Covid-19 Vaccine Certificate: కొవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ డౌన్‌లోడ్ చేసుకోండిలా..!
భారతదేశంలో కొవిడ్ సెకండ్ వేవ్ కేసులు ఈ నెలలో వరుసగా నాలుగు రోజులు కొవిడ్ కేసులు 4 లక్షలకు పైగా నమోదు చేసింది. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ టీకాలు వేసేందుకు ప్రభుత్వం అనుమతించింది.

Covid 19 Vaccine Certificate
Covid-19 Vaccine Certificate : భారతదేశంలో కొవిడ్ సెకండ్ వేవ్ కేసులు ఈ నెలలో వరుసగా నాలుగు రోజులు కొవిడ్ కేసులు 4 లక్షలకు పైగా నమోదు చేసింది. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ టీకాలు వేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. కొవిడ్ వ్యాక్సిన్ 17 కోట్ల మోతాదులను అందించిన భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా వ్యాక్సినేషన్ అందించిన దేశంగా నిలిచింది. ఇప్పటివరకు 24,70,799 సెషన్ల ద్వారా మొత్తం 17,01,76,603 వ్యాక్సిన్ మోతాదులను అందించినట్లు మంత్రిత్వ శాఖ డేటా తెలిపింది. ప్రస్తుతం, భారతదేశంలో రెండు టీకాలు అందుబాటులో ఉన్నాయి.
అందులో కోవిషీల్డ్ (Covishield), సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) భారత్ బయోటెక్ కోవాక్సిన్ (Covaxin) అభివృద్ధి చేసింది. టీకా మొదటి మోతాదును తీసుకున్న తర్వాత టీకా సర్టిఫికెట్‌ను ప్రభుత్వం జారీ చేస్తుంది. మొదటి మోతాదు పొందిన వెంటనే ఇది జారీ చేస్తుంది. సర్టిఫికేట్ పేరు, వయస్సు, లింగం, టీకాకు సంబంధించి అన్ని వివరాలు అందులో ఉంటాయి. టీకా వివరాల్లో టీకా పేరు, మొదటి మోతాదును తీసుకున్న తేదీ, తదుపరి గడువు తేదీ, టీకాలు వేసిన సెంటర్ వంటి అన్ని వివరాలను సర్టిఫికేట్ ద్వారా పొందవచ్చు.
కొవిడ్ -19 టీకా సర్టిఫికెట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే? :
కోవిన్ -19 టీకా సర్టిఫికెట్‌ను కోవిన్ పోర్టల్ (CoWin Portal) నుంచి ఆరోగ్య సేతు యాప్ (Aarogya Setu) నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ సర్టిఫికేట్‌ను ఎన్నోరకాలుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కొవిడ్-19 టీకా సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ కింది విధంగా ఫాలో అవ్వండి.
CoWIN యాప్ ద్వారా డౌన్‌లోడ్ :
– కొవిన్ పొర్టల్ https://www.cowin.gov.in/ లింక్ ఓపెన్ చేయండి.
– Sign In/Register బటన్ పై క్లిక్ చేయండి.
– మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ద్వారా Sign in అవ్వండి. OTP నెంబర్ వస్తుంది.
– Certificate Tab కింద మీ పేరు ఉంటుంది.
– మీ Beneficiary reference ID ఎంటర్ చేయండి.
– Search Option దగ్గర క్లిక్ చేయండి.
– Download Covid Vaccine Certificate ఆప్షన్ క్లిక్ చేయండి.
– మీ స్మార్ట్ ఫోన్లో కొవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ డౌన్ లోడ్ అయిపోతుంది.
CoWIN యాప్ అందుబాటులో లేకపోతే.. CoWIN పోర్టల్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఆరోగ్య సేతు (Aarogya Setu) ద్వారా డౌన్ లోడ్ :
గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ లో Aarogya Setu యాప్ అందుబాటులో ఉంది.
– యాప్ ను లేటెస్ట్ సాఫ్ట్ వేర్ వెర్షన్‌కు అప్ గ్రేడ్ చేసుకోండి.
– కొవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
– మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ద్వారా Sign in అవ్వండి.
– CoWIN ట్యాబ్ పై క్లిక్ చేయండి.
– వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఆప్షన్ పై Click చేయండి.
– Beneficiary certificate ఎంటర్ చేసి.. వ్యాక్సిన్ నేషన్ సమయంలో ఈ ఐడీ ఇస్తారు.
– Get Certificate బటన్ పై క్లిక్ చేయండి..
– మీ స్మార్ట్ ఫోన్ లో కొవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ డౌన్ లోడ్ చేసుకోండి.