Best ACs Under 30K : బాబోయ్ వేసవి వస్తోంది.. కొత్త ఏసీ కోసం చూస్తున్నారా? రూ. 30వేల లోపు ధరలో బెస్ట్ ఏసీలు మీకోసం..!
Best ACs Under 30K : కొత్త ఏసీ కోసం చూస్తున్నారా? రూ. 30వేల లోపు ధరలో ఆకర్షణీయమైన ఎయిర్ కండీషనర్లు అందుబాటులో ఉన్నాయి.. ఏయే బ్రాండ్ల ఏసీలు ధరలు ఎంత ఉన్నాయి? ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Best ACs Under 30K
Best ACs Under 30K : వేసవికాలం వస్తోంది. ఎండలు మండిపోతుంటాయి. ప్రతిఒక్కరూ ఏసీలు, కూలర్ల కోసం ఆరాటపడుతుంటారు. అయితే, మార్కెట్లో దొరికే ఏసీలపై పెద్దగా అవగాహన ఉండదు. ఇంకా మార్చి రానే రాలేదు. కొద్దికొద్దిగా ఎండల తీవ్రత కనిపిస్తోంది.
వాతావరణంలోనూ మార్పులు కనిపిస్తున్నాయి. వేసవి తాపాన్ని నివారించేందుకు కూలర్లు, ఏసీలను కొనేందుకు ప్లాన్ చేస్తుంటారు. మీరు కూడా ఏసీ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీకోసం రూ. 30వేల లోపు ధరలో మార్కెట్లో బెస్ట్ ఏసీలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏసీ ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేయండి.
Hisense 1.5 Ton : హైసెన్స్ 1.5 టన్ ఏసీపై అమెజాన్ భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ హైసెన్స్ ఏసీ ఒరిజినల్ ధర రూ. 48,999గా ఉంది. కానీ, దీనిపై ఈ-కామర్స్ దిగ్గజం 39శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. తద్వారా ఈ 1.5 టన్ ఏసీ ధర ఏకంగా రూ. 29,900కి తగ్గింది.
ఈ ఏసీలో మరో ప్రత్యేకం ఏంటంటే.. 4 మోడ్స్ ఇంటెలిజెంట్ 4 ఇన్ వన్ కన్వర్టబుల్ అమర్చారు. అంతేకాదు.. 4.85 కిలో వాట్స్ కూలింగ్ పవర్ ఆప్షన్ కూడా కలిగి ఉంది. ఇందులో సెల్ఫ్ క్లీన్, స్లీప్ మోడ్, క్విక్ చిల్ ఫీచర్లు ఉన్నాయి.
గోడ్రెజ్ 1 టన్ ఏసీ : ఈ గోడ్రెజ్ ఏసీ ఒరిజినల్ ధర రూ. 42,990 ఉంటుంది. కానీ, అమెజాన్‌లో మాత్రం 33శాతం డిస్కౌంట్ అందిస్తోంది. దాంతో ఈ ఏసీ ధర రూ. 28, 900కే కొనేసుకోవచ్చు. అంతేకాదు.. ఇందులో విశేషం ఏమిటంటే.. 5ఇన్ వన్ కన్వర్టబుల్ కూలింగ్ టెక్నాలజీ కలిగి ఉంది.
పానాసోనిక్ 1 టన్ 3 స్టార్ : ఈ ఏసీ కూడా చాలా ప్రత్యేకమైనది. పానసోనిక్ 1 టన్ 3 స్టార్ ఏసీ ఒరిజినల్ ధర రూ. 48,100కు అందుబాటులో ఉంది. అమెజాన్ అయితే 33శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. తద్వారా ఈ పానసోనిక్ ధర రూ. 31,990కి పొందవచ్చు.
అదే మీరు బ్యాంకు కార్డులతో ఈ ఏసీని కొనుగోలు చేస్తే మాత్రం అదనంగా డిస్కౌంట్ పొందవచ్చు. ఇక ఏసీలో ఫీచర్ల గురించి చెప్పాలంటే.. ఏసీ వైఫై ఇన్వర్టర్ స్మార్ట్ స్లిట్ టెక్నాలజీతో వస్తుంది. సెవెన్ ఇన్ వన్ కన్వర్టబుల్ ట్రూ ఏఐ టెక్నాలజీని కూడా అందించారు. మీరు అలెక్సా లేదా ఓకే గూగుల్ వంటి వాయిస్ కమాండ్స్ ద్వారా కూడా ఈ ఏసీని కంట్రోల్ చేయొచ్చు.
క్యారియర్ 1 టన్ 3 స్టార్ ఏసీ : ఈ క్యారియర్ ఏసీ ధర మాములుగానే రూ. 47,900లోపు ఉంటుంది. అదే అమెజాన్ దీనిపై 39శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అంటే.. ఈ ఏసీ ధరను కేవలం రూ. 28,900కి కొనుగోలు చేయొచ్చు. అదే బ్యాంకు కార్డులతో కొంటే మాత్రం ఇంకా డిస్కౌంట్ వస్తుంది. దాంతో ఇంకా ధరకే సొంతం చేసుకోవచ్చు.