మార్చి 31 వరకే : BSNL కస్టమర్లకు క్యాష్ బ్యాక్ ఆఫర్లు

ప్రభుత్వ టెలికం రంగ సంస్థ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) BSNL తమ కస్టమర్లకు సమ్మర్ కానుకగా క్యాష్ బ్యాక్ ఆఫర్లు అందిస్తోంది. బీఎస్ఎన్ఎల్ యానివల్ ప్లాన్లపై అందించే క్యాష్ బ్యాక్ ను పొడిగించింది.

  • Published By: sreehari ,Published On : March 7, 2019 / 08:53 AM IST
మార్చి 31 వరకే : BSNL కస్టమర్లకు క్యాష్ బ్యాక్ ఆఫర్లు

Updated On : March 7, 2019 / 8:53 AM IST

ప్రభుత్వ టెలికం రంగ సంస్థ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) BSNL తమ కస్టమర్లకు సమ్మర్ కానుకగా క్యాష్ బ్యాక్ ఆఫర్లు అందిస్తోంది. బీఎస్ఎన్ఎల్ యానివల్ ప్లాన్లపై అందించే క్యాష్ బ్యాక్ ను పొడిగించింది.

మీరు BSNL బ్రాడ్ బ్యాండ్ కస్టమర్లా? అయితే మీకో గుడ్ న్యూస్. ప్రభుత్వ టెలికం రంగ సంస్థ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) BSNL తమ కస్టమర్లకు సమ్మర్ కానుకగా క్యాష్ బ్యాక్ ఆఫర్లు అందిస్తోంది. బీఎస్ఎన్ఎల్ యానివల్ ప్లాన్లపై అందించే క్యాష్ బ్యాక్ ను పొడిగించింది. సమ్మర్ స్పెషల్ కానుకగా కస్టమర్లకు యానివల్ ప్లాన్లపై 25 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోంది. మార్చి 31 వరకు గడువు విధించింది. ఇలోగా బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు ఈ ప్లాన్ ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ మేరకు బీఎస్ఎన్ఎల్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో ప్రకటించింది. గమనించాల్సిన విషయం.. ఈ ఆఫర్ కేవలం BSNL బ్రాడ్ బ్యాండ్ కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది.
Also Read : ఆల్ ఇన్ వన్ : వాట్సాప్ తరహాలో ఫేస్ బుక్ ప్రైవసీ ప్లాట్ ఫాం

2018 డిసెంబర్ లోనే BSNL బ్రాడ్ బ్యాండ్ ఎగ్జిస్ట్, కొత్త కస్టమర్ల కోసం 25 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ను ప్రకటించింది. ఇందులో బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్, బ్రాడ్ బ్యాండ్, బ్రాడ్ బ్యాండ్ వైఫై సబ్ స్ర్కైబర్లకు యానివల్, హాఫ్ ఇయర్లీ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లను అందించింది. ఇప్పుడు ఇదే యానివల్ ప్యాన్ పై ఉన్న క్యాష్ బ్యాక్ ఆఫర్ ను మార్చి 31, 2019 వరకు పొడిగించినట్టు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. ఇంకెందుకు ఆలస్యం.. క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందాలంటే వెంటనే త్వరపడిండి..

గమనిక: నెలకు ఒకసారి మాత్రమే ప్లాన్ మార్చుకునేందుకు అవకాశం ఉంది. ఇదివరకే ప్లాన్ మార్చుకోవడంపై రిక్వస్ట్ ఇచ్చి ఉంటే.. కొత్త రిక్వస్ట్ క్రియేట్ కాదు. తొలుత క్రియేట్ అయిన రిక్వెస్ట్ కు సంబంధించిన బిల్లుపై మాత్రమే కస్టమర్ అకౌంట్ లో క్యాష్ బ్యాక్ క్రెడిట్ అవుతుంది. యానివల్ ప్లాన్ బిల్ పేమెంట్ చేశాక.. కస్టమర్ అకౌంట్ లో క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది. ఈ క్యాష్ బ్యాక్ అమౌంట్ ను కస్టమర్లు బీఎస్ఎన్ఎల్ ఇతర సర్వీసులకు వినియోగించుకోవచ్చు.   

BSNL క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందాలంటే.. ఈ Steps ఫాలో అవ్వండి..
BSNL బ్రాండ్ బ్యాండ్ కనెక్షన్ పేజీలో లాగిన్ అవ్వండి.
సబ్ స్ర్కైబ్ బటన్ పై Agree పై టిక్ చేయండి. వెంటనే కొత్త విండో ఓపెన్ అవుతుంది.
ఇక్కడ మీ సర్వీసు ఐడీ (ల్యాండ్ లైన్ లేదా FTTH బ్రాండ్ బ్యాండ్ నెంబర్) CAPTCHA తో ఎంటర్ చేయండి
మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది. 
మొబైల్ కు వచ్చిన OTP నెంబర్ ను ఇందులో ఎంటర్ చేసి వ్యాలీడెట్ పై క్లిక్ చేయండి
*  ఇక్కడ మీ వివరాలను Verify చేసుకోవాల్సి ఉంటుంది.
* Exist ప్లాన్, యానివల్ ప్లాన్ ఏది కావాలో సెలెక్ట్ చేసుకొని వెరీఫై చేసుకోండి. 
* 25 % క్యాష్ బ్యాక్  కోసం ప్లాన్ మార్చుకోవాలనుకుంటే.. submit బటన్ పై క్లిక్ చేయండి.
* ప్లాన్ మార్చుకోనే అవసరం లేకుంటే మాత్రం cancel బటన్ పై క్లిక్ చేయండి.  
* ఆర్డర్ క్రియేట్ కాగానే.. చేంజ్ రిక్విస్ట్ నెంబర్ తో కూడిన ఓ మెసేజ్ స్ర్కీన్ పై డిసిప్లే అవుతుంది. 

Also Read: గుడ్ న్యూస్ : డబుల్ కానున్న కనీస వేతనం