సైడ్ కెమెరా ఐలాండ్ కింద రిపబ్లిక్ ఆఫ్ గేమర్స్ టెక్స్ట్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో కనిపిస్తుంది.

ఆసస్ ఆర్ఓజీ ఫోన్ 9 స్పెసిఫికేషన్లు :
గత మోడల్ మాదిరిగానే ఆసస్ ఆర్ఓజీ ఫోన్ 9 6.78-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ (1,080×2,400 పిక్సెల్‌లు) శాంసంగ్ ఫ్లెక్సిబుల్ ఎల్‌టీపీఓ అమోల్డ్ స్క్రీన్‌తో గరిష్టంగా 120Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఎల్లప్పుడూ ఆన్‌లో ఉంటుంది. డిస్‌ప్లే ప్యానెల్ 2,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, హెచ్‌డీఆర్10 సపోర్ట్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ రీడర్‌ను అందించగలదు. 16జీబీ ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జీబీ యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ హుడ్ కింద ఉంటుంది.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఆసస్ ఆర్ఓజీ ఫోన్ 9 ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను అందిస్తుంది. ఇందులో 50ఎంపీ సోనీ లైటియా 700 ప్రైమరీ కెమెరా 1/1.56-అంగుళాల సెన్సార్ సైజు, 13ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా, 5ఎంపీ చిన్న కెమెరా ఉన్నాయి. ఆసస్ ఆర్ఓజీ ఫోన్ 8 కూడా ఇదే విధమైన కెమెరా సెటప్‌ను అందిస్తుంది. ఆసస్ ఆర్ఓజీ ఫోన్ 9 ఆండ్రాయిడ్ 15-ఆధారిత ఆర్ఓజీ యూఐ గేమ్ జెనీతో వస్తుంది. ఇందులో ఎయిర్‌‌ట్రిగ్గర్స్, మ్యాక్రో, బైపాస్ ఛార్జింగ్, స్కౌట్ మోడ్‌తో సహా అనేక ఫీచర్లు ఉన్నాయి.

ఇందులో ఏఐ కాల్ ట్రాన్స్‌లేటర్, ఏఐ ట్రాన్‌స్క్రిప్ట్, ఏఐ వాల్‌పేపర్ మరిన్నింటితో పాటు ఎక్స్ సెన్స్ ఎక్స్ క్యాప్చర్ ఏఐ గ్రాబెర్ వంటి అనేక ఏఐ గేమింగ్ ఫీచర్‌లను ఆఫర్ చేస్తుంది. 65డబ్ల్యూ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,800mAh బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉంది.

ఆసస్ ఆర్ఓజీ ఫోన్ 9లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, 3.5ఎమ్ఎమ్ జాక్, ఆసస్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీతో 3 మైక్రోఫోన్‌లతో రానుందని భావిస్తున్నారు. కనెక్టివిటీ విషయానికి వస్తే.. బ్లూటూత్ 5.3, వై-ఫై 7, ఎన్ఎఫ్‌సీ, ఎన్ఏవిఐసీ, జీపీఎస్ కలిగి ఉండే అవకాశం ఉంది. 163.8×76.8×8.9mm పరిమాణం, 227 గ్రాముల బరువు ఉంటుంది.

Read Also : Reliance Jio Diwali Offer : రిలయన్స్ జియో దీపావళి ఆఫర్.. ప్రీపెయిడ్ యూజర్ల కోసం 2 సరికొత్త రీఛార్జ్ ప్లాన్లు.. బెనిఫిట్స్ ఇవే!