Best Airtel Plans : రూ. 500లోపు బెస్ట్ ఎయిర్‌టెల్ ప్లాన్లు ఇవే.. అన్‌లిమిటెడ్ 5G డేటా.. ఫుల్ లిస్టు ఇదిగో.. మరెన్నో బెనిఫిట్స్
Best Airtel Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ (Airtel) యూజర్లకు అలర్ట్.. అర్హత ఉన్న యూజర్లకు రోజువారీ డేటా క్యాప్ లేకుండా అన్‌లిమిటెడ్ 5G ఇంటర్నెట్‌ను అందించనున్నట్లు ఎయిర్‌టెల్ ప్రకటించింది.

Best Airtel plans under Rs 500 with unlimited 5G data_ Full list of plans, benefits
Best Airtel Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ (Airtel) యూజర్లకు అలర్ట్.. అర్హత ఉన్న యూజర్లకు రోజువారీ డేటా క్యాప్ లేకుండా అన్‌లిమిటెడ్ 5G ఇంటర్నెట్‌ను అందించనున్నట్లు ఎయిర్‌టెల్ ప్రకటించింది. ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ మొబైల్ SIM ఉన్న యూజర్లు Airtel 5G ప్లస్-రెడీ నగరాల్లో నివసిస్తున్నట్లయితే.. అన్‌లిమిటెడ్, స్పీడ్ ఇంటర్నెట్‌ని పొందవచ్చు. అయితే, 5Gని ఉచితంగా పొందాలంటే రెండు షరతులు ఉన్నాయి. ముందుగా యూజర్లు 5G స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. రెండోది కనీసం రూ. 239 యాక్టివ్ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.
దాదాపు అన్ని ఎయిర్‌టెల్ ప్లాన్‌లు రూ. 239, అంతకంటే ఎక్కువ అన్‌లిమిటెడ్ 5G డేటాను అందిస్తున్నాయి. మీరు అన్‌లిమిటెడ్ 5G డేటా, కాలింగ్, అదనపు బెనిఫిట్స్ అందించే బడ్జెట్-ఫ్రెండ్లీ ప్లాన్ కోసం చూస్తున్నారా? ఎయిర్‌టెల్ యూజర్లు ఎంచుకోవడానికి అనేక ఆప్షన్లు ఉన్నాయి. అన్‌లిమిటెడ్ 5G డేటాతో పాటు అర్హత కలిగిన యూజర్లకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ డేటా, SMS బెనిఫిట్స్ అందించే రూ. 500 లోపు అత్యుత్తమ ఎయిర్‌టెల్ ప్లాన్‌లను ఓసారి లుక్కేయండి.
అన్‌లిమిటెడ్ 5Gతో రూ. 500లోపు ఎయిర్‌టెల్ ప్లాన్లు :
ఎయిర్‌టెల్ రూ. 239 ప్లాన్ : ఈ ప్లాన్ కింద.. ఎయిర్‌టెల్ 1GB రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, మరిన్నింటిని 24 రోజుల పాటు అందిస్తుంది. అర్హత ఉన్న వినియోగదారులు 5G వేగంతో అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ డేటాను పొందవచ్చు.
ఎయిర్‌టెల్ రూ. 265 ప్లాన్ : ఈ ప్లాన్‌తో, వినియోగదారులు పైన పేర్కొన్న ప్లాన్‌కు సమానమైన బెనిఫిట్స్ పొందవచ్చు. అయితే, ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది.
ఎయిర్‌టెల్ రూ. 296 ప్లాన్ : ఈ ప్లాన్ 30 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, SMS బెనిఫిట్స్ అందిస్తుంది. మొత్తం 25GB డేటా, అర్హత ఉన్న వినియోగదారులు అన్‌లిమిటెడ్ 5Gని పొందవచ్చు.
ఎయిర్‌టెల్ రూ. 299 ప్లాన్ : ఈ ప్లాన్ కింద వినియోగదారులు అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో 1.5GB రోజువారీ డేటాను పొందవచ్చు. రోజుకు 100 SMS, అదనంగా 28 రోజుల పాటు బెనిఫిట్స్ పొందవచ్చు. అర్హులైన వినియోగదారులకు అన్‌లిమిటెడ్5G డేటా పొందవచ్చు.

Best Airtel plans under Rs 500 with unlimited 5G data_ Full list of plans, benefits
ఎయిర్‌టెల్ రూ. 319 ప్లాన్ : ఒక నెల వ్యాలిడిటీతో ఈ ప్లాన్‌లో 2GB రోజువారీ డేటా, రోజుకు 100 SMS, అదనపు బెనిఫిట్స్‌తో అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉన్నాయి.
ఎయిర్‌టెల్ రూ. 359 ప్లాన్ : ఈ ప్లాన్ రూ. 319 ప్లాన్ వంటి బెనిఫిట్స్ కలిగి ఉంది. కానీ, అదనంగా, ఎక్స్‌స్ట్రీమ్ యాప్ (Xstream)కు ఉచిత సభ్యత్వాన్ని అందిస్తుంది.
ఎయిర్‌టెల్ రూ. 399 ప్లాన్ : ఈ ప్లాన్ డిస్నీ+ హాట్‌స్టార్‌కు ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ను కలిగి ఉంది. 28 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలతో 2.5GB రోజువారీ డేటాను అందిస్తుంది.
ఎయిర్‌టెల్ రూ. 479 ప్లాన్ : ఈ ప్లాన్ కింద ఎయిర్‌టెల్ 1.5GB రోజువారీ డేటాను అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో, 56 రోజుల పాటు 5G బెనిఫిట్స్‌తో రోజుకు 100 SMSలను అందిస్తుంది.
ఎయిర్‌టెల్ రూ. 489 ప్లాన్ : మొత్తం 50GB డేటాతో, ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్, 100 SMS, 30 రోజుల పాటు అదనపు బెనిఫిట్స్ ఉన్నాయి.
ఎయిర్‌టెల్ రూ. 499 ప్లాన్ : ఈ ప్లాన్ కింద, ఎయిర్‌టెల్ అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో 3G రోజువారీ డేటా, రోజుకు 100 SMS, 28 రోజుల ప్యాక్ వాలిడిటీతో డిస్నీ+ హాట్‌స్టార్ ఉచిత సభ్యత్వాన్ని అందిస్తుంది.