China New Space Station : అంతరిక్షంలో కొత్త స్పేస్ స్టేషన్.. వ్యోమగాములను పంపిన చైనా

వచ్చే ఏడాది 2021లో అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. అంతరిక్ష కేంద్రానికి (Space Station‌) చైనా ముగ్గురు వ్యోమగాములను గగనంలోకి పంపింది. చైనా పంపే నాలుగు అంతరిక్ష నౌకలలో ఇది మొదటిది. 

China New Space Station : అంతరిక్షంలో కొత్త స్పేస్ స్టేషన్.. వ్యోమగాములను పంపిన చైనా

China Successfully Launches Three Astronauts To New Space Station

Updated On : June 17, 2021 / 12:53 PM IST

China Three Astronauts New Space Station : వచ్చే ఏడాది 2021లో అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. అంతరిక్ష కేంద్రానికి (Space Station‌) చైనా ముగ్గురు వ్యోమగాములను గగనంలోకి పంపింది. చైనా పంపే నాలుగు అంతరిక్ష నౌకలలో ఇది మొదటిది.

వాయువ్య గన్సు ప్రావిన్స్‌లోని జియుక్వాన్‌ నుంచి Shenzhou-12 వ్యోమనౌకను లాంగ్‌మార్చ్‌-2F రాకెట్‌ ద్వారా ప్రయోగించారు. చైనా కాలమానం ప్రకారం.. ఉదయం 9.22 గంటలకు ఈ వ్యోమనౌక ద్వారా 3 వ్యోమగాములను 1.22 నిమిషాలకు అంతరిక్షంలోకి పంపింది.

పొగలు కక్కుతూ రాకెట్‌ 10 నిమిషాల్లో కక్ష్యకు చేరుకుంది. ఆ తర్వాత రాకెట్‌ నుంచి అంతరిక్ష నౌక వేరు అయింది. ఈ నౌకలో నీ హైషెండ్‌, లియు బోమింగ్‌, టాంగ్‌ హాంగ్‌బో వ్యోమగాములను నింగిలోకి తరలించినట్లు చైనా మాన్డ్‌ స్పేస్‌ ఏజెన్సీ (CMSA) పేర్కొంది.

చైనా సొంత స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. మూడు నెలలు అంతరిక్షంలోనే గడపనున్నారు. వీడియోను స్థానిక మీడియా చాన్నళ్లు లైవ్ టెలిక్యాస్ట్  చేశారు. వచ్చే నెలలో చైనా కమ్యూనిస్టు పార్టీ  వందేళ్ల సంబరాలు జరుపుకోనుంది. అంతకంటే ముందుగానే చైనా ఈ మిషన్‌ను చేపట్టింది.