Credit Cards Stocks : స్టాక్‌లలో పెట్టుబడి పెడుతున్నారా? మీ క్రెడిట్ కార్డ్‌తో ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలుసా?
Credit Cards Stocks : క్రెడిట్ కార్డ్‌లతో రివార్డ్‌లు లేదా క్యాష్‌బ్యాక్‌లు మాత్రమే కాదు.. వినియోగదారులు ఆయా రివార్డ్‌లను స్టాక్‌లు లేదా ఇటిఎఫ్‌లలో పెట్టుబడి పెట్టడానికి కూడా ఉపయోగించవచ్చు.

Credit Cards
Credit Cards Stocks : మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే, ఇది మీకోసమే.. చాలా మంది క్రెడిట్ కార్డ్ వినియోగదారులు సాధారణంగా షాపింగ్ లేదా ఇతర ఆన్‌లైన్ పేమెంట్ల కోసం ఎక్కువగా వాడేస్తుంటారు. కొంతమంది నెల ప్రారంభంలో సరుకులను కొనుగోలు చేయడం, ఆ తర్వాతి తేదీలో చెల్లించడం చేస్తుంటారు. ధర గురించి ఆందోళన చెందకుండా క్రెడిట్ కార్డ్ సాయంతో ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో షాపింగ్ చేయడం వెరీ కామన్.
అలాంటి క్రెడిట్ కార్డ్ ద్వారా ఆర్థిక ప్రయోజనాలతో పాటు సరైన సమయంలో చెల్లింపులు చేయకుంటే అంతే భారంగా మారుతుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, క్రెడిట్ కార్డులతో ఇతర ప్రయోజనాలను ఎలా పొందవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
క్రెడిట్ కార్డులను అవసరాలకు మాత్రమే వాడటం తప్పా పెట్టుబడి కోసం కూడా ఉపయోగించవచ్చని చాలామంది కార్డ్ వినియోగదారులకు తెలియదు. ఉదాహరణకు.. మీరు ఆకర్షణీయమైన వాల్యుయేషన్‌ల కారణంగా స్టాక్ మార్కెట్‌లలో తక్షణ ప్రాతిపదికన రూ. 2 లక్షలు పెట్టుబడి పెట్టాలనుకోవచ్చు.
అలాంటి సమయంలో మీకు లిక్విడిటీ క్యాష్ తక్కువగా ఉంటే.. మీరు నేరుగా పెట్టుబడి పెట్టడానికి మీ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించవచ్చు లేదంటే.. రూ. 2 లక్షల పెట్టుబడి పెట్టడానికి మీ క్రెడిట్ లిమిట్‌పై లోన్ కూడా పొందవచ్చు. పర్సనల్ లోన్ పెంచడం లేదా పెట్టుబడి కోసం క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడం సరైనది కానప్పటికీ, పెట్టుబడిదారుల సమితి కొన్ని పరిస్థితులలో దీన్ని ఆచరణీయమైన ఎంపికగా భావించవచ్చు. పెట్టుబడికి అవసరమైన విధంగా క్రెడిట్ కార్డ్‌ని ఏ విధంగా ఉపయోగించాలో కొన్ని కీలక విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పెట్టుబడికి క్రెడిట్ కార్డు వాడకం :
నేరుగా కొనుగోలు చేయండి : కొన్ని బ్రోకరేజీలు పెట్టుబడిదారులను క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి స్టాక్‌లను కొనుగోలు చేసేందుకు వీలు కల్పిస్తాయి. ఇందులో రుసుము కూడా ఉండవచ్చు. నిబంధనలను పరిశీలించాలి. అధిక వడ్డీని నివారించడానికి మీరు కార్డ్ బ్యాలెన్స్‌ను త్వరగా క్లియర్ చేయడం చాలా ముఖ్యం.
రివార్డ్‌లు, పాయింట్‌లు : సాధారణంగా ఏదైనా ఖర్చుపై రివార్డ్‌లు లేదా క్యాష్‌బ్యాక్ అందించే క్రెడిట్ కార్డ్‌లను వాడుతుంటారు. అయితే, క్రెడిట్ కార్డ్ వినియోగదారులు ఆ రివార్డ్‌లను స్టాక్‌లు లేదా ఇటిఎఫ్‌లలో పెట్టుబడి పెట్టడానికి ఉపయోగించవచ్చు. అది నేరుగా రుణాలు తీసుకోనప్పటికీ, పెట్టుబడి కోసం క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించేందుకు సరైన మార్గంగా చెప్పవచ్చు.
స్వల్పకాలిక ఫైనాన్సింగ్ : సమీప భవిష్యత్తులో స్టాక్ పెరుగుతుందని మీకు కచ్చితంగా తెలిస్తే.. మీరు పెట్టుబడి ప్రయోజనం కోసం క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించవచ్చు. అయితే, ఇది చాలా ప్రమాదకరమైనది.. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం.
అధిక మొత్తంలో వాడొద్దు : మీరు పెట్టుబడికి క్రెడిట్‌ని ఉపయోగించాలని ఎంచుకుంటే.. ఏదైనా పెట్టుబడిల వడ్డీని నివారించడానికి మీరు బ్యాలెన్స్‌ను పూర్తిగా చెల్లించేలా ఉండాలి.
క్యాష్ అడ్వాన్స్ : మీ క్రెడిట్ కార్డ్ నుంచి క్యాష్ అడ్వాన్స్ కూడా తీసుకోవచ్చు. పెట్టుబడి కోసం డబ్బును ఉపయోగించవచ్చు. అయినప్పటికీ, సాధారణంగా అధిక రుసుములు, వడ్డీ రేట్లను చెల్లించాల్సి వస్తుంది. క్యాష్ అడ్వాన్స్ తీసుకున్న వెంటనే ఈ వడ్డీ, రుసుముల ఛార్జీలు ప్రారంభమవుతాయి. అందుకే ఈ ఎంపిక అత్యంత ఖరీదైనగా చెప్పవచ్చు.
పరిగణించవలసిన ముఖ్య అంశాలివే :
అధిక వడ్డీ రేట్లు : క్రెడిట్ కార్డ్ లోన్‌పై విధించే వడ్డీ ఎక్కువగా ఉంటుందని గమనించాలి.
అప్పుల ముప్పు : పెట్టుబడుల కోసం క్రెడిట్‌ని ఉపయోగించడం కూడా అప్పులకు దారితీయవచ్చు.
అస్థిరత : స్టాక్‌లలో పెట్టుబడి పెట్టడం అనేది అనేక ఆర్థిక నష్టాలు ఉండొచ్చు. అప్పు తెచ్చుకున్న డబ్బును ఇతర పనులకు వాడితే ఆ నష్టం మరింత పెద్దదవుతుంది.
మీ ఆర్థిక పరిస్థితిని ఎల్లప్పుడూ సమీక్షించుకోండి. పెట్టుబడి కోసం క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించే ముందు ఆర్థిక సలహాదారుని సంప్రదించండి.