ChatGPT Whatsapp : వాట్సాప్‌లో మెసేజ్ చేయడం మీకు నచ్చదా? ఈ ChatGPT టూల్.. మీ వాట్సాప్ మెసేజ్‌లకు అదే ఆన్సర్ ఇస్తుంది తెలుసా?
ChatGPT Whatsapp : మీకు వాట్సాప్‌లో స్నేహితులతో ఎవరైనా చాటింగ్ చేయడం అసలు ఇష్టం ఉండదా? అయితే డోంట్ వర్రీ.. మీరు చేయాల్సిన పని ChatGPT చేస్తుంది. మీరు ఏదైనా మెసేజ్ చేయాలనుకుంటే.. వాట్సాప్ మెసేజ్‌లను ChatGPT ద్వారా సమాధానం ఇవ్వొచ్చు.

ChatGPT Whatsapp _ Don’t like texting_ Soon ChatGPT can reply to your WhatsApp texts on your behalf
ChatGPT Whatsapp : మీకు వాట్సాప్‌లో స్నేహితులతో ఎవరైనా చాటింగ్ చేయడం అసలు ఇష్టం ఉండదా? అయితే డోంట్ వర్రీ.. మీరు చేయాల్సిన పని ChatGPT చేస్తుంది. మీరు ఏదైనా మెసేజ్ చేయాలనుకుంటే.. వాట్సాప్ మెసేజ్‌లను ChatGPT ద్వారా సమాధానం ఇవ్వొచ్చు. వాట్సాప్‌లో (WhatsApp) మెసేజ్‌ల కోసం ChatGPT ఇంటర్నల్ ట్యాబ్ అందుబాటులో లేదు. కానీ, వాట్సాప్ యూజర్లు GitHubని ఉపయోగించి వాట్సాప్‌తో ChatGPTని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఇంటిగ్రేషన్ తర్వాత ChatGPT మీ తరపున వాట్సాప్‌లో మెసేజ్‌లకు సమాధానాలు ఇస్తుంది.
ChatGPT మెసేజింగ్ సామర్థ్యాలపై ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంది. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) చేయలేనిది ఈ ChatGPT చేయగలదని గమనించాలి. మీ ప్రశ్నలకు కచ్చితమైన పద్ధతిలో రెస్పాండ్ అవుతుంది. అదేవిధంగా, మీ మెసేజ్‌లను పంపేందుకు AI టూల్ ద్వారా చేయొచ్చు. హ్యుమన్ రైటింగ్ మెసేజ్, మిషిన్ రాసిన మెసేజ్ మధ్య తేడాను గుర్తించడం ఇకపై యూజర్లకు కష్టంగా ఉంటుంది. అందుకే, ChatGPTను వాట్సాప్‌లో ఇంటిగ్రేట్ చేసేందుకు ఉపయోగించే పైథాన్ స్క్రిప్ట్ (Python Scrpit)ను డెవలపర్ డేనియల్ గ్రాస్ రూపొందించారు.

ChatGPT Whatsapp _ Don’t like texting_ Soon ChatGPT can reply
ఈ స్క్రిప్ట్ సాయంతో మీరు ChatGPT ద్వారా ఈజీగా చాటింగ్ చేయవచ్చు. మీ తరపున మీ స్నేహితులతో ఈ ChatGPT మాట్లాడుతుంది. పైథాన్ స్క్రిప్ట్‌ను ఉపయోగించడానికి మీరు అవసరమైన ఫైల్‌లను కలిగిన WebPage నుంచి లాంగ్వేజీ లైబ్రరీని డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీరు లాంగ్వేజీ లైబ్రరీని డౌన్‌లోడ్ చేసిన తర్వాత మీరు ‘WhatsApp-gpt-main’ ఫైల్‌ను ఓపెన్ చేయాలి. ‘server.py’ డాక్యుమెంట్ రన్ చేయాలి. వాట్సాప్‌లో ChatGPTని సెటప్ చేసే ప్రాసెస్ ప్రారంభిస్తుంది. సర్వర్ రన్ అవుతున్నప్పుడు మీరు ‘Is’ అని టైప్ చేసి ఎంటర్ Tap చేయండి. ఆపై ‘python server.py’పై Click చేయండి. OpenAI చాట్ పేజీలో మీ ఫోన్ నంబర్‌ను ఆటోమాటిక్‌గా సెటప్ చేస్తుంది.
మీరు రోబోట్ కాదని వెరిఫై చేసేందుకు ‘Confirm Iam a Human’ బాక్స్‌పై Click చేయాలి. మీరు ఇలా చేసిన తర్వాత.. WhatsApp అకౌంట్లో OpenAI ChatGPTని కనుగొని చాట్ చేయడం ప్రారంభించవచ్చు. వాట్సాప్‌లో ChatGPT స్క్రిప్ట్‌ని ఉపయోగించడం కృత్రిమ మేధస్సు (AI) శక్తిని వినియోగించేందుకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
ChatGPT వైడ్ రేంజ్ అంశాలపై ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలదు. నిర్దిష్ట విషయం గురించి మరింత తెలుసుకునేందుకు లేదా AIతో ఆకర్షణీయమైన చాటింగ్ కోరుకునే ఎవరికైనా వాల్యుబల్ టూల్ అందిస్తుంది. యాప్ స్టోర్‌లు, క్రోమ్ వెబ్ స్టోర్‌లలో కనిపించే ఫేక్ ChatGPT WhatsApp అప్లికేషన్‌ల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. OpenAI లేదా Meta అధికారికంగా మెసేజింగ్ యాప్‌తో AI సపోర్టు ఇచ్చే యాప్‌ను ప్రారంభించలేదు.
Read Also : WhatsApp Upcoming Feature : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై పంపిన మెసేజ్‌లను కూడా ఎడిట్ చేయొచ్చు..!