Best Selling Phone Deals : అమెజాన్ ఫెస్టివల్ సేల్.. ఈ బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ అసలు మిస్ చేసుకోవద్దు..!
Best Selling Phone Deals : మీరు స్మార్ట్‌ఫోన్ లేదా ఇతర ఎలక్ట్రానిక్స్ ప్రొడక్టులను కొనుగోలు చేయాలని చూస్తుంటే.. ఇదే సరైన అవకాశం. ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లను ఉపయోగించి కొనుగోళ్లపై భారీ తగ్గింపును అందిస్తోంది.

Best Selling Smartphone Deals ( Image Source : Google )
Best Selling Phone Deals : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఈ ఏడాదిలో అతిపెద్ద సేల్ ఈవెంట్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్‌తో సహా అనేక ప్రొడక్టులపై భారీ తగ్గింపులను అందిస్తుంది.
Read Also : Ajay Jadeja : 15 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన మాజీ క్రికెటర్.. ఈ రాజ సింహాసనానికి వారసుడు.. జామ్ సాహెబ్‌గా ప్రకటన
మీరు స్మార్ట్‌ఫోన్ లేదా ఇతర ఎలక్ట్రానిక్స్ ప్రొడక్టులను కొనుగోలు చేయాలని చూస్తుంటే.. ఇదే సరైన అవకాశం. మీరు సేవింగ్స్ కోసం అమెజాన్ ద్వారా అందించే కొత్త బ్యాంక్ ఆఫర్‌లతో పాటుగా కొనసాగుతున్న సేల్ బెస్ట్ డీల్స్‌లో ఒకటి. ఈ ఫెస్టివల్ సేల్ ఈవెంట్‌లో కొన్ని స్మార్ట్‌ఫోన్ మోడల్‌లు కొనుగోలుదారులలో బాగా పాపులర్ అయ్యాయి. ఈ డీల్‌లలో మరికొన్నింటిని ఇప్పుడు చూద్దాం.
అమెజాన్ ఫెస్టివల్ సేల్.. బ్యాంక్ ఆఫర్లు :
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్ సెప్టెంబరు 27న ప్రారంభం కాగా.. ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లను ఉపయోగించి కొనుగోళ్లపై భారీ తగ్గింపును అందిస్తోంది. ఇ-కామర్స్ దిగ్గజం ఇప్పుడు అనేక ఇతర బ్యాంక్ కార్డ్‌లపై కూడా డిస్కౌంట్లను అందిస్తోంది. తద్వారా మరింత మంది కస్టమర్లకు ధరలను తగ్గనుంది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా హెచ్‌ఎస్‌బీసీ క్రెడిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీని ఉపయోగించి కొనుగోలు చేయవచ్చునని అమెజాన్ చెబుతోంది.ఈ సేల్ సమయంలో రూ. 9,750 వరకు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాదు.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ నుంచి డెబిట్, క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి రూ. 6వేల వరకు లావాదేవీలపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.
Read Also : Oppo K12 Plus Launch : కొత్త ఫోన్ చూశారా? ఒప్పో K12 ప్లస్ ఫోన్ వచ్చేసిందోచ్.. ధర, ఫీచర్లు వివరాలివే..!