Credit Card Holders : క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ జాగ్రత్త.. బిల్లు లేటుగా చెల్లించేవారు సుప్రీంకోర్టు తీర్పు తప్పక తెలుసుకోండి..!

Credit Card Holders : క్రెడిట్ కార్డుదారులకు షాకింగ్ న్యూస్.. సుప్రీంకోర్టు క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లపై 30శాతం పరిమితిని తొలగించింది. ఇకపై బ్యాంకులు అధిక వడ్డీని విధించుకోవచ్చు.

Credit Card Holders : క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ జాగ్రత్త.. బిల్లు లేటుగా చెల్లించేవారు సుప్రీంకోర్టు తీర్పు తప్పక తెలుసుకోండి..!

Beware credit card holders

Updated On : December 21, 2024 / 9:53 PM IST

Credit Card Holders : క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. క్రెడిట్ కార్డును సరైన పద్ధతిలో వాడకపోతే భారీగా నష్టపోవాల్సి వస్తుంది. క్రెడిట్ కార్డు లిమిట్ ఉంది కదా అని వాడేసి తీరా గడువు తేదీలోగా బిల్లు చెల్లించకపోతే వడ్డీ తడిసిమోపడు అవుతుంది. ఇకపై, వడ్డీ విషయంలో బ్యాంకులదే ఫైనల్ అని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.

క్రెడిట్ కార్డు వడ్డీపై పరిమితి విషయంలో జాతీయ వినియోగదారు వివాదాల పరిష్కార కమిషన్‌ (NCDRC) ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కనపెట్టేసింది. క్రెడిట్ కార్డుదారులు నిర్ణీత గడువులోగా బిల్లు చెల్లించకపోతే వారి నుంచి భారీ మొత్తంలో వడ్డీ వసూలు చేసుకునేలా బ్యాంకులకే నిర్ణయాన్ని వదిలేసింది. క్రెడిట్‌ కార్డు బిల్లును గడువు తేదీలోగా తప్పక చెల్లించాలని నిపుణులు కూడా సూచిస్తున్నారు. లేదంటే అప్పుల ఊబిలో పడిపోతారని హెచ్చరిస్తున్నారు.

30శాతం పరిమతి ఇకపై వర్తించదు :
క్రెడిట్‌ కార్డు బిల్లు లేటు పేమెంట్‌పై వార్షికంగా 30 శాతానికి మించి వడ్డీని వసూలు చేయరాదని నేషనల్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ (NCDRC) 2008లో తీర్పు వెలువరించింది. క్రెడిట్ కార్డు లేటు పేమెంట్లపై బ్యాంకులు 36 నుంచి 49 శాతం మేర వడ్డీని వసూలు చేయడంపై ఆవాజ్‌ ఫౌండేషన్‌ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది.

దీనిపై కొన్ని బ్యాంకులు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. మొదట్లో దీనిపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 2009లో ఈ కేసు తీర్పుపై స్టే కూడా విధించింది సుప్రీంకోర్టు. దాదాపు 16ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు కమిషన్‌ ఆదేశాలను పక్కన పెట్టేస్తూ.. 30 శాతం పరిమితి ఇకపై వర్తించదని స్పష్టం చేసింది.

క్రెడిట్ కార్డు సరిగా వాడకపోతే :
క్రెడిట్‌ కార్డుతో కలిగే ప్రయోజనాలు ఎన్ని ఉంటాయో.. అది సరైన విధంగా వాడకపోతే కలిగే నష్టాలు అంతకన్నా ఎక్కువగానే ఉంటాయి. క్రెడిట్ కార్డు అనేది ఎమర్జెన్సీ పరిస్థితుల్లో డబ్బు అవసరమైనప్పుడు ఆదుకుంటుంది. అలాంటి క్రెడిట్ కార్డును పరిమితంగానే వాడాలి తప్పా ఎలా పడితే అలా వాడకూడదని తప్పక తెలుసుకోవాలి. క్రెడిట్ కార్డులతో చేసే లావాదేవీలపై రివార్డు పాయింట్లు కూడా పొందవచ్చు.

క్రెడిట్ కార్డు లిమిట్‌పై వాడిన మొత్తం అమౌంట్‌పై 45 రోజుల్లోగా ఎలాంటి వడ్డీ ఉండదు. ఈ గడువు తేదీలోగా బిల్లు పేమెంట్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదే క్రెడిట్ బిల్లు గడువు తేదీ దాటిన తర్వాత కూడా చెల్లించకపోతే మాత్రం భారీ మొత్తంలో వడ్డీ చెల్లించాల్సి వస్తుందని మరవద్దు.

వడ్డీ పడకుండా ఉండాలంటే గడువు తేదీలోగా ఖర్చు చేసిన మొత్తాన్ని చెల్లించడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. క్రెడిట్‌ కార్డు వినియోగదారులు బ్యాంకు నిబంధనలతో పాటు లేట్ పేమెంట్లతో కలిగే నష్టాలపై తప్పక అవగాహన ఉండాలని అంటున్నారు.

Read Also : YouTube New Rules : భారతీయ క్రియేటర్లకు యూట్యూబ్ వార్నింగ్.. ఇకపై ఇలా టైటిల్స్, థంబునైల్స్ పెడితే వీడియోలను డిలీట్ చేస్తాం..!