Extra Marital Affair : తల్లి మరోక వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందని……
తండ్రితో విడిపోయిన తల్లి వేరోక వ్యక్తితో సన్నిహితంగా ఉండటం సహించలేని కొడుకు, మేనమామతో కలిసి హత్యాయత్నం చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

Extra Marital Affair
Extra Marital Affair : తండ్రితో విడిపోయిన తల్లి వేరోక వ్యక్తితో సన్నిహితంగా ఉండటం సహించలేని కొడుకు, మేనమామతో కలిసి కన్నతల్లిపై హత్యాయత్నం చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
మద్నూర్ కు చెందిన గోసం లక్ష్మి అనే మహిళకు గతంలోనే వివాహాం జరిగింది. భర్తతో విబేధాలు రావటంతో, అతడి నుంచి విడిపోయి కొడుకు, తమ్ముడితో కలిసి విడిగా జీవిస్తోంది. ఈ క్రమంలో ఆమె మరోక వ్యక్తితో సన్నిహితంగా ఉండసాగింది. ఈమె వ్యవహారం తమ్ముడు ప్రవీణ్, కొడుకు రవి లకు నచ్చటం లేదు.
దీంతో మంగళవారం తెల్లవారుఝూమున నిద్రపోతున్న లక్ష్మిపై రవి, ప్రవీణ్ లు కత్తితో దాడి చేసి గొంతు కోసి హత్య చేయటానికి యత్నించారు. బాధితురాలు కేకేలు వేయటంతో ఇరుగు పొరుగు వారు ఇంటివద్దకు వచ్చారు. వారిని చూసి ప్రవీణ్, రవి పరారయ్యారు.
బాధితురాలిని నిజామాబాద్ లోని ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి కుమార్తె శిరీష ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్ధలానికి వచ్చి ఆధారాలు సేకరించి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.