Battlegrounds Mobile India : బాటిల్ గ్రౌండ్స్ గేమ్ ఆడి కోటి గెలవండి.. టెస్లా కారు మీ సొంతం!

పబ్జి.. ఈ వీడియో గేమ్ పేరు వింటే చాలు.. కుర్రకారులో ఎక్కడలేని హుషారు వచ్చేస్తుంది. పబ్జీకి ఉన్న క్రేజ్ అంతాఇంతాకాదు.. భారత్ లోకి బాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా పేరుతో ఎంట్రీ ఇచ్చింది.

Battlegrounds Mobile India : బాటిల్ గ్రౌండ్స్ గేమ్ ఆడి కోటి గెలవండి.. టెస్లా కారు మీ సొంతం!

Battlegrounds Mobile India Series 2021 Announced

Updated On : July 17, 2021 / 10:25 AM IST

Battlegrounds Mobile India : పబ్జి.. (PUBG) ఈ వీడియో గేమ్ పేరు వింటే చాలు.. కుర్రకారులో ఎక్కడలేని హుషారు వచ్చేస్తుంది. పబ్జీకి ఉన్న క్రేజ్ అంతాఇంతాకాదు.. దేశంలో బ్యాన్ అనంతరం భారత్ లోకి బాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా పేరుతో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు బాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా సిరీస్ 2021 పేరుతో గేమ్ సిరీస్ ప్రకటించింది. క్రాఫ్టన్ ఇండియా ఈ ఆఫర్ ప్రకటించింది.

ఇందులో గెలిచిన ప్లేయర్లకు కోటి రూపాయల ప్రైజ్ మనీ సొంతం చేసుకోవచ్చు. అలాగే టెస్లా కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్ కూడా అందుకోవచ్చు. మూడు నెలల పాటు ఈ టోర్నమెంట్ జరుగనుంది. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్లు జూలై 19 నుంచి ప్రారంభం కానున్నాయని క్రాఫ్టన్ ఇండియా (krafton india) వెల్లడించింది. రిజిస్ట్రేషన్ చేసుకున్న గేమర్లు ఐదు రౌండ్లు పూర్తిగా ఆడాల్సి ఉంటుంది.

అందులో గేమ్‌ క్వాలిఫైర్‌ , ఆన్‌ లైన్‌ క్వాలిఫైర్‌, క్వార్టర్‌ ఫైనల్‌, సెమీ ఫైనల్‌, గ్రాండ్‌ ఫైనల్స్‌ ఉంటాయి. తొలి రౌండ్‌ గేమ్‌ క్వాలిఫైర్ గేమ్‌ ఆగస్ట్‌ 2 నుంచి ఆగస్ట్‌ 8వరకు వరకు జరుగనుంది. ఆన్‌‌లైన్‌ క్వాలిఫైర్‌ ఆగస్ట్‌ 17 నుంచి సెప్టెంబర్‌ 12 వరకు వరకు జరుగనుంది. క్వార్టర్‌ ఫైనల్‌ సెప్టెంబర్‌ 16నుంచి సెప్టెంబర్‌ 26 వరకు జరుగనుంది. గ్రాండ్‌ ఫైనల్స్‌ అక్టోబర్‌ 7నుంచి అక్టోబర్‌ 10 వరకు జరగనుంది.

మొత్తం తొమ్మిది రౌండ్లలో జరిగే గేమ్‌కు ఒక్కో రౌండ్‌‌కు ఫ్రైజ్‌ను ప్రకటించింది. రూ.50 లక్షలు నాటికి మొదటి ఫ్రైజ్ మనీ, రూ. 20 లక్షలు రెండో ఫ్రైజ్ మనీ, రూ.10 లక్షల మూడో ఫ్రైజ్ మనీ, రూ.3 లక్షలు నాల్గో ఫ్రైజ్ మనీ, రూ.2 లక్షలు ఐదో ఫ్రైజ్ మనీ, రూ.1 లక్షా యాబైవేలు ఆరో ఫ్రైజ్ మనీగా ఆఫర్ చేస్తోంది. రూ. 90వేలుగా 8-ప్రైజ్‌ మనీ, రూ.80వేల మనీని 9వ ప్రైజ్‌ మనీగా సొంతం చేసుకోవచ్చని బాటిల్ గ్రౌండ్స్‌ (Battlegrounds) మొబైల్‌ ఇండియా ప్రకటించింది.