Best Reliance Jio plans with 2GB data per day in March 2023 _ Full list of plans, benefits
Best Reliance Jio Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) తమ యూజర్ల కోసం 2GB రోజువారీ డేటా ప్లాన్‌లను అందిస్తోంది. ఇందులో హైస్పీడ్ డేటా, కాలింగ్, SMS బెనిఫిట్స్ ఉన్నాయి. రోజువారీ డేటా లిమిట్ విషయంలో ఇకపై ఆందోళన అక్కర్లేదు. అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ కోసం చూస్తున్న Jio ప్రీపెయిడ్ యూజర్లకు ఈ 2GB రోజువారీ డేటా ప్లాన్‌లు బెస్ట్ అని చెప్పవచ్చు. అదనంగా, అన్ని ప్లాన్‌లు Jio 5G వెల్‌కమ్ ఆఫర్‌ల కిందకు వస్తాయి.
అంటే.. మీరు ఈ ప్లాన్‌లలో ఒకదానిని మీ యాక్టివ్ రీఛార్జ్ ప్యాక్‌గా పొందవచ్చు. మీరు మీ ప్రాంతంలో అందుబాటులో ఉన్న 5G నెట్‌వర్క్‌ని ఉపయోగించవచ్చు. అదనంగా, ఈ ప్లాన్‌లు అన్‌లిమిటెడ్ కాలింగ్, OTT ప్లాట్‌ఫారమ్‌లకు ఫ్రీగా సబ్‌స్క్రిప్షన్, Jio క్లౌడ్, Jio సెక్యూరిటీ వంటి మరిన్ని ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు. మార్చి 2023లో 2GB డేటా ఎక్స్‌ట్రాక్ట్ బెనిఫిట్స్ అందించే అన్ని Jio ప్రీపెయిడ్ ప్లాన్‌లను ఓసారి లుక్కేయండి. ఇందులో మీకు నచ్చిన రీఛార్జ్ ప్లాన్ ఎంచుకోండి. రోజుంతా డేటాను ఎంజాయ్ చేయండి.
జియోలో రోజుకు 2GB డేటాతో ప్లాన్ :
రూ. 249 ప్లాన్ : 23 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్ మొత్తం 46GB డేటాతో 2GB రోజువారీ ఇంటర్నెట్ అందిస్తుంది. లిమిట్ దాటితే ఇంటర్నెట్ స్పీడ్ 64 Kbpsకి పడిపోతుంది. అదనంగా, ఈ ప్లాన్ జియో యాప్‌ల సబ్‌స్క్రిప్షన్‌తో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలను కూడా అందిస్తుంది.
రూ. 299 ప్లాన్ : ఈ కేటగిరీ కింద బెస్ట్ సెల్లింగ్ ప్లాన్‌గా అందుబాటులో ఉంది. Jio 28 రోజుల వ్యాలిడిటీతో 2GB డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్‌లు, రోజుకు 100 SMSలు, JioTV, JioCinema, JioSecurity, ఇతర వాటితో సహా Jio యాప్‌లకు సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది.
Best Reliance Jio plans with 2GB data per day in March 2023
రూ. 533 ప్లాన్ : 56 రోజుల ప్యాక్ వ్యాలిడిటీతో పాటు మొత్తం 112GBతో ప్రీపెయిడ్ ప్లాన్‌లో 2GB రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్‌లు, రోజుకు 100 SMSలు, JioTV, JioCinema, JioSecurity ఇతర వాటితో సహా Jio యాప్‌లకు సబ్‌స్క్రిప్షన్ ఉన్నాయి.
రూ. 719 ప్లాన్ : ఈ ప్లాన్ రోజుకు 2GB డేటాను అందిస్తుంది. 84 రోజుల పాటు 168GB డేటాను అందిస్తుంది. జియో యూజర్లు నెలకు కేవలం రూ. 240 ఖర్చుతో అదనపు బెనిఫిట్స్ పొందవచ్చు. 2GB రోజువారీ డేటాను పొందవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్‌లతో, రోజుకు 100 SMSలు బెనిఫిట్స్ పొందవచ్చు. Jio యాప్‌లకు JioTV, JioCinema, JioSecurity, ఇతర సబ్‌స్క్రిప్షన్‌తో సహా ఒకే విధంగా ఉంటాయి.
రూ. 2879 ప్లాన్ : 2GB రోజువారీ డేటా లిస్టింగ్ కింద అత్యంత ఖరీదైన ప్లాన్. ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్ మొత్తం 730GB డేటాతో 365 రోజుల వార్షిక వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్‌లు, రోజుకు 100 SMSలు, JioTV, JioCinema, JioSecurity, ఇతర వాటితో సహా Jio యాప్‌లకు సబ్‌స్క్రిప్షన్ ఉన్నాయి.
ముఖ్యంగా, Jio ఈ కేటగిరీ నుంచి రెండు ప్లాన్‌లను రద్దు చేసింది. అంటే.. రూ. 799 ప్లాన్, రూ. 1,066 ప్లాన్ రెండు ఉన్నాయి. రెండు ప్లాన్‌లు వరుసగా 56 రోజులు, 84 రోజుల వ్యాలిడిటీని అందిస్తాయి. నెలవారీ రీఛార్జ్ ప్లాన్‌లు కాకుండా వార్షిక ప్లాన్‌లను కోరుకునే యూజర్లను లక్ష్యంగా జియో ఈ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.