AP EAPCET : ఇంజినీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్

2021-22 విద్యా సంవత్సరానికి నిర్వహించే.. ఇంజనీరింగ్‌ పరీక్షలు నేటి నుంచి 25వ తేదీ వరకు జగరనున్నాయి.

AP EAPCET : ఇంజినీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్

Ap Eapcet

Updated On : August 19, 2021 / 7:12 AM IST

AP EAPCET 2021 : ఏపీలో నేటి నుంచి ఇంజినీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ (AP EAPCET) జరగనున్నాయి. 2021-22 విద్యా సంవత్సరానికి నిర్వహించే.. ఇంజనీరింగ్‌ పరీక్షలు నేటి నుంచి 25వ తేదీ వరకు జగరనున్నాయి. సెప్టెంబర్‌ 3, 6, 7 తేదీల్లో వ్యవసాయ‌, ఫార్మసీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్ష బాధ్యతలు కాకినాడ జేఎన్‌టీయూకు అప్పగించారు. మొత్తం 16 సెషన్లలో.. 120 పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు.

Read More : Bullet bandi : పెళ్లి కూతురు డ్యాన్స్.. సోషల్ మీడియా షేక్, ఈమె ఎవరో తెలుసా

మాస్క్ లేకపోయినా.. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాలలోకి విద్యార్ధులకి అనుమతి‌ నిరాకరిస్తారు. కొవిడ్ పాజిటివ్ లక్షణాలున్న విద్యార్ధులకి ప్రత్యేక ఐసోలేషన్ రూమ్‌లలో పరీక్ష పెడతామని విద్యామండలి తెలిపింది. ఈనెల 25వ తేదీన ఇంజినీరింగ్ ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు. 2 లక్షల 59 వేల 156 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారని తెలుస్తోంది.

Read More : Moola Nakshatra : శ్రీశైలంలో అమ్మవారికి మూల నక్షత్ర పూజలు

కోవిడ్ కారణంగా..ఈ ఇంటర్ మీడియట పరీక్షలు నిర్వహించలేదనే సంగతి తెలిసిందే. ఫలితాలు ప్రకటించడంతో ఈ ఏడాది ఈఏపీసెట్ లో ఇంటర్ మార్కులకు వెయిటేజీని రద్దు చేసినట్లు ఉన్నత విద్యా మండలి ఇదివరకే వెల్లడించింది. విద్యార్థులు సాధించిన మార్కులనే వందశాతం వెయిటేజీగా తీసుకుని ర్యాంకులను ప్రకటించనున్నారు. మొత్తం 1000 మంది ఇన్విజిలేటర్లు, 200 పరిశీలకులను నియమించినట్లు అధికారులు వెల్లడించారు.