WhatsApp Meta AI : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. మెటా ఏఐతో కస్టమ్ స్టిక్కర్లు క్రియేట్ చేయొచ్చు.. ఇదేలా పనిచేస్తుందంటే?

WhatsApp Meta AI : మీరు స్టిక్ ఐకాన్ ట్యాప్ చేసి టెక్స్ట్ లేదా ఎమోజీని ఉపయోగించి స్టిక్కర్ కోసం సెర్చ్ చేయాలి. ట్యాబ్ ఎమోజీ, జిఫ్, GIPHY స్టిక్కర్‌ల పక్కన ఉన్న ట్రేలో అందుబాటులో ఉంటుంది.

WhatsApp Meta AI : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. మెటా ఏఐతో కస్టమ్ స్టిక్కర్లు క్రియేట్ చేయొచ్చు.. ఇదేలా పనిచేస్తుందంటే?

WhatsApp Now Lets You Create Custom Stickers ( Image Source : Google )

WhatsApp Meta AI : వాట్సాప్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ వచ్చేసింది. వాట్సాప్ కస్టమ్ స్టిక్కర్లు ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో ఈజీగా షేర్ చేసుకోవచ్చు. మెసేజింగ్ యాప్ స్టిక్కర్‌లను ఇంటరాక్టివ్‌గా అందిస్తోంది. మెసేజింగ్ యాప్‌లో మెటా ఏఐ చాట్‌బాట్‌ని ఉపయోగించి కస్టమ్ స్టిక్కర్‌లను క్రియేట్ చేయొచ్చు.

Read Also : Mobile Internet Speed : మీ ఫోన్‌లో 5G వాడితే ఇంటర్నెట్ స్లో అవుతుందా? డేటా స్పీడ్ పెరగాలంటే ఈ టిప్స్ ట్రై చేయండి..!

ఈ మేరకు మెటా యాజమాన్యంలోని ప్లాట్‌ఫారమ్ ధృవీకరించింది. కొత్త స్టిక్కర్‌ల కోసం సెర్చ్ చేసేందుకు ప్లాట్‌ఫారమ్ పాపులర్ (GIPHY)తో కూడా పని చేస్తోంది. జీఐపీహెచ్‌వై స్టిక్కర్‌లను ఇప్పుడు వాట్సాప్‌లో సెర్చ్ చేయొచ్చు. మెసేజింగ్ యాప్‌లో స్టిక్కర్‌ల లిస్టును పొందవచ్చు. మీరు స్టిక్ ఐకాన్ ట్యాప్ చేసి టెక్స్ట్ లేదా ఎమోజీని ఉపయోగించి స్టిక్కర్ కోసం సెర్చ్ చేయాలి. ట్యాబ్ ఎమోజీ, జిఫ్, GIPHY స్టిక్కర్‌ల పక్కన ఉన్న ట్రేలో అందుబాటులో ఉంటుంది.

వాట్సాప్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం కస్టమ్ స్టిక్కర్ మేకర్‌ను తీసుకొస్తోంది. ఇప్పటివరకూ ఐఫోన్ యూజర్లు ఈ ఫీచర్‌ని కొంతకాలం ఉపయోగించారు. మీరు పర్సనల్ ఫొటోలు లేదా మరిన్నింటిని ఉపయోగించి స్టిక్కర్‌లను క్రియేట్ చేయొచ్చు. అవసరమైతే ఎడిట్ చేయడం లేదా షేర్ చేసేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది. మెటా ఏఐ స్టిక్కర్లు కూడా వచ్చాయి.

వాట్సాప్ ఏఐ చాట్‌బాట్ ద్వారా టెక్స్ట్ ప్రాంప్ట్‌ల సాయంతో స్టిక్కర్‌లను క్రియేట్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది. ప్రస్తుతానికి అమెరికాలో ఐఫోన్, ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. అయితే, ఇప్పటికే మరిన్ని దేశాల్లో టెస్టింగ్ ప్రారంభమయ్యాయి.

వాట్సాప్ ఫీచర్‌లలో చాలా వరకు ఎన్‌క్రిప్షన్ అందిస్తుంది. స్టిక్కర్‌లు, ఏఐ స్టిక్కర్‌లు కూడా ప్రమాణాల ప్రకారం ప్రొటెక్ట్ చేస్తుంది. ఇటీవలి నెలల్లో వాట్సాప్‌కు లేటెస్ట్ మెటా ఏఐ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. మెసేజింగ్ యాప్ ఇప్పటికే లామా 3 ఏఐ మోడల్ ద్వారా ఆధారితమైన ఏఐ చాట్‌బాట్ కోసం పరీక్షిస్తోంది. త్వరలో మెటా ఏఐ వాయిస్ ఫీచర్ కూడా అందుబాటులోకి రానుంది. చాట్ జీపీటీ 4o వాయిస్ మోడ్‌కి పోటీదారుగా ఉంటుంది. కానీ, ఉచితంగా మిలియన్ల మందికి ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంటుంది.

Read Also : Best WhatsApp Tricks : వాట్సాప్ యూజర్లకు 3 బెస్ట్ ట్రిక్స్.. ఫోన్ నెంబర్ సేవ్ చేయకుండానే సెకన్లలో చాట్ చేయొచ్చు!