Hyderabad : ఈ వెబ్‌‌సైట్ల జోలికి పోకండి..నిలువునా మోసపోతారు..జాగ్రత్త

నకిలీ యాప్స్, వెబ్ సైట్ల పేరిట ప్రజలను దోచుకుంటున్నట్లు సైబర్ సెక్యూర్టీ సంస్థ జింపెరియం నిర్ధారించింది. సైబర్ క్రైమ్ పలు సూచనలు చేస్తోంది.

Hyderabad

Beware Of Fake Websites : సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. తక్కువ ధరలకే వస్తువులు వస్తాయని…లింక్ ఓపెన్ చేయాలని పలువురికి మెసేజ్ లు వస్తున్నాయి. దీనిని నమ్మిన కొంతమంది ఆ లింక్ లను ఓపెన్ చేసి నిలువునా మోసపోతున్నారు. నకిలీ యాప్స్, వెబ్ సైట్ల పేరిట ప్రజలను దోచుకుంటున్నట్లు ప్రముఖ సైబర్ సెక్యూర్టీ సంస్థ జింపెరియం నిర్ధారించింది. సైబర్ క్రైమ్ పోలీసులు కూడా పలు సూచనలు చేస్తున్నారు. సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, తక్కువగా ధరలకే వస్తువులు వస్తున్నాయని చూపే వెబ్ సైట్లను, ఇతర లింక్ ల జోలికి అస్సలు వెళ్లవద్దంటున్నారు. ఈబే 19.కామ్, EZప్లాన్, లక్కీబాల్, డేబెట్, సన్ ఫ్యాక్టరీ.ETC, అమెజాన్ 93. కామ్ వంటి నకిలీ వెబ్ సైట్లు మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

Read More : Extra Marital Affair : తల్లి మరోక వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందని……

సైట్లలో బ్రాండెండ్‌ వస్తువుల ఫోటోలను పెట్టి.. తక్కువ ధరకే వాటిని అందిస్తామంటూ ప్రచారం చేస్తున్నారు. ఎక్కడా లేని ఆఫర్‌ అంటూ ఊరిస్తున్నారు. ఇది చూసి నిజమే అని ఆర్డర్‌ చేసిన వాళ్లను మోసం చేస్తున్నారు. ఇంత తక్కువ ధరకు ట్యాబ్‌లు, బట్టలు వస్తున్నాయని నమ్మిన వారు.. కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే క్యాష్‌ ఆన్‌ డెలివరీ ఆప్షన్‌ ఉన్నా.. అలా బుక్‌ చేస్తే ఎర్రర్‌ చూపించేలా సైట్‌ను రూపొందించారు ఈ కేటుగాళ్లు. ఆన్‌లైన్‌ పేమెంట్‌ అయ్యాకే ఆర్డర్‌ ఓకే అయ్యాలా సెట్‌ చేశారు.

Read More : Afghanistan : అప్ఘాన్‌‌లో తాలిబన్లు, భారత్‌‌పై ఎఫెక్ట్..వీటి ధరలు పెరుగుతాయా ?

ఆన్‌లైన్‌ పేమెంట్‌ అవడంతోనే వారి మోసం మొదలుపెట్టేస్తారు. డిస్‌ప్లే చూపించిన ఐటమ్‌కి.. డెలివరీ అయ్యే ఐటమ్‌కు అసలు సంబంధమే ఉండదు. బ్రాండెడ్‌ ట్యాబ్‌ అని కొన్నవారికి.. పనిచేయని లేదా నాసిరకం వస్తువును డెలివరీ చేస్తారు. రిటర్న్‌ పాలసీలో తిప్పి పంపామా.. ఇదీపోతుంది.. మనీ రీఫండ్‌ కావు. చీప్‌గా బ్రాండెడ్‌ వస్తువులు వస్తాయంటే నమ్మి మోసపోవద్దని సూచిస్తున్నారు.