BSNL Offers : BSNL బంపర్ ఆఫర్.. ఏకంగా 150 రోజుల ప్లాన్.. OTT బెనిఫిట్స్, దేశంలో ఎక్కడికైనా ఫ్రీ కాల్స్..!

BSNL 150 Day Plan : సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లతో BSNL వినియోగదారులను ఊరిస్తోంది. అతి తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. తక్కువ ధర ఎక్కువ వ్యాలిడిటీ, మరెన్నో బెనిఫిట్స్ అందిస్తోంది.

BSNL Flash Sale

BSNL Offers : దేశీయ ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం ఆపరేటర్ BSNL ప్రైవేట్ టెలికాం కంపెనీలకు పోటీగా ఆకర్షణీయమైన రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెడుతోంది. అందులోనూ సరసమైన ధరలో రీఛార్జ్ ప్లాన్లను అందిస్తూ టెలికం ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.

Read Also : Jio Offers : జియోనా మజాకా.. చీపెస్ట్ ప్లాన్ అదుర్స్.. ఏకంగా 200 రోజులు.. ఫ్రీ కాల్స్, హైస్పీడ్ డేటా..!

తమ యూజర్లతో పాటు ఇతర నెట్‌వర్క్ యూజర్లను కూడా ఆకర్షించేందుకు బీఎస్ఎన్ఎల్ ఈ సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లను ఆఫర్ చేస్తోంది. వచ్చే జూన్ 2025 నాటికి దేశంలో 5G సర్వీసులను BSNL ప్రారంభించనుంది.

అదే సమయంలో ఒక లక్ష కొత్త మొబైల్ టవర్‌లను ఇన్‌స్టాల్ చేసే లక్ష్యంతో 4G నెట్‌వర్క్‌ను విస్తరించనుంది. రాబోయే నెలల్లో యూజర్లకు మెరుగైన కనెక్టివిటీని అందించేందుకు 75వేల కన్నా ఎక్కువ కొత్త 4G టవర్లు ఇప్పటికే ఏర్పాటు చేసినట్టు నివేదికలు సూచిస్తున్నాయి.

BSNL రూ. 397 ప్లాన్ : 150 రోజుల వ్యాలిడిటీ : 

బీఎస్ఎన్ఎల్ కేవలం రూ.397 ధరకే లాంగ్ టైమ్ రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తోంది. 150 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం.. ఈ బడ్జెట్-ఫ్రెండ్లీ ప్లాన్‌లో మరెన్నో బెనిఫిట్స్ ఉన్నాయి.

  • మొదటి 30 రోజులు భారత్ అంతటా అన్‌లిమిటెడ్ కాలింగ్
  • వ్యాలిడిటీ ఉన్నంత వరకు ఫ్రీ నేషనల్ రోమింగ్
  • ఫస్ట్ 30 రోజులు రోజుకు 2GB హై-స్పీడ్ డేటా (60GB డేటా )
  • మొదటి 30 రోజులు రోజుకు 100 ఫ్రీ SMS
  • ప్రారంభ 30 రోజుల వ్యవధి తర్వాత కూడా 150 రోజుల పాటు యాక్టివ్‌గా ఉంటుంది.
  • ఇన్‌కమింగ్ కాల్స్, అదనపు కాలింగ్ బెనిఫిట్స్ కూడా పొందొచ్చు.

Read Also : Jio Best Offers : జియో యూజర్లకు పండగే.. 365 రోజుల ప్లాన్ భలే ఉందిగా.. 912GB హైస్పీడ్ డేటా, కాలింగ్ బెనిఫిట్స్..!

BSNL రీఛార్జ్‌తో ఫ్రీ లైవ్ టీవీ, OTT బెనిఫిట్స్ :
టెలికాం బెనిఫిట్స్‌తో పాటు BSNL ఈ ఏడాది ప్రారంభంలో ప్రవేశపెట్టిన డైరెక్ట్-టు-మొబైల్ స్ట్రీమింగ్ సర్వీస్ (BiTV)కి ఫ్రీ యాక్సెస్‌ను కూడా అందిస్తోంది. ప్రతి రీఛార్జ్‌తో యూజర్లు ఈ కింది బెనిఫిట్స్ పొందవచ్చు.

400+ లైవ్ టీవీ ఛానెల్స్ ఉచితం :
ఎంపిక చేసిన OTT ప్లాట్‌ఫామ్‌లకు ఫ్రీ యాక్సెస్ పొందవచ్చు.