BSNL New Plans : బీఎస్ఎన్ఎల్ నుంచి సరసమైన ధరకే రెండు సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు.. అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్ కోసం ఈ ప్లాన్లు ట్రై చేయండి!

BSNL New Plans : దేశీయ ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం (BSNL) పోర్ట్‌ఫోలియోలో రెండు కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లలో రూ.269, రూ.769 ప్యాక్‌లను అందిస్తోంది. అందులో ఒకే విధమైన బెనిఫిట్స్ పొందవచ్చు.

BSNL New Plans : బీఎస్ఎన్ఎల్ నుంచి సరసమైన ధరకే రెండు సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు.. అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్ కోసం ఈ ప్లాన్లు ట్రై చేయండి!

BSNL launches Rs 269 and Rs 769 prepaid plans with unlimited benefits

Updated On : October 14, 2022 / 5:12 PM IST

BSNL New Plans : దేశీయ ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం (BSNL) పోర్ట్‌ఫోలియోలో రెండు కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లలో రూ.269, రూ.769 ప్యాక్‌లను అందిస్తోంది. అందులో ఒకే విధమైన బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ రెండు ప్లాన్ల వ్యాలిడిటీ టైమ్ పరంగా మాత్రమే విభిన్నంగా ఉంటాయి. సరసమైన ధరలో అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్ కోరుకునే వారికి కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను పొందవచ్చు. అవేంటో ఓసారి లుక్కేయండి.

రూ. 269 ప్రీపెయిడ్ ప్లాన్‌ :
BSNL నుంచి లేటెస్ట్ రూ.269 ప్రీపెయిడ్ ప్లాన్ రోజువారీగా 2GB డేటాను అందిస్తుంది. కొత్త రీఛార్జ్ ప్లాన్‌లో ఏదైనా నెట్‌వర్క్‌కి అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ పొందవచ్చు. అలాగే రోజుకు 100 SMSలను కూడా పొందవచ్చు. కంపెనీ BSNL ట్యూన్‌లను కూడా ఉచితంగా అందిస్తుంది.

ప్రాథమికంగా ఎవరైనా తమకు ఇష్టమైన పాటను కాలర్ ట్యూన్‌గా సెట్ చేసేందుకు అనుమతిస్తుంది. ఇందులో మార్పులకు లిమిట్ లేదు. ఈ బెనిఫిట్స్‌తో పాటు.. కస్టమర్‌లు ఈరోస్ నౌ ఎంటర్‌టైన్‌మెంట్, ఛాలెంజెస్ అరేనా గేమ్‌లు, లిస్ట్న్ పోడ్‌కాస్ట్ సర్వీసెస్, హార్డీ మొబైల్ గేమ్ సర్వీస్, లోక్‌ధున్, జింగ్‌లకు కూడా యాక్సెస్ పొందవచ్చు.

BSNL launches Rs 269 and Rs 769 prepaid plans with unlimited benefits

BSNL launches Rs 269 and Rs 769 prepaid plans with unlimited benefits

రూ. 769 ప్రీపెయిడ్ ప్లాన్‌ :
రూ.769 ప్యాక్ టెల్కో నుంచి మరో కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ పొందవచ్చు. మునుపటి ప్లాన్‌ను పోలి ఉంటుంది. దాని వ్యాలిడిటీ కారణంగా ధర ఎక్కువగా ఉంటుంది. ఈ రీఛార్జ్ ప్యాక్‌తో.. కస్టమర్‌లు రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్ పొందవచ్చు. రోజువారీగా 100 SMSలను పొందవచ్చు.

రూ. 269 ప్లాన్‌తో కస్టమర్లు పొందుతున్న అన్ని అదనపు బెనిఫిట్స్ పొందవచ్చు. రూ.769 ప్యాక్ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చేశాయి. ఇందులో మీకు ఆసక్తి ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్లను ఇప్పుడే కొనుగోలు చేయవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : BSNL offer 5G Plans : భారత్‌లో BSNL 4G, 5G సర్వీసులు అప్పుడేనట.. ఆ తర్వాతే సరసమైన ధరకు 5G ప్లాన్లు..!