WhatsApp : లింక్ పంపుతారు..ఓటీపీ చెప్పమంటారు..తర్వాత, హైదరాబాద్‌‌లో మరో మోసం

సైబర్ నేరగాళ్లు రోజురోజుకీ కొత్త కొత్త మార్గాల ద్వారా అమాయకులను మోసం చేస్తున్నారు. వాట్సాప్‌ను హ్యాకింగ్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు.

WhatsApp : లింక్ పంపుతారు..ఓటీపీ చెప్పమంటారు..తర్వాత, హైదరాబాద్‌‌లో మరో మోసం

Watsupweb

Updated On : August 19, 2021 / 7:24 AM IST

Links On WhatsApp : సైబర్ నేరగాళ్లు రోజురోజుకీ కొత్త కొత్త మార్గాల ద్వారా అమాయకులను మోసం చేస్తున్నారు. తాజాగా వాట్సాప్‌ను (WhatsApp) హ్యాకింగ్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. వాట్సాప్‌‌కు ముందుగా లింక్ పంపి ఓటీపీ (OTP) అడుగుతున్నారు కేటుగాళ్లు. ఓటీపి చెప్పిన వెంటనే సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వాట్సాప్ వెళ్లిపోతుంది. వాట్సాప్ నెంబర్‌తో డయల్ వెరిఫికేషన్ చేసుకుని.. వాట్సాప్‌లోని డేటా బ్యాకప్ తీసుకుంటున్నారు.

Read More : AP EAPCET : ఇంజినీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్

అనంతరం వాట్సాప్‌ నెంబర్లతో డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి ఇటీవల ఈ తరహా మోసాలపై ఫిర్యాదులు అందుతున్నాయి. టోలిచౌకికి చెందిన ఓ వ్యక్తి స్నేహితులకు సైబర్ చీటర్స్ మెసేజ్ చేశారు. అత్యవసరంగా డబ్బు అవసరముందని 3 లక్షల రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేయాలని రిక్వెస్ట్ చేశారు. కొంతమంది తెలియక డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసి.. ఆ వ్యక్తికి కాల్ చేశారు.

Read More : Bullet bandi : పెళ్లి కూతురు డ్యాన్స్.. సోషల్ మీడియా షేక్, ఈమె ఎవరో తెలుసా

అప్పుడే అసలు మోసం బయటపడింది. వెంటనే ఆ వ్యక్తి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. టెక్నాలజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ తరహా మోసాలే కాకుండా ఫేక్ లింకులు పంపి.. వాటిని క్లిక్ చేసిన వారి అకౌంట్లను ఖాళీ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు.

Read More : E KYC : రేషన్ కార్డులు తొలగింపు, ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన

మరోవైపు…తక్కువ ధరలకే వస్తువులు వస్తాయని…లింక్ ఓపెన్ చేయాలని పలువురికి మెసేజ్ లు వస్తున్నాయి. దీనిని నమ్మిన కొంతమంది ఆ లింక్ లను ఓపెన్ చేసి నిలువునా మోసపోతున్నారు. నకిలీ యాప్స్, వెబ్ సైట్ల పేరిట ప్రజలను దోచుకుంటున్నట్లు ప్రముఖ సైబర్ సెక్యూర్టీ సంస్థ జింపెరియం నిర్ధారించింది. సైబర్ క్రైమ్ పోలీసులు కూడా పలు సూచనలు చేస్తున్నారు. సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, తక్కువగా ధరలకే వస్తువులు వస్తున్నాయని చూపే వెబ్ సైట్లను, ఇతర లింక్ ల జోలికి అస్సలు వెళ్లవద్దంటున్నారు. ఈబే 19.కామ్, EZప్లాన్, లక్కీబాల్, డేబెట్, సన్ ఫ్యాక్టరీ.ETC, అమెజాన్ 93. కామ్ వంటి నకిలీ వెబ్ సైట్లు మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.