Best Camera Phones : కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ నవంబర్‌లో రూ.30వేల లోపు బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్లు ఇవే!
Best Camera Phones : భారత మార్కెట్లో అనేక రకాల కొత్త స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. నవంబర్ 2024లో రూ. 30వేల లోపు బెస్ట్ కెమెరా ఫోన్లలో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.

Best Camera Phones under Rs 30k in November 2024
Best Camera Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో అనేక రకాల కొత్త స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. మోటోరోలా, వన్‌ప్లస్, రియల్‌మి, వివో మొదలైన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారుల ధర పరిధిలో టాప్ కెమెరా ఫోన్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం. నవంబర్ 2024లో రూ. 30వేల లోపు బెస్ట్ కెమెరా ఫోన్లలో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి. పూర్తి వివరాలను ఓసారి పరిశీలిద్దాం.
1) వివో టీ3 అల్ట్రా :
వివో టీ3 అల్ట్రా 5జీ ఫోన్ 1.5కె రిజల్యూషన్ (2800 x 1260)తో 6.78-అంగుళాల 3డీ కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. 1.07 బిలియన్ రంగుల వరకు రెండరింగ్ చేయగలదు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఫన్‌టచ్ ఓఎస్ 14లో రన్ అవుతుంది. హుడ్ కింద, వివో టీ3 అల్ట్రా మీడియాటెక్ డైమన్షిటీ 9200+ చిప్‌సెట్‌తో ఆధారితంగా పనిచేస్తుంది. గరిష్టంగా 12జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది.
80డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5500mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. కెమెరా ముందు భాగంలో వివో టీ3 అల్ట్రా బ్యాక్ సైడ్ డ్యూయల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్921 ప్రైమరీ సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 8ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ 50ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. తక్కువ లైటింగ్ పరిస్థితుల్లో మెరుగైన ఫొటోగ్రఫీకి వివో సైన్ ‘ఆరా రింగ్ లైట్’ కూడా ఉంది.
2) రియల్‌మి 13ప్రో :
రియల్‌మి 13ప్రో ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 2000నిట్స్ గరిష్ట ప్రకాశంతో 6.7-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జనరేషన్ 2 5జీ చిప్‌సెట్‌తో ఆధారితంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఇంటెన్సివ్ గేమింగ్ సెషన్‌ల సమయంలో సున్నితమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 9-లేయర్ 3డీ వీసీ కూలింగ్ సిస్టమ్‌తో వస్తుంది.
రియల్‌మి 13ప్రో 5జీ డ్యూయల్-కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. ఇందులో 50ఎంపీ సోనీ ఎల్‌వైటీ-600 ప్రధాన సెన్సార్, 8ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ఫొటోగ్రఫీ ఎక్స్‌పీరియన్స్ ఏఐ ప్యూర్ బోకే, ఏఐ నేచురల్ స్కిన్ టోన్, ఏఐ అల్ట్రా క్లారిటీ, ఏఐ గ్రూప్ ఫొటో వంటి అడ్వాన్స్‌డ్ ఏఐ ఫీచర్లను కలిగి ఉంది.
3) మోటోరోలా ఎడ్జ్ 50ప్రో :
మోటోరోలా ఎడ్జ్ 50ప్రో 5జీ, గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ టాస్క్‌ల కోసం అడ్రినో 720 జీపీయూతో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందింది. 8జీబీ ర్యామ్‌తో వస్తుంది. మల్టీ టాస్కింగ్ మెరుగైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.7-అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+ పీ-ఓఎల్ఈడీ డిస్‌ప్లే 144Hz వరకు రిఫ్రెష్ రేట్, గరిష్ట ప్రకాశం, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో 2వేల నిట్‌ల వరకు ఉంటుంది. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ ఫోన్ బ్యాక్‌సైడ్ 50ఎంపీ+ 13ఎంపీ + 10ఎంపీ ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అయితే, 50ఎంపీ ఫ్రంట్ కెమెరా అద్భుతమైన సెల్ఫీల కోసం రూపొందించింది. 4500mAh బ్యాటరీతో ఆధారితమైన ఈ ఫోన్ టర్బో పవర్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. స్పీడ్ డేటా ట్రాన్స్‌ఫర్, ఛార్జింగ్ కోసం యూఎస్‌బీ టైప్-సి పోర్ట్‌ను కలిగి ఉంటుంది.
4) వన్‌ప్లస్ నార్డ్ 4 :
వన్‌ప్లస్ నార్డ్ 4 ఫోన్ 2772 × 1240 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.74-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 2,150 నిట్‌ల గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉంది. యూఎస్‌బీ 2.0 పోర్ట్, అలర్ట్ స్లైడర్, బ్లూటూత్ 5.4, వై-ఫై 6, ఎన్ఎఫ్‌సీ స్ప్లాష్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ65 రేటింగ్‌ను కలిగి ఉంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 ప్లస్ జనరేషన్ 3 చిప్‌సెట్ ద్వారా ఆధారితంగా అడ్రినో 732 జీపీయూతో వస్తుంది. 8జీబీ లేదా 12జీబీ ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ మెమరీతో వస్తుంది. 128జీబీ యూఎఫ్ఎస్ 3.1 లేదా 256జీబీ యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఆప్షన్లను అందిస్తుంది.
కెమెరాల పరంగా నార్డ్ 4 ఓఐఎస్, ఇఐఎస్‌తో కూడిన 50ఎంపీ సోనీ ఎల్‌వైటీఐఏ ప్రైమరీ సెన్సార్‌తో పాటు 112-డిగ్రీ ఫీల్డ్ వ్యూతో 8ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌ను కలిగి ఉంది. ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్ 16ఎంపీ సెన్సార్ కలిగి ఉంది. ప్రైమరీ సెన్సార్ 60ఎఫ్‌పీఎస్ వద్ద 4కె వీడియో రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
అయితే, ఫ్రంట్, అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాలు 30ఎఫ్‌పీఎస్ వద్ద 1080పీ వీడియో వరకు రికార్డ్ చేయొచ్చు. వన్‌ప్లస్ ఫోన్ 5,500mAh బ్యాటరీ, 100డబ్ల్యూ సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. ఆక్సిజన్‌ఓఎస్ 14.1తో సరికొత్త ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. వన్‌ప్లస్ 4 ఏళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ 6ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లు కలిగి ఉంది.