BSNL 4G SIM : గుడ్ న్యూస్.. బీఎస్ఎన్ఎల్ 4జీ కొత్త సిమ్ కార్డ్ వచ్చేసింది.. ఎలా యాక్టివేట్ చేయాలో తెలుసా?
BSNL 5G Launch : బీఎస్ఎన్ఎల్ 4జీ, 5జీ యూజర్ల కోసం కొత్త యూఎస్ఐఎమ్ ప్రారంభించనుంది. ఈ కొత్త సిమ్‌లో 4జీ సిమ్‌పై మాత్రమే కాకుండా 5జీ సర్వీసును పొందవచ్చు.

BSNL 4G SIM_ How to activate new SIM card ( Image Source : Google )
BSNL 5G SIM Card : దేశీయ టెలికం దిగ్గజాలైన ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియో తమ టారిఫ్ ధరలను అమాంతం పెంచేశాయి. దాంతో చాలామంది మొబైల్ యూజర్లు ప్రైవేట్ టెలికాం కంపెనీలను క్రమంగా దూరమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు.
అదే సమయంలో, ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన 4జీ సర్వీసును ప్రారంభించబోతోంది. దేశంలో దాదాపు 15 వేల కొత్త టవర్లను కూడా కంపెనీ ఏర్పాటు చేసింది. 4జీతో పాటు 5జీ సేవలపై కూడా కంపెనీ పనిచేస్తోంది. ఇప్పుడు 4జీ, 5జీ యూజర్ల కోసం బీఎస్ఎన్ఎల్ ద్వారా కొత్త యూఎస్ఐఎమ్ ప్రారంభించనుంది. ఈ కొత్త సిమ్‌లో వినియోగదారులు 4జీ సిమ్‌పై మాత్రమే కాకుండా 5జీ సర్వీసును పొందుతారు.
USIM అంటే ఏమిటి? :
యూఎస్ఐఎమ్ (యూనివర్సల్ సబ్‌స్క్రైబర్స్ ఐడెంటిటీ మాడ్యూల్)లో చిన్న చిప్ ఇన్‌స్టాల్ అయి ఉంటుంది. సాధారణ సిమ్ కార్డ్‌కు భిన్నంగా ఉంటుంది. ఈ చిప్‌తో యూజర్ల సమాచారం మొత్తం సిమ్ కార్డ్‌లో స్టోర్ అవుతుంది. ఈ సిమ్ సాధారణ సిమ్ కార్డ్‌ని పోలి ఉన్నప్పటికీ, ఈ సిమ్ కార్డ్ మరింత సురక్షితమైనదిగా చెప్పవచ్చు. అంతేకాకుండా, ఈ సిమ్ అథెంటికేషన్, వెరిఫికేషన్ కూడా చాలా సులభం. అందుకే ఈ (U-SIM)ని బీఎస్ఎన్ఎల్ 4జీ, 5జీ యూజర్లకు అందిస్తోంది. ఈ కొత్త సిమ్‌కార్డుతో ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ 4జీ సిమ్‌లో 5జీ సర్వీసును పొందవచ్చు.
త్వరలో బీఎస్ఎన్ఎల్ 4జీ సర్వీసు :
సమాచారం ప్రకారం.. బీఎస్ఎన్ఎల్ 4జీ సర్వీసు మార్చి 2025 నాటికి దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుంది. బీఎస్ఎన్ఎల్ 4జీ సర్వీసు రాబోయే ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. 2025 చివరి నాటికి బీఎస్ఎన్ఎల్ 5జీ సర్వీసును కూడా అందుబాటులోకి తేవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అలాంటి పరిస్థితిలో కంపెనీ దేశంలో ఇతర ఇంటర్నెట్ ప్లాన్‌లతో పాటు చౌకైన కాలింగ్ సౌకర్యాలను అందించనుంది. బీఎస్ఎన్ఎల్ దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కూడా మరింత బలోపేతం అయ్యేందుకు అవకాశం ఉంటుంది.
కొత్త బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డ్‌ని ఎలా యాక్టివేట్ చేయాలంటే? :
- మీ మొబైల్ ఫోన్‌లో బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డ్‌ని యాడ్ చేసి దాన్ని రీస్టార్ట్ చేయండి.
- నెట్‌వర్క్ సిగ్నల్ కనిపించే వరకు వేచి ఉండండి.
- మీరు డిస్‌ప్లే పైభాగంలో నెట్‌వర్క్ సిగ్నల్‌ని చూసిన తర్వాత ఫోన్ యాప్‌ను ఓపెన్ చేయండి.
- మీ ఐడెంటిటీని వెరిఫై చేయడానికి మీ ఫోన్ నుంచి 1507కి కాల్ చేయండి.
- మీ లాంగ్వేజీ స్కిల్స్, ఐడెంటిటీ, అడ్రస్ ప్రూఫ్ గురించి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి
- టెలి-వెరిఫికేషన్ కోసం కనిపించే సూచనలను ఫాలో అవ్వండి.
- ప్రక్రియ పూర్తయిన తర్వాత మీ బీఎస్ఎన్ఎల్ సిమ్ విజయవంతంగా యాక్టివేట్ అవుతుంది.
- మీ హ్యాండ్‌సెట్‌కు నిర్దిష్ట ఇంటర్నెట్ సెట్టింగ్‌లను పొందవచ్చు.
- మీ సిమ్ కార్డ్ పనితీరు కోసం ఈ మార్పులను సేవ్ చేయండి.
- మీ సిమ్ కార్డ్ ఇప్పుడు కాలింగ్, ఇంటర్నెట్ సర్వీసుల కోసం ఉపయోగించవచ్చు.